రేంజ్ రోవర్ లాగే మలైకా కూడా ఎవర్ గ్రీన్.. కొత్త కారుతో మరోసారి ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది!
బాలీవుడ్ అందాల తార మలైకా అరోరా తన స్టైలిష్ లుక్, లగ్జరీ లైఫ్ స్టైల్‌తో ప్రసిద్ధి చెందారు. 1998లో వచ్చిన దిల్ సే సినిమాలోని ఛైయ్యా ఛైయ్యా పాటలో డ్యాన్స్ చేసిన తర్వాత ఆమె అదృష్టమే మారిపోయింది. ఆ తర్వాత వరుస సినిమాల్లో కనిపించారు. ఇటీవల 51 ఏళ్ల మలైకా అరోరా కొత్త రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ (Range Rover Autobiography) ఎస్‌యూవీని కొనుగోలు చేశారని వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇల్లు అమ్మిన డబ్బుతో కొత్త కారు
మలైకా అరోరా ఇటీవల ముంబైలోని అంధేరిలో ఉన్న తన లగ్జరీ ఫ్లాట్‌ను రూ. 5.3 కోట్లకు విక్రయించారని చెబుతున్నారు. ఆ డబ్బుతోనే ఈ కారు కొనుగోలు చేశారని వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఆమె 2018లో అదే ఫ్లాట్‌ను రూ.3.26 కోట్లకు కొనుగోలు చేశారు.

రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ స్పెషాలిటీ
ఇది చాలా ఖరీదైన లగ్జరీ ఎస్‌యూవీ. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.57 కోట్లు. అయితే, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబై వంటి నగరాల్లో ఆన్-రోడ్ ధరలో చాలా తేడా ఉంటుంది. అక్కడ దీని ధర రూ. 2.95 కోట్ల నుండి రూ. 3.38 కోట్ల వరకు ఉంటుంది.
డిజైన్, కలర్స్
ఈ కారు చాలా ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడీ టెయిల్‌ల్యాంప్‌లు, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, 23 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది. ఇది శాంటోరిని బ్లాక్, అబ్సిడియన్ బ్లాక్, బ్రిటిష్ రేసింగ్ గ్రీన్, ఫైరెంజ్ రెడ్, వారెసిన్ బ్లూ, కాన్‌స్టెల్లేషన్ బ్లూ, అయోనియన్ సిల్వర్, టూర్‌మాలిన్ బ్రౌన్, బెల్‌గ్రేవియా గ్రీన్ వంటి డిఫరెంట్ కలర్లలో లభిస్తుంది.

కొలతలు, స్పేస్
కొత్త రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఎస్‌యూవీ చాలా విశాలంగా ఉంది. ఇది 5,252 మి.మీ. పొడవు, 2,209 మి.మీ. వెడల్పు, 1,870 మి.మీ. ఎత్తు ఉంది. అలాగే, 219 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్, 3,197 మి.మీ. వీల్‌బేస్ ఉన్నాయి. దీని బరువు 2,569 కిలోలు. ఇది 5/7 సీటింగ్ ఆప్షన్లను కలిగి ఉంది, ప్రయాణికులు సులభంగా ప్రయాణించవచ్చు. వారంతంలో, సెలవుల్లో దూర ప్రయాణాలకు వెళ్లేటప్పుడు ఎక్కువ సామాను తీసుకెళ్లడానికి 1050 లీటర్ల బూట్ స్పేస్ ఉంది.
పవర్ఫుల్ ఇంజిన్
కొత్త రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ కారు శక్తివంతమైన పవర్‌ట్రెయిన్‌ను కలిగి ఉంది. ఇందులో 3.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇన్‌లైన్-6 పెట్రోల్, 4.4-లీటర్ సూపర్‌చార్జ్డ్ వీ8 పెట్రోల్, 3.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇన్‌లైన్-6 డీజిల్ ఇంజిన్‌లు ఉన్నాయి. మోడల్‌ను బట్టి 8-స్పీడ్, 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉన్నాయి.

మైలేజ్, టాప్ స్పీడ్
ఈ కారు ఫ్యూయెల్ కెపాసిటీ కూడా చాలా బాగుంది. ఇది 12 కి.మీ. వరకు మైలేజ్ ఇస్తుంది. 90 లీటర్ల ఇంధన ట్యాంక్‌ను కలిగి ఉంది. దీని టాప్ స్పీడ్ 242 KMPH. ఇది కేవలం 5.9 సెకన్లలో 0 నుండి 100 KMPH వేగాన్ని అందుకోగలదు.
ఫీచర్లు, సేఫ్టీ
కొత్త రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఎస్‌యూవీలో హై-డెఫినిషన్ 11.4-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, పనోరమిక్ స్లైడింగ్ రూఫ్, హీటెడ్ స్టీరింగ్ వీల్, మల్టీ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి వివిధ ఫీచర్లు ఉన్నాయి. ప్రయాణికుల సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, ఈబీడీ, 360 డిగ్రీల కెమెరా కూడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








