ఎక్స్‌యూవీ 500 ని కాపాడిన మహీంద్రా థార్ ఎస్‌యూవీ, ఎలాగో చూసారా ?

ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా & మహీంద్రా ఇటీవల దేశీయ మార్కెట్లో థార్ ఎస్‌యూవీని విడుదల చేశారు. విడుదలైన అతి తక్కువ కాలంలోనే థార్ ఎస్‌యూవీ ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించింది. మహీంద్రా థార్ భారతదేశంలో అత్యంత చౌకైన ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ.

ఎక్స్‌యూవీ 500 ని కాపాడిన మహీంద్రా థార్ ఎస్‌యూవీ, ఎలాగో చూసారా ?

మహీంద్రా థార్ ఎస్‌యూవీ మంచి సామర్థ్యాన్ని కలిగి ఉంది. అంతే కాకుండా ఈ కార్ యొక్క డిజైన్ మరియు ఇంజిన్ పవర్ వంటివి ఇందులో అద్భుతంగా ఉంటాయి. ఈ ఎస్‌యూవీ ఎక్కువమంది ఆఫ్-రోడ్ వాహన ప్రియులకు ఇష్టమైన కారు. మహీంద్రా థార్ బుకింగ్స్ ఇప్పటికే మే 2021 కు రిజర్వు చేయబడ్డాయి. థార్ ఎస్‌యూవీకి మార్కెట్లో ఎంత ప్రజాదరణ ఉందో తెలుసుకోవడానికి ఇది నిలువెత్తు నిదర్శనం.

ఎక్స్‌యూవీ 500 ని కాపాడిన మహీంద్రా థార్ ఎస్‌యూవీ, ఎలాగో చూసారా ?

2020 మహీంద్రా థార్ ఎస్‌యూవీ యొక్క ఆప్ రోడ్ సామర్థ్యాలను తెలియజేస్తూ అనేక వీడియోలు ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేయబడ్డాయి. ఇప్పుడు మహీంద్రా థార్ మరో సారి తన అఫ్ రోడ్ కెపాసిటీని ఋజువు చేసుకుంది. బురదలో కూరుకుపోయిన ఎక్స్‌యూవీ 500 ఎస్‌యూవీని మహీంద్రా థార్ ఎలా బయటకు తీసుకువచ్చిందో ఈ వీడియోలో చూడండి.

MOST READ:ఎలక్ట్రిక్ వాహనాల వాడకంపై సంచలన నిర్ణయం తీసుకున్న జగన్ ప్రభుత్వం.. అదేంటో తెలుసా ?

ఎక్స్‌యూవీ 500 ని కాపాడిన మహీంద్రా థార్ ఎస్‌యూవీ, ఎలాగో చూసారా ?

ఈ వీడియో జెర్యీన్ 11 అనే యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయబడింది. వీడియోలో, మహీంద్రా ఎక్స్‌యూవీ 500 నది ఒడ్డున ఉన్న బురదలో ఇరుక్కుంది. దాని డ్రైవర్ కారుని బయటకు తీయడానికి ప్రయత్నించడం మనం ఇక్కడ వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోలో కనిపించే మహీంద్రా ఎక్స్‌యూవీ 500 డబ్ల్యూ 11 4-వీల్ డ్రైవ్ మోడల్ ఇప్పుడు ఉత్పత్తిలో లేదు.

ఎక్స్‌యూవీ 500 ని కాపాడిన మహీంద్రా థార్ ఎస్‌యూవీ, ఎలాగో చూసారా ?

ఇక్కడ మనం చూస్తున్న వీడియోలో మహీంద్రా థార్ ఎస్‌యూవీ మరో కారును రక్షించే మొదటి వీడియో ఇది. డ్రైవర్ కారు నుంచి బయటకు రావడానికి ప్రయత్నించడంతో ఎక్స్‌యూవీ 500 చక్రాలు బురదలో చిక్కుకున్నాయి. ఎంత ప్రయత్నించినా చివరకు ప్రయోజనం లేకుండా పోయింది.

MOST READ:ప్రపంచంలో అత్యంత ఖరీదైన వాచ్ ; దీని ధర తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు

ఎక్స్‌యూవీ 500 ని కాపాడిన మహీంద్రా థార్ ఎస్‌యూవీ, ఎలాగో చూసారా ?

మహీంద్రా థార్ ఎట్టకేలకు ఎక్స్‌యూవీ 500 ను బయటకు తీసుకురావడానికి సంకల్పించారు. థార్ ఎస్‌యూవీ యొక్క బూట్ ఎక్స్‌యూవీ 500 ముందు భాగంలో జతచేయబడుతుంది. అప్పుడు థార్ ఎస్‌యూవీ ముందుకు లాగడానికి ప్రయత్నిస్తుంది. ప్రారంభంలో ఎక్స్‌యూవీ 500 ముందుకు రాదు. కానీ నిరంతర ప్రయత్నం తరువాత, ఎక్స్‌యూవీ 500 బురద నుంచి బయటకు వస్తుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ 500 ఫోర్-వీల్ డ్రైవ్ కారు, అయితే ఇది బురదలో కూరుకుపోయింది. ఎక్స్‌యూవీ 500 రూపకల్పన కారణంగా, క్షీణిస్తున్న రహదారులపై దీన్ని నడపడం సాధ్యం కాదు. మహీంద్రా థార్ తక్కువ రేట్ గల గేర్‌బాక్స్ కలిగిన చిన్న వీల్‌బేస్ కారు.

MOST READ:బ్రేకింగ్.. 6 సీటర్ థార్ ఎస్‌యూవీని నిలిపివేయనున్న మహీంద్రా.. ఎందుకో తెలుసా !

ఎక్స్‌యూవీ 500 ని కాపాడిన మహీంద్రా థార్ ఎస్‌యూవీ, ఎలాగో చూసారా ?

మహీంద్రా థార్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ 500 కన్నా తక్కువ బరువు కలిగి ఉంది. అంతే కాకుండా ఇది ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా కలిగి ఉంది. మహీంద్రా థార్ ఎస్‌యూవీని 2 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్, 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ వేరియంట్లలో విక్రయిస్తున్నారు.

Source: Zeryeen11/ YouTube

Most Read Articles

English summary
Mahindra Thar SUV Pulls Out xuv 500 From Mud. Read in Telugu.
Story first published: Friday, December 11, 2020, 13:17 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X