కొత్త రూల్.. ఇక సైలెంట్‎గా వెళ్తామంటే కుదరదు.. అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ సౌండ్ చేయాల్సిందే

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో వాటి భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ కార్లు సైలెంటుగా వెళ్లడం వల్ల రోడ్డు మీద నడిచేవారు, సైకిల్ తొక్కే వారు, దృష్టి లోపం ఉన్న పాదచారులకు ప్రమాదాలు ఎదురవుతున్నాయి.

ఈ సమస్యను పరిష్కరించడానికి రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ఒక ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం.. 2027 అక్టోబర్ 1 నుండి భారతదేశంలోని అన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు అకౌస్టిక్ వెహికల్ అలర్టింగ్ సిస్టమ్ (AVAS) తప్పనిసరి కానుంది. ఈ కొత్త నియమం, దాని పనితీరు, లక్ష్యాల గురించి వివరంగా తెలుసుకుందాం.

Major Safety Upgrade India to Mandate Acoustic Vehicle Alerting System for All EVs by October 2027

ఎలక్ట్రిక్ వాహనాలు పర్యావరణానికి మేలు చేస్తున్నప్పటికీ, వాటి నుంచి శబ్దం రాకపోవడం రోడ్డుపై ఉన్న పాదచారులకు, సైకిల్ నడిపే వారికి పెను ప్రమాదంగా మారుతోంది. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని భారతదేశంలో ఇకపై ఎలక్ట్రిక్ కార్లు కూడా శబ్దంతో రానున్నాయి. అక్టోబర్ 1, 2027 నుండి అన్ని ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, ట్రక్కులలో అకౌస్టిక్ వెహికల్ అలర్టింగ్ సిస్టమ్ (AVAS) తప్పనిసరి చేయనుంది.

ఎలక్ట్రిక్ వెహికల్స్ నుంచి శబ్ధం రాకపోవడం వల్ల జరిగే ప్రమాదాల మీద ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ కొత్త AVAS నియమాన్ని MoRTH ప్రతిపాదించింది. ఈ కొత్త నిబంధన ముందుగా అక్టోబర్ 1, 2026 నుండి కొత్తగా ఉత్పత్తి అయ్యే ప్రయాణీకుల, సరుకుల ఈవీ మోడల్స్‌కు తప్పనిసరి అవుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 2027 నాటికి ఈ నియమం ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న అన్ని ఈవీ మోడల్స్‌కు కూడా వర్తిస్తుంది.

Major Safety Upgrade India to Mandate Acoustic Vehicle Alerting System for All EVs by October 2027

వాహనం నుంచి వచ్చే కృత్రిమ శబ్దం సురక్షితంగా, ఏకరూపంగా ఉండటానికి AIS-173 ప్రమాణాల ప్రకారం AVAS ఇన్‌స్టాలేషన్ జరగాలని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు.

AVAS సిస్టమ్‎ను ప్రత్యేకంగా రూపొందించారు. ఎలక్ట్రిక్ వాహనాలు 20 కి.మీ/గం వేగం వరకు ఉన్నప్పుడు ఇది ఆటోమేటిక్‌గా పనిచేయడం ప్రారంభిస్తుంది. ఈ తక్కువ వేగాల వద్ద వాహనం చాలా సైలెంటుగా ఉండటం వలన పాదచారులు గుర్తించలేరు. హై-స్పీడ్‌లలో టైర్ల, గాలి వల్ల వచ్చే శబ్దాలు హెచ్చరికగా పనిచేస్తాయి కాబట్టి, AVAS అవసరం ఉండదు. పట్టణ ప్రాంతాలలో పాదచారుల, ముఖ్యంగా దృష్టి లోపం ఉన్నవారి భద్రతను పెంచడంలో ఈ టెక్నాలజీ కీలకమైనది.

Major Safety Upgrade India to Mandate Acoustic Vehicle Alerting System for All EVs by October 2027

AVAS వ్యవస్థను ఇప్పటికే అమెరికా, జపాన్, యూరోపియన్ యూనియన్ వంటి అనేక దేశాలు తమ ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల్లో తప్పనిసరి చేశాయి. భారతదేశం తీసుకున్న ఈ నిర్ణయం, దేశంలో వేగంగా పెరుగుతున్న ఈవీ మార్కెట్‌ను ప్రపంచ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా మార్చడానికి దోహదపడుతుంది.

AVAS తో పాటు, ట్యూబ్‌లెస్ టైర్లు ఉన్న వాహనాలలో స్పేర్ టైర్ ఉంచాల్సిన బాధ్యతను తొలగించాలని కూడా MoRTH ప్రతిపాదించింది. ఈ నియమం కార్లు, త్రీ వీలర్లు, క్వాడ్రిసైకిల్స్‌కు వర్తిస్తుంది.

AVAS నియమం పాదచారుల భద్రతను పెంచినప్పటికీ, వాహనం మొత్తం భద్రత క్రాష్ ప్రొటెక్షన్, బాడీ స్ట్రక్చర్, బ్యాటరీ భద్రతపై కూడా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం, భారతదేశంలో అత్యంత సురక్షితమైన Made-in-India EVs జాబితాలో టాటా పంచ్ ఈవీ, టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా XUV400 ఈవీ వంటి మోడల్స్ ఉన్నాయి. కొన్ని ఈవీలలో ఇప్పటికే AVAS ఫీచర్ కూడా ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, October 15, 2025, 10:12 [IST]
English summary
Major safety upgrade india to mandate acoustic vehicle alerting system for all evs by october 2027
Read more on: #electric car #india #offbeat
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+