సన్‌రూఫ్ నుంచి ఇద్దరు, విండో సీట్ నుంచి ఒకరు.. ఘాట్ రోడ్డుపై ప్రమాదకరంగా ప్రయాణం.. వీడియో వైరల్
దేశీయ మార్కెట్లో కార్ల తయారీదారులు.. ప్రయాణికుల రక్షణ, మంచి అమ్మకాలే లక్ష్యంగా వాహనాలను అధునాతన ఫీచర్లు, సేఫ్టీ ఫీచర్లతో రూపొందిస్తున్నారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా తమ సరసమైన మోడళ్లలో అనేక ప్రీమియం ఫీచర్లను ప్రవేశపెడుతున్నారు. కానీ కొందరు ఆకతాయిలు దానిని దుర్వినియోగపరుస్తున్నారు.
ఇటీవల అన్ని రకాల మోడల్ కార్లలో సాధారణంగా అందించే ఫీచర్లలో సన్‌రూఫ్ ఒకటి. గతంలో కేవలం లగ్జరీ కార్లకే పరిమితమైన ఈ ఫీచర్.. ఇప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లలో సైతం కనిపిస్తోంది. కారులో ప్రయాణికులకు మంచి వెలుతురు, గాలి అందించడమే ఈ సన్‌రూఫ్ ఫీచర్ ముఖ్య ఉద్దేశ్యం. తాజాగా కొందరు యువకులు ఘాట్ రోడ్డులో ప్రమాదకరంగా ప్రయాణించిన వీడియో వైరల్ గా మారింది.

ఇటీవల కొంతమంది పబ్లిక్ రోడ్లపై కార్లలో ప్రయాణిస్తూ విన్యాసాలకు పాల్పడుతున్నారు. తాజాగా మహీంద్రా XUV 700లో ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు పనోరమిక్ సన్‌రూఫ్ మరియు SUV వెనుక సీటు విండోలో నుంచి బయటకి చూస్తూ ప్రమాదకరంగా ప్రయాణించారు. ఈ వీడియోను ఏషియానెట్ న్యూస్ తమ యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేసింది.
గత వారం కేరళలోని తామరస్సేరి చురం (పర్వత మార్గం)లో ఈ ఘటన చోటుచేసుకుంది. తమిళనాడు రిజిస్ట్రషన్ తో ఉన్న మహీంద్రా XUV 700ని కేరళలో ఘాట్ రోడ్డుపై వెళ్తుండగా ఆ ఛానెల్ ప్రతినిధులు వీడియో తీశారు. కారులో ఇద్దరు పనోరమిక్ సన్‌రూఫ్ నుంచి బయటకు చూస్తున్నారు. మరొకరు SUV వెనుక సీటు విండోలో నుంచి బయటకు చూస్తూ నిలబడ్డాడు.

వెనుక సీటులో విండోపై కూర్చుని బయటకు చూడటం ద్వారా డ్రైవర్ వెనుక రోడ్డును చూడలేరు. కానీ ఘాట్ రోడ్డులో కారు వేగంతోనే ప్రయాణిస్తుంది. తామరస్సేరి చురం పర్యాటక ప్రాంతం.. వారాంతాల్లో ఆ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి ఎక్కువ. అదనంగా, ఇది కేరళ మరియు కర్ణాటకల మధ్య అనుసంధాన రహదారిగా పనిచేస్తుంది. ఘాట్ రోడ్డు కావడంతో ప్రమాదకర మలుపులు ఎక్కువగా ఉంటాయి.
సాధారణ రోడ్లపై ఇలా ప్రయాణించడం చట్టపరంగా నేరం. కానీ ఇక్కడ ప్రమాదకర మలుపులు ఉండే ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారు. ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు వేగంగా వెళుతున్నా మలుపులు వచ్చేసరికి వేగం తగ్గించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సడెన్ బ్రేకులు కూడా వేయాల్సి వస్తుంది. అప్పుడు కారులో ఉన్న ప్రయాణికులు ముందుకు పడే ఆస్కారం ఎక్కువ. సన్ రూఫ్ ద్వారా బయటకు చూస్తే తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటుంది.

అదృష్టవశాత్తూ, ఈ కేసులో అలాంటి సంఘటనేమీ జరగలేదు. కానీ రోడ్డు సింగిల్‌లేన్‌గా కావడంతో ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ. ట్రాఫిక్ వ్యతిరేక దిశలో ఉండటం వల్ల చాలా అప్రమత్తంగా నడపాల్సి ఉంటుంది. వెనుకవైపు వాహనాలను పర్యవేక్షించలేకపోవడం వల్ల XUV 700 డ్రైవర్ సరిగా వాహనం నడపలేడు. కానీ సన్‌రూఫ్‌పై నిలబడి ఉన్నవారు ప్రకృతిని ఆస్వాదిస్తున్నట్లు అనిపిస్తుంది.
కదులుతున్న కారులో సన్‌రూఫ్ లేదా విండోపై నిలబడటం పబ్లిక్ రోడ్ స్టంట్‌గా పరిగణిస్తారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మోటార్ వెహికల్స్ డిపార్ట్‌మెంట్ (MVD) దృష్టికి వెళ్లింది. నిర్లక్ష్యంగా ప్రవర్తించినవారిపై తగిన చర్యలు తీసుకోవడానికి ప్రస్తుతం వాహనాన్ని ట్రాక్ చేస్తున్నట్లు సమాచారం.
సన్‌రూఫ్‌లు ప్రధానంగా వాహనాల్లో అంతర్గత గాలి ప్రసరణను మెరుగుపరచడానికి రూపొందించారు. అధిక వేగంతో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు విండోస్ తెరిచి ఉంచితే అసౌకర్యం కలిగించే ప్రత్యక్ష గాలి డ్రైవింగ్ కు విఘాతం కలిగిస్తుంది. సన్‌రూఫ్‌లు తక్కువ గాలితో కారు లోపల మంచి వాతావరణాన్ని కల్పించేందుకు దోహదపడతాయి. కానీ . దురదృష్టవశాత్తు, చాలా మంది వ్యక్తులు దీనిని దుర్వినియోగం చేస్తున్నారు. ఇందుకు జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications








