నాలాగ మీరూ మోసపోకండి.. థార్ మోడిఫికేషన్ కోసం రూ.12 లక్షల ఖర్చు, ఆ తర్వాతి నుంచి అన్నీ రిపేర్లే!!

కార్ కస్టమైజేషన్ అనేది చాలా మందికి ఓ క్రేజ్, దీనికోసం వారు ఎంత దూరమైన వెళ్తారు, ఎంతైనా ఖర్చు చేస్తారు. ఇందుకు ప్రధాన కారణం, ఇతర కార్లతో పోలిస్తే తమ కారు చాలా భిన్నంగా, విశిష్టంగా కనిపించాలనుకోవడం. సాధారణంగా, కార్ల తయారీ సంస్థలు ఒక కారును మార్కెట్లోకి విడుదల చేసిన తర్వాత, ఆ కారుకి సంబంధించిన అనేక రకాల ఉపకరణాలను (యాక్ససరీలను) కూడా మార్కెట్లో విడుదల చేస్తాయి. కాకపోతే, అవి చాలా పరిమితంగా మాత్రమే ఉంటాయి.

నాలాగ మీరూ మోసపోకండి.. థార్ మోడిఫికేషన్ కోసం రూ.12 లక్షల ఖర్చు, ఆ తర్వాతి నుంచి అన్నీ రిపేర్లే!!

కాబట్టి, చాలా వరకు కస్టమర్లు ఇలాంటి అఫీషియల్ యాక్ససరీలపై కాకుండా బయటి కంపెనీలు ఆఫర్ చేసే ఆఫ్టర్ మార్కెట్ యాక్ససరీలను మరియు కస్టమైజేషన్ ఆప్షన్లను ఎంచుకుంటుంటారు. నిజానికి, ఇవి కంపెనీ ఆఫర్ చేసే యాక్ససరీల ధర కన్నా తక్కువ ధరకే లభిస్తాయి. కానీ, అన్ని సందర్భాల్లో ఆఫ్టర్ మార్కెట్ మోడిఫికేషన్స్ అనే విజయవంతం కావు, కొన్ని కొన్నిసార్లు ఇవి వికటించి, అసలుకే ఎసరు పెడతాయి. అలాంటి ఓ సంఘటనే ఇది.

నాలాగ మీరూ మోసపోకండి.. థార్ మోడిఫికేషన్ కోసం రూ.12 లక్షల ఖర్చు, ఆ తర్వాతి నుంచి అన్నీ రిపేర్లే!!

వివరాల్లోకి వెళితే.. ఓ కస్టమర్ తన మహీంద్రా థార్ ఎస్‌యూవీని ఇతర థార్ ఎస్‌యూవీల కన్నా భిన్నంగా కనిపించేలా చేయాలనుకున్నాడు. ఇందుకోసం ఓ కార్ మోడిఫైయర్ ని ఆశ్రయించాడు. సదరు కార్ మోడిఫైయర్ ఈ కస్టమర్ నుండి ఏకంగా రూ.12 లక్షలు వసూలు చేశాడు. కట్ చేస్తే, ఇదిగో ఈ ఫొటోలలో కనిపించే తెలుపు రంగు థార్ తయారైంది. అంతా బాగానే ఉంది కదా సమస్య ఏంటంటారా..? ఇది బయటి నుండి చూడటానికి బాగానే ఉన్నప్పటికీ, లోపలంతా పూర్తి సమస్యలే.

నాలాగ మీరూ మోసపోకండి.. థార్ మోడిఫికేషన్ కోసం రూ.12 లక్షల ఖర్చు, ఆ తర్వాతి నుంచి అన్నీ రిపేర్లే!!

ఈ వీడియోలో మహీంద్రా థార్ యజమాని తన కొత్త మోడిఫైడ్ థార్ తో ఎదుర్కొంటున్న సమస్యలను ఒక్కొక్కటటిగా వివరించాడు. ఈ ఆఫ్టర్ మార్కెట్ మోడిఫికేషన్ కోసం దాదాపు రూ. 12 లక్షలు ఖర్చు చేశానని, కానీ కొన్ని నెలలకే కారులో సమస్యలు కనిపించడం ప్రారంభించాయని చెప్పుకొచ్చాడు. కారు లోపల ఎ-పిల్లర్‌పై అమర్చిన ఆఫ్టర్‌మార్కెట్ ఆడియో సిస్టమ్ పగుళ్లు ఏర్పడిందని కారు యజమాని వివరించాడు.

