ల్యాండ్ రోవర్ డిఫెండర్‌లో మమ్ముట్టి ప్రమాదకర ప్రయాణం.. వీడియో వైరల్
మలయాళ ప్రముఖ నటుడు మమ్ముట్టి పరిచయం అవసరంలేని పేరు. సుమారు 400 వందలకుపైగా సినిమాల్లో నటించారు. మమ్ముట్టికి నటనతోపాటు లగ్జరీ కార్లు అంటే చాలా ఇష్టం. గ్యారేజీలో ఇప్పటికే అనేక లగ్జరీ కార్లున్నాయి. వాటిలో చాలా కార్లను మమ్ముట్టినే స్వయంగా డ్రైవింగ్ చేస్తూ చాలా సార్లు కనిపించారు.
అయితా తాజాగా నటుడు మమ్ముట్టి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. తన ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారుతో పబ్లిక్ రోడ్లపై ప్రమాదకరంగా ఓవర్‌టేక్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇరుకైన రోడ్లపై ప్రమాదకరంగా డ్రైవింగ్ చేశారు. అయితే ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టకుండా తృటిలో తప్పించుకున్నారు.

ఈ వీడియోను M4 మీడియా తన యూట్యూ్బ్ ఛానలో అప్‌లోడ్ చేసింది. కేరళలోని ఇరుకైన రోడ్డుపై ప్రయాణిస్తున్న బస్సును వీడియోలో చూడవచ్చు. బస్సు నెమ్మదిగా వస్తుండగా.. డిఫెండర్ కారు మాత్రం ప్రమాదకరంగా ఓవర్‌టేక్ చేసేందుకు ముందుకు వచ్చింది. ఆ సమయంలో ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును మమ్ముట్టి స్వయంగా నడుపుతున్నట్లు తెలుస్తోంది.
అదే సమయంలో మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్ రోడ్డుకు అడ్డంగా వచ్చి పక్కకు వెళ్లింది. నేరుగా వచ్చి ఉంటే ప్రమాదం జరిగే అవకాశం ఉండేది. అయితే ఈ సమయంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ వీడియోను ఆ రోడ్డుపైనున్న ఓ వ్యక్తి రికార్డు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సమయంలో డిఫెండర్, వ్యాగన్‌ఆర్ కార్లు ఇండికేటర్లు వేయడం గమనించవచ్చు.

అయితే నటుడు మమ్ముట్టి ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును ఇద్దరు బైకర్లు ఫాలో అవుతున్నారు. ఇక్కడ ఎటువంటి ప్రమాదం జరిగినా.. ఆ బైకర్లు కూడా గాయపడే అవకాశం ఉండేది. అయితే వీడియో ఆధారంగా మమ్ముట్టి ప్రమాదకరంగా డ్రైవింగ్ చేశారు. అయితే వాహనం వేగంగా ప్రయాణం చేస్తుందా లేదా అనేది స్పష్టంగా తెలియలేదు. కానీ రోడ్డు భద్రతా నిబంధనలు ఉల్లంఘించారు.
భారత్‌లో రోడ్లపై ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలి. ప్రముఖులు సహా ఎవరూ వీటిని ఉల్లంఘించకూడదు. ఫలితంగా ఎదుటివారు కూడా ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఈ ఘటనలో మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్ డ్రైవర్ ముందు అనుకున్నట్లుగానే కుడివైపునకు తిరిగారా లేదా ప్రమాదం జరగకుండా చూసేందుకు వెళ్లారా అనేది తెలియలేదు.

భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు గణనీయంగా పెరుగుతున్నాయి. నిర్లక్ష్యం, అతివేగం కారణంగా రోజు ప్రమాదాల జరుగుతున్నాయి. దాంతోపాటు రోడ్లపైకి అకస్మా్త్తుగా వస్తు్న్న ప్రజలు, వాహనదారులు, పశువులు కారణంగా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు ప్రాణాలు పోయిన ఘటనలు కూడా ఉంటున్నాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








