విజయ్ మాల్యా ