నడి రోడ్డుపై థార్ లాగిన బిగ్ బాస్ ఫేమ్.. హార్డ్ వర్క్ ఫలితం అంటూ నెటిజన్ల ప్రశంసలు
మలయాళ టెలివిజన్ ప్రపంచంలో తన సొంత గుర్తింపును సృష్టించుకున్న నటి జోసెఫిన్ బిన్నీ సెబాస్టియన్ మరోసారి వార్తల్లో నిలిచారు. గీత గోవిందం సీరియల్‌లో గీతాంజలి పాత్రతో ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిన ఈ అందగత్తె, 2025లో ప్రసారమైన బిగ్ బాస్ మలయాళ సీజన్ 7 ద్వారా మరింత ప్రజాదరణను సంపాదించారు. బిగ్ బాస్ ఇంట్లో ఆమె చూపించిన సెన్సిబుల్ ఆట్టిట్యూడ్, హ్యూమర్, నేరుగా మాట్లాడే ధోరణి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కేరళ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లా చంగనస్సేరి ప్రాంతంలో పుట్టి పెరిగిన బిన్నీ, ఒక సంప్రదాయవాద క్రైస్తవ కుటుంబంకి చెందినవారు. బాల్యంలోనే చదువుపై ఆసక్తి చూపిన ఆమె, వైద్య రంగంలో కెరీర్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ఆ దిశగా ముందుకు వెళ్లి చైనాలో MBBS పూర్తి చేశారు.
తరువాత భారత్‌కి తిరిగి వచ్చాక, టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. గీత గోవిందం అనే మలయాళ సీరియల్‌లో గీతాంజలి పాత్రతో ఆమెకు వచ్చిన గుర్తింపు, ఆమె కెరీర్‌లో మలుపు తీసుకువచ్చింది. ఆ తర్వాత బిగ్ బాస్ మలయాళ సీజన్ 7లో పాల్గొనడం ద్వారా బిన్నీ పేరు కేరళ రాష్ట్రం దాటి తెలుగు, తమిళ రాష్ట్రాల వరకూ ప్రాచుర్యం పొందింది.

బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంది. అభిమానులతో తరచుగా లైవ్ సెషన్‌లు, ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవల ఆమె ఒక కొత్త SUVని కొనుగోలు చేయడంతో మళ్లీ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. మహీంద్రా థార్ 3-డోర్ మోడల్ను కొనుగోలు చేసిన ఆమె, ఆ సంతోషాన్ని తన అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది.
థార్ లాగుతున్న వీడియోను షేర్ చేస్తూ, ఇది నా కొత్త ప్రయాణానికి నిదర్శనం. సెకండ్ హ్యాండ్ కార్ల నుండి కొత్త కారుకు, ఇది కల నెరవేరిన క్షణం అంటూ పెద్ద నోట్ రాసింది. ఆ వీడియో కేవలం కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు ఆమెను అభినందిస్తూ కామెంట్లు కురిపిస్తున్నారు. ఇది హార్డ్ వర్క్ ఫలితం, సక్సెస్ స్టోరీకి ఇది మరో మైలురాయి అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ కారు గురించి చూసినట్లయితే, ఈ మోడల్‌ను ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు వాడుతున్నారు. బిన్నీ సెబాస్టియన్ కొన్న కారు 2025 మోడల్ 3 డోర్ థార్. ఇది బ్లాక్ కలర్‌లో మెరిసిపోతుంది. దీని ప్రారంభ ధర రూ.9.99 లక్షల (ఎక్స్-షోరూమ్). కొత్త థార్ ముందు డ్యూయల్-టోన్ బంపర్, బాడీ-కలర్ గ్రిల్ ఉన్నాయి. మిగిలినవి పాత వెర్షన్ మాదిరిగానే అందించారు. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా అప్‌డేట్ అయింది.
కొత్త మోడల్‌లో అనేక ముఖ్యమైన మార్పులు చేసింది. ముఖ్యంగా ఇంటీరియర్‌లో మరింత ప్రీమియం లుక్ ఇచ్చే విధంగా అప్‌డేట్‌లు కనిపిస్తున్నాయి. పాత, చిన్న ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ స్థానంలో ఇప్పుడు పెద్ద 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను అందించారు. ఈ కొత్త డిస్‌ప్లే మరింత స్పష్టత, రిచ్ గ్రాఫిక్స్, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లను అందిస్తుంది. కారులో స్టీరింగ్ వీల్ డిజైన్ కూడా పూర్తిగా మార్చబడింది.

ఇంజిన్ ఎంపికల విషయంలో కంపెనీ ఎలాంటి పెద్ద మార్పులు చేయలేదు. దీనిలో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అందించబడింది, ఇది 150 bhp పవర్, 320 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది పవర్ డెలివరీ, స్మూత్ రైడ్ ఎక్స్పీరియెన్స్ పరంగా అద్భుతంగా ఉంటుంది. అలాగే, డీజిల్ వేరియంట్‌లో 2.2 లీటర్ ఇంజిన్ను అందించారు, ఇది 130 bhp పవర్, 300 Nm టార్క్ ఇస్తుంది.


Click it and Unblock the Notifications








