అధిక వేగంతో ఢీకొన్న మహీంద్రా, టాటా కార్లు.. GNCAP సేఫ్టీ రేటింగ్ లేకున్నా..!!
భారత్‌లో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఇటీవల కాలంలో భారీగా పెరుగుతోంది. జాతీయ, రాష్ట్ర రహదారుల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. చాలా ఘటనల్లో అధిక వేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫలితంగా రహదారులు ప్రమాదకర ప్రాంతాలుగా మారుతున్నాయి. తాజా ఘటనలో మహీంద్రా XUV500, Tata హారియర్ రెండు కార్లు ఢీకొన్నాయి. మహారాష్ట్రలోని మిరాజ్-మహైసల్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
మహీంద్రా XUV500 కారు.. టాటా హారియర్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో టాటా కారు నియంత్రణ కోల్పోయింది. రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని, దుకాణాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు కార్లు కూడా భారీగా డ్యామేజీ అయ్యాయి. మహీంద్రా XUV500 ముందు భాగంగా భారీగా దెబ్బతింది. టాటా హారియర్ కారు కూడా డ్యామేజీ అయింది.

ఈ ప్రమాదంలో రెండు కార్లలోని ప్రయాణికులు చిన్న గాయాలతో బయటపడ్డారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ రెండు వాహనాలు GNCAP (గ్లోబల్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రాం) టెస్ట్ చేయబడలేదు.
మహీంద్రా XUV500 కారు ANCAP (ఆస్ట్రేలియన్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రాం) టెస్టులో 4 స్టార్ రేటింగ్‌ను పొందింది. అయితే ఈ కారు గ్లోబర్ NCAP పరీక్షలను ఎదుర్కోలేదు. టాటా మోటార్స్ సంస్థ కూడా తన కొత్త కార్లను GNCAP పరీక్షలకు పంపిస్తున్నా.. హారియర్ మాత్రం ఎటువంటి రేటింగ్‌ను కలిగి లేదు. అయితే ఇందుకు గల కారణాలను టాటా వెల్లడించలేదు.

టాటా హారియర్ కారు ఇంజిన్.. ప్రమాదాలు జరిగే సమయంలో డ్రైవర్ క్యాబిన్‌లోకి దూసుకుపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫలితంగా డ్రైవర్ తీవ్రంగా గాయపడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అందువల్లనే టాటా హారియర్‌ను సేఫ్టీ టెస్టులకు పంపలేదని చెబుతున్నారు. GNCAP రేటింగ్ లేకపోయినా... గతంలో జరిగిన అనేక ప్రమాదాల్లో టాటా హారియర్ కారు తన ప్రయాణికులకు సురక్షితంగా ఉంచింది. చిన్న గాయాలతో బయటపడ్డ ఘటనలు కూడా చాలా ఉన్నాయి.
భవిష్యత్‌లో అన్ని కార్లను కూడా సేఫ్టీ టెస్టులకు పంపడం తప్పనిసరి అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ అంశం ప్రతిపాదన దశలో ఉన్నట్లు తెలుస్తోంది. చట్టంగా మారితే.. అన్ని కార్ల తయారీ సంస్థలు కూడా తమ ఉత్పత్తులను తప్పనిసరిగా టెస్టులకు పంపాల్సి ఉంటుంది.
* భారత్‌లో అక్టోబర్ 1 నుంచి BNCAP (భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రాం) సేఫ్టీ రేటింగ్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించిన ప్రభుత్వం ప్రకటన చేసింది. GNCAP సేఫ్టీ రేటింగ్ వ్యవస్థ కలిగి ఉన్న నిబంధనలనే BNCAP కూడా కలిగి ఉంటుంది.
ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే భారత్‌లో తయారయ్యే కార్లు.. సేఫ్టీ టెస్టుల కోసం ఇతర దేశాలకు తన వాహనాల శాంపిల్‌లను పంపించాల్సిన అవసరం లేదు. దీంతో సమయం, డబ్బు ఆదా అవుతుంది. మారుతి సుజుకి, టాటా, టయోటా, కియా, స్కోడా, మహీంద్రా వంటి సంస్థలు BNCAP సేఫ్టీ రేటింగ్ వ్యవస్థను స్వాగతించాయి.


Click it and Unblock the Notifications








