ప్రవహించే నదిలో మహీంద్రా ఎక్స్‌యూవీ300; వైరల్ అవుతున్న వీడియో

ప్రముఖ వాహన తయారీదారు మహీంద్రా కంపెనీ యొక్క ఎక్స్‌యూవీ 300 భారత మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందింది. అయితే ప్రస్తుతం కొత్త కొత్త మోడల్స్ దేశీయ మార్కెట్లో విడుదలవుతున్న కారణంగా ఈ ఎక్స్‌యూవీ 300 ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది.

ప్రవహించే నదిలో మహీంద్రా ఎక్స్‌యూవీ 300; వైరల్ అవుతున్న వీడియో

మహీంద్రా ఎక్స్‌యూవీ300 కాంపాక్ట్ ఎస్‌యూవీ. ఈ ఎక్స్‌యూవీ 300 ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ కానప్పటికీ, చాలామంది చాలా మంది ఆఫ్-రోడ్ ఎస్‌యూవీగా వినియోగిస్తున్నారు. ఇటీవల మహీంద్రా ఎక్స్‌యూవీ300 కి సంబంధించిన ఒక వీడియో బయటపడింది. ఈ వీడియోలో మహీంద్రా ఎక్స్‌యూవీ300 నది దాటుతున్నట్లు చూడవచ్చు.

ప్రవహించే నదిలో మహీంద్రా ఎక్స్‌యూవీ 300; వైరల్ అవుతున్న వీడియో

ఈ వీడియో ఆల్-ఇన్-వన్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయబడింది. ఈ వీడియోని నిశితంగా పరిశీలించినట్లతే మహీంద్రా ఎక్స్‌యూవీ300 వేగంగా ప్రవహించే నదిని అవలీలగా దాటుతుంది. ఇది ముమ్మాటికీ డ్రైవర్ యొక్క నైపుణ్యం అని మనకు స్పష్టంగా తెలుస్తుంది.

MOST READ:పరుగులు పెడుతున్న కొత్త మహీంద్రా థార్ బుకింగ్స్; పూర్తి వివరాలు

ప్రవహించే నదిలో మహీంద్రా ఎక్స్‌యూవీ 300; వైరల్ అవుతున్న వీడియో

సాధారణంగా ఏ వాహనమైన ప్రవహించే నదిలో కొంత పట్టుతప్పే అవకాశం ఉంది. కావున వాహనాన్ని నడిపే డ్రైవర్ ఎంతో నైపుణ్యంతో వ్యవహరిస్తే తప్ప ఇలాంటిది సాధ్యం కాదు. ప్రవహించే నదిలో వాహనం అకస్మాత్తుగా ఆగిపోయే అవకాశం ఉంది. ఈ విధంగా ఆగిపోతే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

ప్రవహించే నదిలో మహీంద్రా ఎక్స్‌యూవీ 300; వైరల్ అవుతున్న వీడియో

వీడియోలో ప్రవహిస్తున్న నదిలో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. నీటిలో నిలబడి ఉన్న వ్యక్తి ఆ డ్రైవర్ కి మార్గ నిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ అదృష్టవశాత్తూ నది చాలా లోతుగా లేదు కాబట్టి, అందులోనూ నదిలో నీరు వేగంగా ప్రవహింహదం లేదు కాబట్టి ఎటువంటి ఆటంకం లేకుండా బయటపడగలిగింది.

MOST READ:అమాంతం పెరుగుతున్న పెట్రోల్ & డీజిల్ ధరలు.. పెరిగిన ధరల వివరాలు ఇక్కడ చూడండి

ప్రవహించే నదిలో మహీంద్రా ఎక్స్‌యూవీ 300; వైరల్ అవుతున్న వీడియో

మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఫ్రంట్-వీల్-డ్రైవ్ వెహికల్ అయినప్పటికీ ఈ క్లిష్ట పరిస్థితిలో మంచి పనితీరును కనబరిచింది. ప్రవహించే నీటిలో కూడా కంట్రోల్ తప్పకుండా ముందుకు వెళ్ళింది. కార్లు నదులు దాటే సంఘటనలు విడుదలవడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు ఇలాంటి వీడియోలు చాలా వైరల్ అయ్యాయి.

ప్రవహించే నదిలో మహీంద్రా ఎక్స్‌యూవీ 300; వైరల్ అవుతున్న వీడియో

కానీ నదిని దాటే ప్రతి వాహనం సజావుగా మిందుకు వెళ్తుంది అని చెప్పలేము. ఎందుకంటే మార్కెట్లో ఉన్న న్నీ వాహనాలు ఆఫ్ రోడ్ వాహనాలు కాదు, కావున ఇవి ఒక్కోసారి మధ్యలోనే ఇరుక్కుపోయే అవకాశం ఉంది. కావున ఈ విధంగా నదిని దాటటం అనేది చాలా ప్రమాదానికి దారితీస్తుంది.

MOST READ:ఈ కారణంగానే అక్కడ లాక్‌డౌన్‌లో సీజ్ చేసిన వాహనాలు ఇచ్చేస్తున్నారు.. ఎక్కడో తెలుసా?

అంతే కాకుండా వాహనం నీటిలో ఉన్నప్పుటు నీరు ఇంజిన్లోకి వెళ్లి షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం కూడా ఉంది. తర్వాత ఈ ఇంజిన్ మొత్తాన్ని తీసివేయాల్సి వస్తుంది. కావున ఈ విధంగా ఇంజిన్ తీసివేసి కొత్త ఇంజిన్ వేయాలంటే ఎక్కువ డబ్బు కూడా ఖర్చవుతుంది.

ప్రవహించే నదిలో మహీంద్రా ఎక్స్‌యూవీ 300; వైరల్ అవుతున్న వీడియో

వాహనదారులు ఆఫ్ రోడింగ్ చేయాలంటే తప్పకుండా ప్రత్యేకించి ఆఫ్-రోడింగ్ వాహనాలను, అంటే 4 × 4 సిస్టం కలిగిన ఎస్‌యూవీలను ఎంచుకోవాలి. అది మాత్రమే కాదు ఆఫ్-రోడింగ్ చేసేటప్పుడు మంచి రహదారి నైపుణ్యాలు మరియు వాహన సామర్థ్యాల గురించి పూర్తిగా తెలుసుకుని ఉండాలి. సాధారణ వాహనంలో ఎట్టి పరిస్థితిలో ఆఫ్-రోడ్ చేయకూడదు. నీటిలో వాహనాన్ని ముందుకు తీసుకెళ్లడం చాలా సాహసం, అంతే కాదు ప్రమాదకరమైన సాహసం.

MOST READ:టోల్ ప్లాజాలో ఈ గీత బయట వేచి ఉంటే ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు; NHAI

Image Courtesy: All in One Entertainment

Most Read Articles

English summary
Watch A Mahindra XUV300 Cross A River Like A Boss. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X