అంతేకాకుండా, కారు యొక్క వివిధ భాగాలలో అప్పుడే తుప్పు పట్టిన సంకేతాలు కూడా కనిపించాయి. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ గ్లాస్‌పై ఏదో అతుక్కొని ఉన్న ఫీలింగ్ ఉందని కారు ఓనర్ చెప్పుకొచ్చాడు. కారులో అమర్చిన యూఎస్‌బి పోర్ట్‌లు కూడా పని చేయడం లేదని వాటిని గట్టిగా నెట్టినప్పుడు హారన్ మోగుతుందని తెలిపాడు. ఈ ఎస్‌యూవీ యొక్క ట్రాన్స్‌మిషన్‌లో సమస్యలు వచ్చాయని తెలిపాడు. ఈ మోడిఫై చేయబడిన మహీంద్రా థార్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో కూడిన వెర్షన్.

నాలాగ మీరూ మోసపోకండి.. థార్ మోడిఫికేషన్ కోసం రూ.12 లక్షల ఖర్చు, ఆ తర్వాతి నుంచి అన్నీ రిపేర్లే!!

ఈ కారును మోడిఫై చేసిన కొన్ని రోజుల తర్వాత, గేర్‌బాక్స్‌లో సమస్యలు మొదలయ్యాయని, వాహనాన్ని సర్వీస్‌ సెంటర్‌కు తీసుకెళ్లగా గేర్‌బాక్స్‌లోని బోల్ట్‌ లను మార్చినట్లు సర్వీస్ ఇంజనీర్లు గుర్తించారు. కారు యజమాని ప్రకారం, సదరు కారు మోడిఫైయర్ ఈ థార్ ను కస్టమైజ్ చేసేటప్పుడు గేర్‌బాక్స్ కు సంబంధించిన ఒరిజినల్ బోల్ట్‌ను పోగొట్టుకున్నాడు, ఆ విషయాన్ని యజమానికి తెలియజేయకుండా దాని స్థానంలో వేరే (నకిలీ) బోల్ట్‌ ను ఇన్‌స్టాల్ చేశాడు. దీంతో గేర్‌బాక్స్ లో సమస్యలు మొదలయ్యాయి.

నాలాగ మీరూ మోసపోకండి.. థార్ మోడిఫికేషన్ కోసం రూ.12 లక్షల ఖర్చు, ఆ తర్వాతి నుంచి అన్నీ రిపేర్లే!!

గేర్‌బాక్స్ లో ని ఆ చిన్న నకిలీ బోల్ట్ కారణంగా, సదరు మహీంద్రా థార్ యజమాని అదనంగా రూ.13,000 వదిలించుకోవాల్సి వచ్చింది. ఆ మొత్తాన్ని సదరు కారు మాడిఫైయర్ నుండి డిమాండ్ చేయగా, దానిని చెల్లించేందుకు కార్ మోడిఫైయర్ నిరాకరించాడు. ఇవే కాకుండా కారు కిటికీలపై గీతలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు, కారు మోడిఫై చేసినప్పటి నుండి అంతా సమస్యలేనని, ఒకవేళ మీరు కూడా మీ కారును మోడిఫై చేయించుకోవాలనుకుంటే ఇలాంటి మోసగాళ్లతో జాగ్రత్తగా ఉండండని సదరు కారు యజమాని వీడియోలో తన బాధను వెళ్లగక్కాడు.

నాలాగ మీరూ మోసపోకండి.. థార్ మోడిఫికేషన్ కోసం రూ.12 లక్షల ఖర్చు, ఆ తర్వాతి నుంచి అన్నీ రిపేర్లే!!

చూశారుగా.. ఆఫ్టర్ మార్కెట్ మోడిఫికేషన్స్ ఎంత అందంగా ఉంటాయో, వాటి తర్వాత ఎదుర్యే అనుభవాలు కూడా అంతే భయంకరంగా ఉంటాయి. కాబట్టి మీరు కూడా మీ కారును ఆఫ్టర్ మార్కెట్ మోడిఫైయర్ నుండి కస్టమైజ్ చేయించుకోవాలని చూస్తున్నట్లయితే, సదరు కార్ మోడిఫైయింగ్ కంపెనీ చరిత్రను ఓసారి తిరగేయండి. ఆ కంపెనీకి చెడు ట్రాక్ రికార్డ్ లేదని నిర్ధారించుకోండి. కార్ మోడిఫికేషన్ చాలా ఖరీదైనది మరియు ఇది కారు యొక్క అసలు డిజైన్‌ ను కూడా పూర్తిగా మార్చేస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది మీకు చట్టపరమైన సమస్యలను కూడా తెస్తుంది అంతేకాదు కొత్త కార్ల విషయంలో ఇది కారు వారంటీని కూడా కోల్పోయేలా చేస్తుంది.

Most Read Articles

English summary
Mahindra thar owner spent rs 12 lakhs on aftermarket modifications facing sevaral issues
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X