Car Accident ఓవర్‌ టేక్‌ చేస్తూ ఆడి కారును ఢీకొన్న మహీంద్రా థార్‌.. ఆ నిర్లక్ష్యమే కారణం..

భారత్‌లో ఆఫ్‌-రోడ్‌ సెగ్మెంట్‌లో మహీంద్రా థార్ SUV టాప్‌ ప్లేస్‌ ఉంది. అత్యంత ఆకర్షణీయంగా కనిపించే వాహనాల్లో థార్‌ ఒకటి. ఇది దాని ధృడమైన రూపం, భారీ ఆకారం, ప్రత్యేకమైన డిజైన్‌తో సాహస ప్రియులను ఆకర్షిస్తోంది. అయితే ఆ వాహనాన్ని నడపడంలో మాత్రం కొందరు ఫెయిల్‌ అవుతున్నారు. అందుకు ఈ యాక్సిడెంట్‌ నిదర్శనం.

కొంతమంది ఔత్సాహికులు థార్‌ ఎస్‌యూవీని దాని ఆకర్షణీయమైన లుక్‌ను చూసి కొనుగోలు చేస్తున్నారు. కానీ దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. రోడ్లపై ఇతర వాహనదారులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. మహీంద్రా థార్ మరియు ఆడి A4 మధ్య ఇటీవల జరిగిన ఓ ప్రమాదమే దీనికి ఉదాహరణ. దీనికి సంబంధించి వైరల్ అయిన వీడియో థార్ డ్రైవర్ యొక్క బాధ్యతారాహిత్య డ్రైవింగ్‌ను తెలియజేస్తుంది.

Car-Accident

ఈ ప్రమాదం ఉత్తరప్రదేశ్‌లో జరిగినట్లుగా సమాచారం. ఓ వేడుక కోసం సుందరంగా అలంకరించిన ఆడి A4 కారును థార్‌ ఎస్‌యూవీ డ్రైవర్‌ ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఆడి కారు స్వల్పంగా దెబ్బతింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను వీడియోలో స్పష్టంగా చూడవచ్చు.

ఈ రెండు కార్లు రోడ్డుపై వెళుతున్నాయి. ఆడి కారు రోడ్డుపై ఎడమవైపు లేన్‌లో వెళుతుండగా.. మహీంద్రా థార్‌ ఎస్‌యూవీ డ్రైవర్‌ ఆ కారును ఓవర్‌టేక్‌ చేసేందుకు యత్నించాడు. ఈ క్రమంలో థార్‌ వెనుక చక్రం మరియు కుడి వైపు ఫెండర్.. ఆడి A4 యొక్క ఫ్రంట్ ఫెండర్‌తో ఢీకొంది. ఫలితంగా, సెడాన్ అదుపు తప్పి రోడ్డుపైకి దూసుకెళ్లింది.

Car-Accident

ఈ మొత్తం ఘటనను మరొక వాహనంలో ఉన్న వ్యక్తి ఫోన్‌లో రికార్డు చేశారు. అదృష్టవశాత్తూ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం లేదా గణనీయమైన నష్టం సంభవించలేదు. అయితే థార్ డ్రైవర్‌ ప్రమాదకర రీతిలో అధిక వేగంతో ప్రయాణించడం మరియు రాంగ్ సైడ్ నుంచి ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించడాన్ని కూడా వీడియోలో చూడవచ్చు. ఇది నిర్లక్ష్య డ్రైవింగ్‌ను స్పష్టంగా తెలియజేస్తుంది.

ఈ వీడియోలో థార్ డ్రైవర్ రోడ్డుపై అందుబాటులో ఉన్న స్థలాన్ని దుర్వినియోగం చేశాడు. దీని కారణంగా, దాని బ్యాక్‌ ఫెండర్ ఆడి A4 యొక్క ఫ్రంట్ ఫెండర్‌ను వేగంగా ఢీకొట్టింది. దీంతో ఆడి A4 కారు అదుపు తప్పి రోడ్డుపైకి దూసుకెళ్లింది. ఆ సమయంలో ఆడి వెనుక లేదా పక్కన ఇతర కార్లు ఉండి ఉంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేది.

రోడ్డుపై వాహనాలను నడిపేటప్పుడు ప్రధానందా ఏదైనా కారు లేదా భారీ వాహనాలను నడిపే ముందు మనం వాహన దూరం గురించి తెలుసుకోవాలి. దాని గురించి తెలియకపోయినా ఇతర వాహనాల నుంచి సరైన డిస్టన్స్‌ పాటించాలి. లేదంటే ఈ వైరల్ వీడియో వంటి ప్రమాదాలకు దారి తీస్తుంది.

పబ్లిక్ రోడ్లపై విన్యాసాలు చేయడం లేదా నిర్లక్ష్యంగా ప్రవర్తించడం ఖచ్చితంగా నిషేధించబడింది. ఇది తీవ్రమైన పరిణామాలకు దారితీయవచ్చు. ముంబయిలో ఇటీవల జరిగిన ఒక సంఘటన అటువంటి చర్యల వల్ల కలిగే నష్టాలను గుర్తు చేస్తుంది. పబ్లిక్ రోడ్లపై విన్యాసాలు చేసిన యువకులకు కోర్టు ఆరు నెలల జైలు శిక్షను విధించింది.

దేశంలో ప్రపంచంలోనే అత్యధిక రోడ్డు ప్రమాదాల రేటును కలిగి ఉంది. గణనీయమైన సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్లపై ప్రమాదకరమైన విన్యాసాలు చేయకుండా వ్యక్తులను కంట్రోల్‌ చేయడం, అంతిమంగా మొత్తం రహదారి భద్రతను మెరుగుపరిచేందుకు నిఘా వ్యవస్థలు దోహదపడుతున్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, July 12, 2023, 19:24 [IST]
English summary
Mahindra thar suv driver hits audi a4 car while overtaking video gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+