గోవా బీచ్‌ ఇసుకలో ఇరుక్కుపోయిన మహీంద్ర XUV 700.. తోపుడు బండిలా తోసి బయటకు తీసిన యువకులు

దేశంలో ప్రముఖ పర్యాటక ప్రాంతం గోవాకు ప్రతి ఏటా పర్యాటకుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అక్కడుంటే ప్రశాంతత, సహజమైన వాతావరణం, నీటి అలల శబ్ధం, అక్కడి వాతావరణం టూరిస్టులను ఇట్టే ఆకర్షిస్తుంది. అందుకే మన దేశంలో చాలా మంది గోవాని ది బెస్ట్ టూరిస్ట్ ప్లేస్‌గా సెలక్ట్ చేసుకుంటారు.

ప్రతి ఏటా, దేశం నలుమూలల నుండి పర్యాటకులు గోవాకు తరలివస్తారు. ఈ నేపథ్యంలో ఇటీవల గోవా బీచ్‌కు షికారుకు వెళ్ళిన కొందరు స్నేహితులు తమ కారును ఇసుక ఉన్న ప్రాంతంలో పార్క్ చేశారు. దీంతో కాసేపటికే కారు టైర్లు ఇసుకలో ఇరుక్కుపోయింది. దానిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. పూర్తి సమాచారం ఈ కథనంలో చదవండి.

Mahindra-XUV-700-Stuck

మహీంద్రా XUV 700 కారు యజమాని మరియు అతని స్నేహితులు సరదాగా గడిపేందుకు ఇటీవల గోవాకు వెళ్లారు. ఈ క్రమంలో ఇసుక ఉపరితలంపై కారును పార్క్ చేసి సమీపంలోని మార్కెట్‌కు వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఇసుకలో కారు ఇరుక్కుపోయిందని గుర్తించారు. XUV 700 బరువు ఎక్కువగా ఉండటంతో అది ఇసుకలో లోతుగా మునిగిపోయే అవకాశం ఉంది.

మహీంద్రా XUV 700 వేరియంట్ ఫ్రంట్-వీల్ డ్రైవ్ (FWD) కావడంతో వాహనం టైర్లు పూర్తిగా ఇసుకలో కూరుకుపోయాయి. దీంతో స్థానికుల సాయంతో టైర్ల ముందు మరియు వెనుక రెండింటి నుంచి ఇసుకను తొలగించడం ప్రారంభించారు. అయితే ఇసుకను తొలగించినప్పటికీ కారును బయటకు తీయలేకపోయారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Mahindra-XUV-700-Stuck

ఈ నేపథ్యంలో వారికి మరికొందరు స్థానికులు సహాయం చేశారు. వారంతా కలిసి కారును అటూ ఇటూ కదుపుతూ ఇసుక టైర్ల కిందికి చేరేలా చేశారు. అనంతరం కారును వెనుక నుంచి తోయడంతో పూర్తిగా ఇసుక నుంచి సురక్షితంగా బయటపడగలిగింది. ఇసుకలో టైర్లు కూరుకుపోవడంతో అధిక బరువు కారణంగా మహీంద్రా XUV 700ని బయటకు తీయడానికి చాలా సమయం తీసుకుంది.

XUV700 యొక్క ఆల్-వీల్ డ్రైవ్ (AWD) వేరియంట్ కూడా ఈ పరిస్థితిలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇసుక ప్రాంతాల్లో కారును పార్క్‌ చేయడం సవాలుతో కూడుకున్న పని. మహీంద్రా XUV 700 యొక్క రోడ్-బియాస్డ్ టైర్‌లను పరిశీలించినట్లయితే ఇసుక ఉపరితలంపై ముందుకు కదిలించడం చాలా కష్టం. ఈ క్రమంలో కార్లలో ట్రాక్షన్ బోర్డ్‌లను తీసుకెళ్లడం చాలా అవసరం. ఎందుకంటే అవి ఇలాంటి పరిస్థితుల్లో అవి సహాయపడతాయి.

తాజాగా టయోటా హిలక్స్‌ సాయంతో రోడ్డు పక్కన గుంతలో చిక్కుకుపోయిన బస్సును సురక్షితంగా రోడ్డుపైకి చేర్చారు. చిక్కమగళూరు నుంచి బెంగళూరుకు తిరుగు ప్రయాణంలో రోడ్డుపై మీదు అదుపు తప్పి చిన్న గుంతలో కూరుకుపోయిన బస్సును బయటకు తీయడానికి సిబ్బంది ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేదు.

రోడ్డు పక్కనే బురదలో బస్సు ఆగిపోవడంతో వెనుక చక్రాలు కాలువలోకి జారి పడే ప్రమాదం ఉంది. వెనుక చక్రాలు బురదలో కూరుకుపోవడంతో బస్సును రోడ్డుపైకి చేర్చడం కష్టంగా మారింది. అదే సమయంలో రహదారిపై టయోటా హిలక్స్(Toyota Hilux) లోడ్‌ను తీసుకువెళుతోంది. హిలక్స్‌ కింద పట్టీని బస్సు ముందు భాగానికి జత చేశాక, బస్సును లాగడం ప్రారంభించింది. కొంచెం వీల్ స్పిన్ ఉన్నప్పటికీ.. ట్రక్కు బస్సును సెకన్లలో రోడ్డుపైకి చేర్చింది.

More from DriveSpark

Article Published On: Monday, July 24, 2023, 11:52 [IST]
English summary
Mahindra xuv 700 stuck in goa beach sand locals help to rescue
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+