పోర్ష్ టేకాన్ ఎలక్ట్రిక్ కారును టెస్ట్ డ్రైవ్ చేస్తూ కనిపించిన మలయాళం సూపర్‌స్టార్ మమ్ముట్టి

మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి భారతీయ చలనచిత్ర పరిశ్రమ రంగంలోకి అడుగుపెట్టి 50 ఏళ్లు దాటింది. మమ్ముట్టి మలయాళంతో సహా దక్షిణ భారతదేశంలోని ఇతర భాషలలో కూడా నటించారు. ప్రత్యేకించి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఈయనకు పెద్ద సంఖ్యలోనే అభిమానులు ఉన్నారు. విలక్షణమైన నటనతో అందరినీ మెప్పించగల గొప్ప నటుడు మమ్ముట్టి. మమ్మట్టికి నటనతో పాటుగా కార్లంటే కూడా మక్కువే. మమ్ముట్టి తన కార్ల కోసం ఓ ప్రత్యేక గ్యారేజీని కూడా నిర్మించుకున్నట్లు సమాచారం.

పోర్ష్ టేకాన్ ఎలక్ట్రిక్ కారును టెస్ట్ డ్రైవ్ చేస్తూ కనిపించిన మలయాళం సూపర్‌స్టార్ మమ్ముట్టి

మమ్ముట్టి మొదటి కారు మారుతి మరియు అతని కార్ కలెక్షన్ లో ఇప్పటికే జాగ్వార్ XJL (కేవియర్), టొయోటా ల్యాండ్ క్రూయిజర్ LC200, ఫెరారీ, మెర్సిడెస్, ఆడి, పోర్ష్, టొయోటా ఫార్చ్యూనర్ మరియు మినీ కూపర్‌ వంటి పలు విలాసవంతమైన కార్లు ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఈ సూపర్ స్టార్ ఓ జర్మన్ ఎలక్ట్రిక్ కారును టెస్ట్ డ్రైవ్ చేస్తూ కనిపించారు. జర్మన్ కార్ బ్రాండ్ పోర్ష్ అందిస్తున్న టేకాన్ ఎలక్ట్రిక్ కారును మమ్ముట్టి టెస్ట్ డ్రైవ్ చేస్తున్న వీడియో ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది.

పోర్ష్ టేకాన్ ఎలక్ట్రిక్ కారును టెస్ట్ డ్రైవ్ చేస్తూ కనిపించిన మలయాళం సూపర్‌స్టార్ మమ్ముట్టి

మమ్ముట్టి తన కొత్త చిత్రం 'పుజువిన్' ప్రెస్ మీట్‌కు కూడా అదే కారులో వచ్చారు. దీంతో, బహుశా అతను తదుపరి కొనుగోలు చేయబోయే కారు ఇదేననే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ స్టార్ హీరో నిజంగానే ఈ కారును కొంటారో లేదో వేచి చూడాలి. కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో ఉన్న పోర్ష్ డీలర్‌షిప్ కు చెందిన గ్రీన్ కలర్ పోర్ష్ టేకాన్ ఎలక్ట్రిక్ కారును నడుపుతూ మమ్ముట్టి కనిపించారు. ఈ కారుపై రెడ్ కలర్ నంబర్ ప్లేట్‌ ఉంది, అంటే ఇది టెస్ట్ డ్రైవ్ ఉద్దేశించబడిన మోడల్ అని సూచిస్తుంది.

పోర్ష్ టేకాన్ ఎలక్ట్రిక్ కారును టెస్ట్ డ్రైవ్ చేస్తూ కనిపించిన మలయాళం సూపర్‌స్టార్ మమ్ముట్టి

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ పోర్ష్ (Porsche) గతేడాది నవంబర్ నెలలో తమ సరికొత్త మరియు భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు అయిన టేకాన్ ను విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో ఈ ఆల్-ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ. 1.50 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా) గా ఉంది. భారత మార్కెట్లో పోర్ష్ టేకాన్ ఈవీ రెండు బాడీ స్టైల్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఇందులో టైకాన్‌ సెడాన్ మరియు టైకాన్ క్రాస్ టురిస్మో ఎస్టేట్ మోడళ్లు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ఇందులో టర్బో ఎస్ వేరియంట్ కూడా లభిస్తుంది.

పోర్ష్ టేకాన్ ఎలక్ట్రిక్ కారును టెస్ట్ డ్రైవ్ చేస్తూ కనిపించిన మలయాళం సూపర్‌స్టార్ మమ్ముట్టి

కంపెనీ తమ Porsche Taycan EV ని తొలిసారిగా సెప్టెంబర్ 2019 లో ప్రపంచ మార్కెట్లలో ఆవిష్కరించింది. ఆ తర్వాత 2020 ప్రారంభంలో వివిధ అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేయబడింది. వాస్తవానికి ఈ ఎలక్ట్రిక్ కారు 2020 లోనే భారత మార్కెట్లో విడుదల కావల్సి ఉంది. అయితే, కోవిడ్-19 మహమ్మారి కారణంగా, దాని లాంచ్ ఆలస్యం అయింది. గ్లోబల్ మార్కెట్లలో పోర్ష్ టేకాన్ ఈవీ బహుళ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంటుంది. వీటిలో 4ఎస్, టర్బో మరియు టర్బో ఎస్ వేరియంట్లు ఉన్నాయి.

పోర్ష్ టేకాన్ ఎలక్ట్రిక్ కారును టెస్ట్ డ్రైవ్ చేస్తూ కనిపించిన మలయాళం సూపర్‌స్టార్ మమ్ముట్టి

పోర్ష్ టేకాన్ సెడాన్ నాలుగు వేరియంట్‌లలో అందుబాటులో ఉండగా, టేకాన్ క్రాస్ టురిస్మో ఎస్టేట్ మూడు వేరియంట్‌లలో లభిస్తోంది. వాటి ధరల వివరాలు ఉన్నాయి:

- పోర్ష్ టేకాన్‌ (స్టాండర్డ్) - రూ. 1.50 కోట్లు

- పోర్ష్ టేకాన్‌ 4ఎస్ - రూ. 1.63 కోట్లు

- పోర్ష్ టేకాన్‌ టర్బో - రూ. 2.08 కోట్లు

- పోర్ష్ టేకాన్‌ టర్బో ఎస్ - రూ. 2.29 కోట్లు

- పోర్ష్ టేకాన్‌ క్రాస్ టురిస్మో 4ఎస్ - రూ. 1.70 కోట్లు

- పోర్ష్ టేకాన్‌ క్రాస్ టురిస్మో టర్బో - రూ. 2.10 కోట్లు

- పోర్ష్ టేకాన్‌ క్రాస్ టురిస్మో టర్బో ఎస్ - రూ. 2.31 కోట్లు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా)

పోర్ష్ టేకాన్ ఎలక్ట్రిక్ కారును టెస్ట్ డ్రైవ్ చేస్తూ కనిపించిన మలయాళం సూపర్‌స్టార్ మమ్ముట్టి

పోర్ష్ టేకాన్‌ ఎలక్ట్రిక్ కారులో ఫీచర్లను గమనిస్తే, ఇందులో 16.8 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, 10.9 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ మరియు క్లైమేట్ కంట్రోల్ కోసం 8.4 ఇంచ్ స్క్రీన్‌ వంటివి అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా ప్రయాణీకుల వినోదం కోసం కూడా ఇందులో 10.9 ఇంచ్ టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్ అందుబాటులో ఉంటుంది. టేకాన్ టర్బో వేరియంట్లలో స్టాండర్డ్ కిట్‌లో భాగంగా 20 ఇంచ్ అల్లాయ్స్, 22 మిమీ వరకు తగ్గించగల అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్, ఆపిల్ కార్‌ప్లే, బోస్ స్టీరియో సిస్టమ్, మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్‌లైట్లు మరియు డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

పోర్ష్ టేకాన్ ఎలక్ట్రిక్ కారును టెస్ట్ డ్రైవ్ చేస్తూ కనిపించిన మలయాళం సూపర్‌స్టార్ మమ్ముట్టి

కాగా, పోర్ష్ టేకాన్ టర్బో ఎస్ వేరియంట్‌లో 21 ఇంచ్ అల్లాయ్ వీల్స్, అప్‌గ్రేడెడ్ బ్రేక్‌లు మరియు 18-వే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్లు ఉన్నాయి. పవర్ ట్రైన్ విషయానికి వస్తే, పోర్ష్ టేకాన్ ఈవీ గరిష్టంగా 600 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లను కలిగి ఉంటుంది. ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 500 కిమీల రేంజ్‌ను అందించే రెండు హై వోల్టేజ్ లిథియం అయాన్ బ్యాటరీలను కలిగి ఉంటుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ కారు కేవలం 3.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంది. కాగా, టేకాన్ క్రాస్ టురిస్మో టర్బో ఎస్ వేరియంట్ 761 బిహెచ్‌పి పవర్ మరియు 1050 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది, ఇది దేశంలో విక్రయించబడుతున్న ఈవీలలో కెల్లా అత్యంత శక్తివంతమైనది.

Most Read Articles

English summary
Malayalam superstar mammootty spotted test driving porsche taycan ev video
Story first published: Sunday, May 22, 2022, 8:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X