Mahindra XUV700 పెట్రోల్‌ కారులో డీజిల్‌ నింపిన సిబ్బంది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఓ వ్యక్తి తనకు ఎంతో ఇష్టమైన Mahindra XUV700 కారును కొనుగోలు చేశాడు. డెలివరీ తీసుకొనేందుకు మహీంద్రా డీలర్‌ వద్దకు వచ్చాడు. డెలివరీ అంతా సవ్యంగా జరుగుతుంది అనుకున్నలోపలే ఓ సమస్య వచ్చి పడింది. డీలర్‌ వద్దనున్న సిబ్బంది చేసిన పనికి... డీలర్‌ సహా కారు యాజమాని ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి వచ్చింది.

మహీంద్రా XUV700 పెట్రోల్‌ వెర్షన్‌ కారు కొనుగోలు చేసిన యాజమాని డెలివరీ తీసుకొనేందుకు షోరూంకు వచ్చాడు. కారును డెలివరీ చేస్తున్న సిబ్బంది పొరపాటున ఆ వాహనంలో పెట్రోల్‌ బదులు డీజిల్‌ను నింపారు. వెంటనే చేసిన తప్పును తెలుసుకున్నారు. ఇంధన ట్యాంక్‌ ఖాళీ చేసి శుభ్రం చేయించారు.

Mahindra XUV700 petrol car filled with diesel

షోరూం సిబ్బంది రాతపూర్వక హామీతో కారును డెలివరీ తీసుకొనేందుకు యాజమాని అంగీకరించాడు. కానీ ఆ తర్వాత రోజే కారులో ఇంధన లీకేజీ సమస్యలు వచ్చాయని యాజమాని తెలిపారు. ఈ మేరకు సంస్థకు ట్వీట్‌ చేశాడు. కారును రీప్లేస్‌ చేయాలని కోరాడు.

'మహీంద్రా XUV700 పెట్రోల్‌ వెర్షన్‌ బుక్‌ చేసుకున్నాను. డెలివరీ సమయంలో షోరూం సిబ్బంది పెట్రోల్‌ బదులుగా డీజిల్‌ను నింపారు. అదృష్టవశాత్తు ఏ ప్రమాదం జరగలేదు. కానీ తర్వాత రోజు ట్యాంక్‌ నుంచి ఇంధనం లీక్‌ అవుతుంది. తన కారును రీప్లేస్‌ చేయండి.' అంటూ ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌పై మహీంద్రా సంస్థ కస్టమర్‌ కేర్‌ విభాగం స్పందించింది. కారు, యాజమాని వివరాలు ఇవ్వాలని కోరింది. సంబంధిత వర్గాలతో మాట్లాడి చెబుతామంటూ బదులిచ్చింది.

Mahindra XUV700 petrol car filled with diesel

పెట్రోల్‌ మరియు డీజిల్‌కు వేర్వేరు స్వభావాలు ఉంటాయి. డీజిల్‌కు అధిక ప్లాష్‌ పాయింట్‌ను కలిగినా తక్కువ మండే గుణం ఉంటుంది. మరియు డీజిల్‌ మండించేందుకు ఎక్కువ కంప్రెషన్ ప్రెజర్‌ అవసరం ఉంటుంది. అదే పెట్రోల్‌ను మండించేందుకు చిన్న స్పార్క్‌ సరిపోతుంది. డీజిల్‌ కేవలం ఇంధనంగానే కాకుండా లూబ్రికెంట్‌గానూ పనిచేస్తుంది. పెట్రోల్‌కు 91-95 ఆక్టేన్‌ నంబర్‌ ఎక్కువ ఉంటుంది. 15-20 సీటేన్‌ నంబర్‌ తక్కువ ఉంటుంది.

అదే డీజిల్‌కు 45-55 సీటేన్‌ నంబర్‌ ఎక్కువ, 15-25 ఆక్టేన్‌ నంబర్‌ తక్కువ ఉంటుంది. పెట్రోల్‌తో పనిచేసేందుకు ఇంజిన్‌ సిద్ధం చేయబడుతుంది. అటువంటి పరిస్థితుల్లో పెట్రోల్‌ కారులో డీజిల్‌ను నింపితే.. కలుషితమైన ఇంధనాన్ని ప్రాసెస్‌ చేసేందుకు ఇంజిన్‌కు కష్టమవుతుంది. అదే స్వచ్ఛమైన డీజిల్‌ కంటే... పెట్రోల్‌, డీజిల్‌ మిశ్రమంతో ట్యాంక్‌ నింపితే మాత్రం ఇంజిన్‌ కొంత తక్కువగా దెబ్బతింటుంది.

డీజిల్‌కు లూబ్రికేషన్‌ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇంధన పైపులు, ఇంధన ఇంజెక్టర్‌, పెట్రోల్‌ ఇంజిన్‌ కంబష్షన్‌ ఛాంబర్ వద్ద డీజిల్‌ పేరుకుపోయే అవకాశం ఉంది. పెట్రోల్‌ ఇంజిన్‌కు తక్కువ కంప్రెషన్‌ ప్రెజర్‌ను కలిగి ఉంటుంది. కానీ డీజిల్‌ మండేందుకు ఎక్కువ కంప్రెషన్‌ ప్రెజర్‌ అవసరం అవుతుంది. అయితే డీజీల్‌ కారులో పెట్రోల్ నింపినప్పుడు సమస్యలు తక్కువగా ఉంటాయి.

పెట్రోల్‌ కారులో డీజిల్‌ను నింపినా లేదా డీజిల్‌ కారులో పెట్రోల్‌ను నింపినా కారును స్టార్ట్‌ చేయకపోతే పెద్ద ప్రమాదం ఏం జరగదు. కారు స్టార్ట్‌ చేసిన కొంత దూరం ప్రయాణం చేస్తే మాత్రం ఇంజిన్‌ సహా కొన్ని భాగాలపై ప్రభావం చూపుతుంది. మీరు గుర్తించిన వెంటనే సర్వీస్‌ సెంటర్‌ వాళ్లను సంప్రదించి ట్యాంక్‌ను ఖాళీ చేయాల్సి ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Saturday, May 27, 2023, 13:35 [IST]
English summary
Mahindra xuv700 car filled with diesel instead of petrol owner demands replacement
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+