కాలువలోకి జారిన బస్సు.. బయటకు తీయడానికి సిద్దమైన థార్ (వీడియో)
భారతదేశంలో 'మహీంద్రా థార్' SUVకు ఓ ప్రత్యేకమైన ఆదరణ ఉన్న విషయం అందరికి తెలుసు. ఎందుకంటే మంచి ఆఫ్ రోడింగ్ కెపాసిటీ కలిగిన ఈ కారు మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. ఇటీవల కాలువలో జారిన బస్సును థార్ బయటకు తీయడానికి ప్రయత్నించింది.
నివేదికల ప్రకారం.. వర్షం కారణంగా జారీ కాలువలోకి వెళ్లిన గవర్నమెంట్ బస్సును, మహీంద్రా థార్ బయటకు లాగటానికి విశ్వ ప్రయత్నం చేసింది. ఈ సంఘటన తమిళనాడులో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కురిసిన వర్షాల కారణంగా రోడ్డుపై వెళ్తున్న గవర్నమెంట్ బస్సు కొంత అదుపు తప్పి.. రోడ్డు పక్కన ఉన్న ఓ చిన్న కాలువలోకి వెళ్ళింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది.

రోడ్డు పక్కన కాలువలోకి జారిన బస్సును మహీంద్రా థార్ ద్వారా బయటకు లాగటానికి ప్రయత్నించారు. ఇందులో భాగంగానే కారుకు మరియు బస్సుకు ఒక తాడు లేదా టో కట్టారు. ఆ తరువాత మహీంద్రా థార్ చాలా ప్రయత్నించింది. ఫలితం లేకుండా పొందింది. దీంతో చేసేదేమీ లేక థార్ అక్కడ నుంచి వెళ్లిపోయింది. థార్ ఓనర్ కోయంబత్తూర్ నుంచి అటువైపుగా వెళ్తుండగా జరిగిన విషయం తెలుసుకుని బస్సును లాగటానికి హెల్ప్ చేయాలనుకున్నారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో యూట్యూబర్ అక్కడ పరిస్థితిని గురించి వివరిస్తూ.. బస్సు బరువు సుమారు 10000 కేజీలు ఉంటుందని పేర్కొన్నారు. ఇంత బరువైన బస్సును థార్ లాగటానికి ప్రయత్నించి విఫలమైంది. గతంలో థార్ అనేక వాహనాలను ఇలాంటి ఘటనల్లో కాపాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ బస్సు అక్కడ బలంగా ఇరుక్కుపోవడం వల్ల బయటకు లాగలేకపోయినట్లు తెలుస్తోంది.

వర్షం కురవడంతో భూమి బాగా తడిసిపోయింది. కాబట్టి భారీ బరువున్న బస్సు సులభంగా మట్టిలో ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. బహుశా అక్కడ ఎక్కువ బురద ఉండటం వల్ల బస్సు గట్టిగా ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో జేసీబీ వంటి భారీ వాహనాలు బస్సును లాగడంతో తప్పకుండా విజయం సాధించిన ఉంటాయని తెలుస్తోంది. థార్ మార్కెట్లోకి రాకముందు.. ట్రాక్టర్లు, జేసీబీ మాత్రమే ఇలా ఇరుక్కున్న వాహనాలను బయటకు తీయడానికి ఉపయోగించేవారు.
మహీంద్రా థార్ మార్కెట్లోకి వచ్చిన తరువాత.. దీని అద్భుతమైన ఆఫ్ రోడింగ్ కేపబిలిటీస్ వల్ల గుంటల్లో లేదా కాలువల్లోకి జారిన వాహనాలను బయటకు తీయడానికి ఉపయోగిస్తున్నారు. ఈ కారు మంచి డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకుండా అద్భుతమైన ఆఫ్ రోడింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ కారణంగా ఇప్పటికి కూడా థార్ SUVలకు డిమాండ్ అధికంగా ఉందని తెలుస్తోంది.
మహీంద్రా కంపెనీ ఈ థార్ SUVను త్వరలో 5 డోర్ రూపంలో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. బహుశా థార్ 5 డోర్ వెర్షన్ ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. కాగా ఈ SUV ప్రస్తుతం టెస్టింగ్ దశలోనే ఉంది. ఇది మార్కెట్లో లాంచ్ అయినా తరువాత తప్పకుండా మంచి అమ్మకాలను పొందుతుందని, ఎక్కువమంది కష్టమర్లను ఆకర్షిస్తుందని భావిస్తున్నాము.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








