ప్రమాదం జరిగినా ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోలేదు.. మహీంద్రా సంస్థకు యజమాని ఫిర్యాదు..!

మహీంద్రా XUV700 కారు ప్రమాదానికి గురైనా ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోలేదని యజమాని ఆరోపించారు. హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన ప్రమాదంలో ఎయిర్‌బ్యాగ్‌ తెరుచుకోకపోవడం కారణంగా తన కుటుంబ సభ్యులు గాయపడినట్లు తెలిపారు. ప్రమాదం అనంతరం తన కారు పరిస్థితికి సంబంధించిన వీడియోను యజమాని షేర్‌ చేశాడు.

వీడియో ఆధారంగా ప్రమాదంలో కారు ముందు భాగం బాగా డ్యామేజీ అయింది. మరియు నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. ఫలితంగా కారు ఒకవైపున దెబ్బతింది. అయితే కారులో ఉన్న తన కుటుంబం అంతా సీట్లు బెల్టులు ధరించారని, కానీ ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోలేదని యాజమాని ఆవేదన వ్యక్తం చేశాడు.

Mahindra XUV700 airbags not deployed during accident

ఈ ప్రమాదంలో కారులోని ప్రయాణికులకు స్వల్పంగా గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. కారు ముందు భాగంలో ప్రమాదం జరిగిందని, కానీ ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోలేదని తెలిపాడు. ప్రస్తుతం వాహనం మహీంద్రా సర్వీస్ సెంటర్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో ఎయిర్‌బ్యాగ్‌లు ఎందుకు తెరుచుకోలేదో తనకు తెలియజేయాలని మహీంద్రా సర్వీస్‌ సెంటర్‌ సిబ్బందిని యజమాని కోరినట్లు తెలుస్తోంది.

ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. ఇవి కారులో ఉన్న సెన్సార్ల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా తెరుచుకుంటాయి. కారులో ప్రయాణికులు సీట్‌బెల్ట్‌ను ధరించినా.. ఎయిర్‌బ్యాగులు తెరుచుకోకపోవడానికి ఈ కింది కారణాలు ఉన్నాయి. తక్కువ స్థాయిలో ప్రమాదం జరిగిన సందర్భాల్లో ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోవు. అయితే కారు యాజమాని షేర్‌ చేసిన వీడియా ఆధారంగా మహీంద్రా XUV700 కారు ప్రమాద తీవ్రత తక్కువగా కనిపించడం లేదు.

Mahindra XUV700 airbags not deployed during accident

యాక్సిలెరోమీటర్‌ సాధారణంగా ఎయిర్‌బ్యాగ్‌లు యాక్లిలెరోమీటర్‌ నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా పనిచేస్తాయి. వాహనంలోని ఎలక్ట్రానిక్ కంట్రోల్‌ యానిట్‌ యాక్సిలరేషన్‌లో అకస్మాత్తుగా మార్పు గుర్తించినప్పుడు ఒక సిగ్నల్‌ను పంపుతుంది. అయితే సరైన స్థాయిలో థ్రెషోల్డ్‌ ఉన్నప్పుడు మాత్రమే ఈ సిగ్నల్‌ వస్తుంది. అయితే ఈ సిగ్నల్‌ తగినంత స్థాయిలో లేకుంటే ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోవు. అందుకే ప్రమాద తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకొనే అవకాశం ఉండదు.

సీట్‌బెల్‌ల వినియోగం సరైన పద్ధతిలో సీట్‌బెల్ట్‌లను వినియోగించకుంటే, ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకొనే అవకాశం ఉండదు. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో ఎయిర్‌బ్యాగులు తెరుచుకున్నా... ప్రయాణికులకు హాని కలుగుతుంది. మహీంద్రా XUV700 కర్టెన్‌ ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తుంది. సీట్‌బెల్ట్‌లు సరిగా వినియోగించకుంటే ఎయిర్‌బ్యాగ్‌ తెరుచుకొనే అవకాశం ఉండదు.

Mahindra XUV700 airbags not deployed during accident

బుల్‌బార్‌ వంటి అదనపు పరికరాల అమర్చడం వలన ఎయిర్‌బ్యాగ్‌లకు సిగ్నల్‌ పంపే సెన్సార్‌ల పనితీరుపై ప్రభావం పడుతుంది. ఆ కారణం వల్ల కూడా ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోకపోవచ్చు. అదే విధంగా సైడ్‌ ఎయిర్‌బ్యాగ్‌ ఉన్న వాహనాలకు సీట్‌ కవర్లు కూడా అటువంటి ప్రభావం చూపిస్తాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, September 8, 2023, 16:01 [IST]
English summary
Mahindra xuv700 owner complaint to company that airbags not deployed during accident
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+