ఈ ఏడాది నుండి భారత్‌లో మహీంద్రా విమానాల అమ్మకాలు
మహీంద్రా అండ్ మహీంద్రా యొక్క ఏరోస్పేస్ విభాగం ఇండియాలో తమ విమానాలను అమ్మడానికి సిద్దమైపోయింది. ఆస్ట్రేలియా సంస్థతో కలిసి తమ విమానయాన రంగాన్ని రూపొందించుకున్న మహీంద్రా ఇప్పుడు వారి భాగస్వామ్యంతోనే తమ విమానాలను ఉత్పత్తి చేయనుంది. ఇండియాలో మంచి అమ్మకాలు సాధించి అనుకున్న లక్ష్యాలను సాధించినట్లయితే దేశీయంగా వీటిని ఉత్పత్తి చేసే అవకాశాలు ఉన్నట్లు మహీంద్రా తెలిపింది.

మహీంద్రా ఏరోస్పేస్ ప్రైయివేట్ లిమిటెడ్ ఛైర్మెన్ ఎస్.పి శుక్లా మాట్లాడుతూ, మహీంద్రా తమ ఎయిర్ క్రాఫ్ట్‌ల అమ్మకాలను ఇండియాలో కూడా చేపట్టినట్లు తెలిపాడు.

అంతే కాకుండా మహీంద్రా తమ విమానాలను మరియు ఏరోస్పేస్ ఉత్పత్తులను దేశీయంగా తయారు చేయడానికి కూడా నిర్ణయించినట్లు తెలిపారు, మెల్‌బోర్న్‌లోని మహీంద్రా విమానాల తయారీ ప్లాంటుకు కావాల్సిన విమానం యొక్క విడి భాగాలను ఇప్పుడు ఇండియాలోని బెంగళూరులో తయారు చేసి ఎగుమతి చేస్తున్నారు.

మహీంద్రా సంస్థ 2008 లో ఆస్ట్రేలియాకు చెందిన గ్రిప్స్ ఏరో సంస్థతో చేతులు కలిపింది. ఈ ఇరువురు సంస్థలు మెల్‌బోర్న్‌లో తమ విమానాల ఉత్పత్తిని కూడా ఆరంభించింది.

ప్రస్తుతం మహీంద్రా మరియు గ్రిప్స్‌ఏరో సంస్థలు సంయుక్తంగా ఎనిమిది మంది ప్రయాణించే వీలున్న జిఎ8 ఎయిర్‌వ్యాన్ ఎయిర్ క్రాఫ్ట్‌ను రూపొందించారు. ఇప్పటికే సుమారుగా 30 దేశాలలో వీటిని ప్రయోగాత్మకంగా నడిపారు.

విమానయాన రంగానికి చెందిన ప్రభుత్వ అధికారి ఒకరు మాట్లాడుతూ ఇండియాలో ఏ విమానం సంస్థ అయినా తమ ఉత్పత్తులను అమ్మాలనుకుంటే అవి తప్పనిసరిగా ఇద్దరు పైలట్ల సామర్థ్యంతో సుమారుగా 1500 కిలోలు బరువు ఉండాలని సూచించారు.

అయితే మహీంద్రా ఏరోస్పేస్ సంస్థ డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వారి నియమాల ప్రకారం తమ విమానాలలో ఇద్దరు పైలట్లు ఉండే విధంగా మరియు అవి 1500 కిలోల బరువు ఉండే విధంగా రీ డిజైన్ చేసి రీ సర్టిఫికేషన్ పొంది ఇండియాలో తమ విమానాల అమ్మకాలకు సిద్దమయ్యింది.

స్కూటర్లు, బైకులు, కార్లు, బస్సులు, కమర్షియల్ వాహనాలతో పాటు విమానయాన రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు 8-సీటర్‌తో పాటు ఎయిర్‌వ్యాన్-10 అనే పేరుతో 10-సీటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను కూడా రూపొందిస్తోంది.

ఇండియాలో కమర్షియల్ అవసరాలకు వినియోగంలో ఉన్న అన్ని ఎయిర్ క్రాఫ్ట్‌లు కూడా రెండు ఇంజన్‌లను కలిగి ఉన్నాయి. అయితే మహీంద్రా కేవలం ఒక్క ఇంజన్‌ను మాత్రమే అందిస్తోంది. ఇండియాలో తమ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో సక్సెస్ సాధించాలంటే చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

మహీంద్రా అండ్ మహీంద్రా విమానాలు

విమానాలు

- 30 ఏళ్లలో ఒక్క ప్రాణం కూడా పోలేదు: ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్
- కారులో ఏసి ని వినియోగించే వారికి ఉత్తమ చిట్కాలు
- అన్ని పరీక్షల్లో పాసైన డ్రైవర్ లెస్ బస్సు: త్వరలో రోడ్ల మీదకు


Click it and Unblock the Notifications








