మహీంద్రా ఎక్స్‌యూవీ500 స్టైల్‌లో టెంపో ట్రావెలర్
టెంపో వ్యాన్ ఎక్స్‌యూవీ500గా మారితే ఎలా ఉంటుంది..? ఇదిగో ఈ ఫొటోలో కనిపిస్తున్నట్లు, విచిత్రంగా ఉంటుంది. మనం ఇప్పటి వరకు దిలీప్ ఛాబ్రియా కార్ మోడిఫికేషన్ గురించి తెలుసుకున్నాం. అయితే, ఆయన మాదిరిగానే దేశంలో అనేక మంది కార్ మోడిఫైయర్లు ఉన్నాయి.
ఇప్పుడు ఈ ఫొటోలో మనం చూస్తున్నది ఫోర్స్ మోటార్స్ అందిస్తున్న టెంపో ట్రావెలర్.మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన 'కంప్లీట్ కార్ కేర్' అనే కార్ మోడిఫైయర్, యాక్ససరీ సెల్లర్ ఈ టెంపో ట్రావెల్‌ను మహీంద్రా అందిస్తున్న పాపులర్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ500 స్టైల్‌లో మార్చేశాడు.
ఈ మోడిఫైడ్ టెంపో ట్రావెలర్ ఫ్రంట్ డిజైన్ పూర్తిగా మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీని తలపిస్తుంది. కంప్లీట్ కార్ కేర్‌లోని ఇంజనీర్లు దీనినే కాకుండా అనేక రకాల పురాతన, కొత్త కార్లను కూడా మరింత స్టయిలిష్‌గా మార్చేస్తుంటారు.

కంప్లీట్ కార్ కేర్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం వారి ఫేస్‌బుక్ ఫ్యాన్ పేజ్‌ను సందర్శించండి.


Click it and Unblock the Notifications








