Car Hit the Buffalo గేదెను ఢీకొట్టిన కారు.. పోలీసులు వచ్చే లోపు గ్రామస్థులు ఏం చేశారంటే..

సుదూర ప్రయాణాలను సులభతరం చేయడంలో హైవేలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ప్రతి ఏటా ప్రభుత్వం జిల్లాలు, రాష్ట్రాలను కలుపుతూ వందల కిలోమీటర్ల మేర ఎక్స్‌ప్రెస్‌ వేలు, హైవేలు వేస్తున్నప్పటికీ.. ఆ మార్గాల్లో ఉన్న అనేక గ్రామాలు ప్రయాణికులకు ఇబ్బందిగా మారాయి. పశువులు, జంతువులను హైవేలపై వదలడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

రహదారులు, జాతీయ రహదారులపై విచ్చలవిడిగా జంతువులు ప్రమాదాలకు గురి కావడం మనం తరచుగా వార్తల్లో చూస్తూనే ఉంటాం. అలాంటి ప్రమాదమే ఒకటి హైవేపై చోటుచేసుకుంది. ఇటీవల మహీంద్రా ఎక్స్‌యూవీ 500 కారు.. గేదెను ఢీకొట్టడంతో గ్రామస్థులు ఆగ్రహంతో కారును ధ్వంసం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Car Hit the Buffalo

మహీంద్రా XUV 500 కారు హైవేపై వేగంగా వెళ్తుండగా, అకస్మాత్తుగా కారుకు గేదె అడ్డు రావడంతో గేదెను ఢీకొట్టింది. ఘటన జరిగిన వెంటనే గ్రామస్తులు కారు చుట్టూ చేరారు. వాహనంలో ఉన్న వారిని దూషిస్తూ దాడికి పాల్పడ్డారు. వారిపై రాళ్లతో కూడా దాడి చేసి కారును ధ్వంసం చేసేందుకు యత్నించినట్లు వీడియో ద్వారా తెలుస్తోంది.

ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన కారు యజమాని పోలీసులకు ఫోన్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు వచ్చేలోగా సంధి కుదుర్చుకోవాలని భావించిన గ్రామస్థులు.. యజమానితో రాజీ కుదుర్చుకునేందుకు యత్నించారు. గేదెకు విలువ కట్టి ఆ మొత్తం చెల్లించాలని వాహన యజమానిని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఒకతను ట్రాక్టర్ తీసుకొచ్చి కారును ఢీకొట్టి ముందు భాగం ధ్వంసం చేశాడు.

Car Hit the Buffalo

ఆ కాసేపటికి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులను చూసేసరికి గ్రామస్థులు, వాహన యజమాని నిశ్శబ్దంగా ఉన్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు.. గేదెను రోడ్డుపై వదిలేసినందుకు గ్రామస్థులను తప్పుబట్టారు. అలాగే వారిపై కేసు నమోదు చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం.

ఏదేమైనా.. వాహనదారులు ఎంత అప్రమత్తంగా డ్రైవింగ్‌ చేస్తున్నప్పటికీ అనుకోని సంఘటనల కారణంగా డ్యామేజీని ఎదుర్కోవాల్సి వస్తుంది. మేతకు వదిలేసిన పశువులను పట్టించుకోకుండా ఉండటంతో అవి రోడ్డుపైకి రావడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాహనదారులు హైవేలపై గ్రామాల సమీపంలోకి చేరుకున్నప్పుడు అప్రమత్తంగా ఉండటం అవసరం.

Car Hit the Buffalo

ప్రశాంతంగా ఉండండి : వాహనదారులు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. మిమ్మల్ని గ్రామస్తులు చుట్టుముట్టినట్లయితే, ముందుగా హైవే అధికారులకు లేదా పోలీసులకు కాల్ చేయాలి. పోలీసులు వచ్చే వరకు పరిస్థితిని అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. అలా కాకుండా గ్రామస్థులపై తిరగబడితే దాని వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది.

డాష్ క్యామ్ ముఖ్యం : కారును ఉపయోగించే ప్రతి ఒక్కరూ డ్యాష్ క్యామ్‌ని ఉపయోగించడం చాలా ముఖ్యం. హైవేపై ప్రయాణించేటప్పుడు డాష్‌ క్యామ్‌ను ఆన్‌లో ఉంచాలి. ప్రమాదాలు జరిగినప్పుడు స్థానిక అధికారులకు ఆధారాలతో సహా పరిస్థితిని చూపించడంలో డాష్ క్యామ్ కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి డాష్ క్యామ్‌ని ఉపయోగించడం ద్వారా మీరు సురక్షితంగా ఉండవచ్చు.

జంతువులను గ్రామస్తులు రోడ్డుపై వదలొద్దు : ముందుగా హైవేలు వాహనాల కోసం ఉద్దేశించినవని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. రోడ్డుపై జంతువులను వదలడం కారణంగా ప్రమాదం జరిగితే ప్రయాణికులకు ఇబ్బందిగా ఉంటుందని తెలుసుకోవాలి. అలాగే గ్రామస్తులు ప్రయాణికులపై దౌర్జన్యానికి పాల్పడితే పోలీసుల చర్యలు తప్పవని చెప్పడానికి ఈ సంఘటన ఉదాహరణ.

More from DriveSpark

Article Published On: Saturday, June 10, 2023, 14:39 [IST]
English summary
Mahindra xuv 500 hit the buffalo villagers damaged the car video gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+