దీన్నే పిచ్చి అంటారు సార్‌.. సముద్రంలో రీల్స్ ప్లాన్‌ చేశారు.. యముడి దయతో ప్రాణాలతో బయటపడ్డారు

ఈ మధ్య సోషల్‌ మీడియాలో ఫేమ్‌ కోసం చాలా మంది విభిన్న పద్ధుతుల్లో స్టంట్స్‌ వేస్తూ హల్‌చల్‌ చేస్తున్నారు. రీల్స్‌ కోసం ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వారు చేసే రీల్స్ బెడిసి కొడుతున్నాయి. అలాంటి సంఘటనే తాజాగా ఒకటి జరిగింది. అనుభవం లేని డ్రైవర్లు థార్‌ ఎస్‌యూవీలను బీచ్‌కి తీసుకెళ్లి అక్కడ రీల్స్ చేసే ప్రయత్నం చేశారు. వారు అనుకున్న ఫలితం రాకపోవడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. చివరకు బతుకు జీవుడా అంటూ ప్రాణాలతో బయటపడ్డారు. అసలేం జరిగింది. ఆ వీడియో సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

గుజరాత్‌లోని ఓ బీచ్‌లో రీల్స్‌ ద్వారా ఫేమస్‌ అయ్యేందుకు 4×4 ఎస్‌యూవీలతో స్టంట్స్ చేయబోయారు. చివరకు ఆ రెండు థార్స్‌ సముద్రంలో చిక్కుకుపోయాయి. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతుంది. రెండు థార్స్‌ చిక్కుకున్న 25 సెకన్ల వీడియో క్లిప్‌ ఆధారంగా ఒకటి ఎరుపు రంగు మరొకటి తెలుపు రంగు ఎస్‌యూవీలుగా ఉన్నాయి. వీరు వీటితో ఇన్‌స్ట్రాగ్రామ్‌ రీల్ చేయడానికి నీటిలోకి దిగారు.

Mahindra-Thar-Stuck-In-Sea

ఎస్‌యూవీ డ్రైవర్ కాస్త సాహసోపేతంగా వ్యవహరించి ఎస్‌యూవీని సముద్రంలోకి తీసుకెళ్లాని అనుకున్నారు. ఆ క్షణంలోనే మహీంద్రా థార్ నీటిలో చిక్కుకుపోయింది. రెడ్‌ కలర్‌ ఎస్‌యూవీ ముందు భాగం నీటోలో పూర్తిగా మునిగి సముద్రం వైపు వంగి ఉండటాన్ని మనం గమనించవచ్చు. వైట్ షేడ్‌లోని మరో మహీంద్రా థార్ కూడా ఇదే తరహాలో చిక్కుకుంది. ఈ వీడియోను బట్టి చూస్తే డ్రైవర్లు భయాందోళనతో బయటకు పరుగులు తీసినట్లు కనిపిస్తోంది.

అక్కడే ఉన్న కొందరు జాలర్లు అందులో ఉన్నవారిని రక్షించారు. ఆ తర్వాత ఇరుక్కుపోయిన ఎస్‌యూవీలను స్థానికుల సహాయంతో బయటకు తీశారు. రెండు మహీంద్రా థార్స్‌తో అక్కడ స్టంట్స్‌ ప్లాన్‌ చేసిన యువకులపై ముంద్రా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రెండు మహీంద్రా థార్స్‌ని కూడా స్వాధీనం చేసుకున్నారు. బీచ్ లో నీటికి చాలా దగ్గరగా డ్రైవింగ్ చేయడం చాలా సాహోసోపేతమైన చర్య అని చెప్పాలి. ముఖ్యంగా దేశంలోని చాలా బీచ్‌లలో ఇసుక బురదతో కూడుకుని ఉంటుంది.

Mahindra-Thar-Stuck-In-Sea

ఈ ఇసుక నీరు దరి చేరనప్పుడు గట్టిపడి కాంక్రీట్‌లాగా మారిపోతుంది. అలాగే బీచ్‌లో తడి ఇసుకలో మీ వాహనం టైరు ఇరుక్కుపోతే దాన్ని బయటకు తీయడం చాలా కష్టం. ఇసుక జిగట బురదలా మారి వాహన మూవ్‌మెంట్స్‌ని తగ్గిస్తుంది. అలాంటప్పుడు ఎస్యూవీని బయటకు తీయడానికి ఇబ్బందులు తలెత్తుతాయి. అయితే తాజాగా జరిగిన సంఘటనలో బురదలో ఇరుక్కుపోయిందా లేదా చక్రానికి ఇంకా ఏదైనా తట్టిందా అనే విషయం స్పష్టంగా తెలియ రాలేదు.

కారులోకి సముద్రపు నీరు చేరింది. ఈ కార్లలో ఇంజిన్ ఇంకా నడుస్తోందో లేదో అనుమానం ఉంది. ఎందుకంటే సముద్రపు నీరు ఉప్పుగా ఉండటమే దీనికి కారణం. మీరు ఎప్పుడైనా అటువంటి పరిస్థితిలో కనిపిస్తే నీటి మట్టం ఇంజిన్ దగ్గరకు చేరుకోగానే బయటకు వచ్చేయాలి. లేకపోతే వాహనానికి జరిగే నష్టాన్ని భరించలేరు. అంతే కాకుండా బయటకు తీసిన తర్వాత కూడా వాహనాన్ని స్టార్ట్ చేయవద్దు. మెకానిక్‌ షెడ్డుకి తీసుకెళ్లడం ఉత్తమం.

భారతదేశంలోని చాలా బీచ్‌లు డ్రైవింగ్‌కి అనుకూలంగా లేవు. అంతే కాకుండా చాలా బీచ్‌ల్లో డ్రైవింగ్ చేయడం కూడా చట్టవిరుద్ధం. ఎందుకంటే వీటిలో కొన్ని వన్యప్రాణులకు రక్షిత ఆవాసాలుగా ఉన్నాయి. అయితే దేశంలో చట్టబద్ధంగా డ్రైవింగ్ చేయగల ఏకైక బీచ్ కేరళలోని కన్నూర్ జిల్లాలోని ముళప్పిలంగాడ్‌లో ఉంది. ఇక్కడ డ్రైవింగ్‌ ఔత్సాహికులు రైడింగ్‌ చేస్తూ ఎంజాయ్‌ చేస్తారు. ఇలాంటి అనుకూల ప్రదేశాల్లో మాత్రమే డ్రైవింగ్‌ స్టంట్స్‌ చేయాలని పలువురు సూచిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Monday, June 24, 2024, 17:38 [IST]
English summary
Mahindra thar stunts on sea gone wrong in gujarat video surfaces internet
Read more on: #off beat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+