లక్షల విలువైన కారును చెత్త కుండీగా మార్చేసిన యజమాని.. ఏకంగా షోరూం ఎదుటే పార్కింగ్..!

ఓ కార్ల తయారీ సంస్థ షోరూం ఎదుట కస్టమర్‌ చేసిన పని ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. సంస్థ తనను మోసం చేసిందంటూ తాను కొత్తగా కొనుగోలు చేసిన కారును.. చెత్తకుండీగా మార్చేశారు. అయితే ఈ ఘటనపై సోషల్‌ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు సపోర్టు చేస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌ లోని గ్రేటర్‌ నోయిడాకు చెందిన ఓ వ్యక్తి కొన్ని నెలల క్రితం మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్‌ కారును కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి తన రోజువారీ అవసరాలకు అనుగుణంగా వినియోగిస్తున్నారు. అయితే ఇటీవల అతనికి కొన్ని సమస్యలు ఎదురయ్యాయని సమాచారం.

Mahindra XUV400 electric car

మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్‌ కారు విక్రయ సమయంలో సంస్థ చెప్పిన అంశాలకు ఇప్పటికీ చాలా వ్యత్యాసాలు ఉన్నాయని కారు యజమాని ఆరోపిస్తున్నాడు. సంస్థ ఉద్యోగుల దృష్టికి తన సమస్యలు తీసుకెళ్లినా సరైన పరిష్కారం చూపించలేదని ఆరోపణ చేస్తున్నాడు. దీంతో చివరకు విసుగుచెంది కారును చెత్త కుండీగా మార్చి, సంస్థ షోరూం వద్ద నిరసన ప్రారంభించాడు.

ఘజియాబాద్‌లోని సంస్థ షోరూం వద్ద కారును పార్కింగ్‌ చేసి "మహీంద్రా XUV400 కారును ఇంట్లో ఛార్జింగ్‌ చేసేందుకు 10kW కనెక్షన్‌ అవసరం. ఛార్జింగ్‌ స్టేషన్‌లో కనీసం రూ.1000 ఖర్టు అవుతుంది. అయితే ఈ కారు కేవలం 150 కి.మీ రేంజ్‌ మాత్రమే ఇస్తుంది. సంస్థ మాత్రం 300 నుంచి 350 కి.మీ రేంజ్‌ ఇస్తుందని చెప్పింది. ఈ కారును కొనుగోలు చేయవద్దని కుటుంబ సభ్యులకు చెప్పండి" అంటూ బ్యానర్‌ ఏర్పాటుచేశాడు.

ప్రస్తుతం ఈ ఘటన సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది. ఈ కారుపై కొందరు నెగెటివ్‌ రివ్యూలు ఇస్తున్నారని, కారును సరిగా వినియోగించడం తెలియని వ్యక్తులు మాత్రమే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. కారును సరిగా హ్యాండిల్‌ చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని సలహా ఇస్తున్నారు.

మహీంద్రా XUV400 రూ.15.99 లక్షల నుంచి రూ.19.39 వరకు అందుబాటులో ఉంది. ఈ కారు 34.5 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. బ్యాటరీని పూర్తి ఛార్జింగ్‌ చేస్తే 350 కి.మీ రేంజ్‌ ఇస్తుందని మహీంద్రా పేర్కొంది. ఈ కారు మోటార్‌ 147.51bhp శక్తి, 310Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ కారు బ్యాటరీ పూర్తిగా ఛార్జింగ్‌ అయ్యేందుకు 50 నిమిషాల సమయం పడుతుందని తెలుస్తోంది. మహీంద్రా XUV400 కారు 0-100 కి.మీ వేగాన్ని అందుకొనేందుకు 8.3 సెకన్లు పడుతుందని సంస్థ చెబుతోంది. మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్‌ కారు 4200mm పొడవు, 1821mm వెడల్పు, 1634mm ఎత్తు, 2600mm వీల్‌ బేస్‌ కలిగి ఉంది.

రెండు రోజుల క్రితం మహీంద్రా సంస్థ లక్షకు పైగా కార్లను రీకాల్‌ చేసింది. ఈ జాబితాలో మహీంద్రా XUV400 కారు కూడా ఉంది. 2023 ఫిబ్రవరి 16 నుంచి జూన్ 5 మధ్య తయారైన 3,560 యూనిట్ల XUV400 కార్లను రీకాల్‌ చేసింది.

XUV400 కార్లలో స్ర్పింగ్‌ రిటర్న్‌ యాక్షన్‌ బ్రేక్‌ పొటెన్షియో మీటర్‌ను తనిఖీ చేయాల్సి ఉందని తెలిపింది. ఈ కార్ల వినియోగదారులను సంప్రదించి, వారి వాహనాలను తనిఖీ చేస్తామని మహీంద్రా సంస్థ తెలిపింది. మరమ్మతులు అవసరం అనుకుంటే ఉచితంగా చేస్తామని హామీ ఇచ్చింది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, August 21, 2023, 16:01 [IST]
English summary
Mahindra xuv400 electric car owner transforms his vehicle into garbage van
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+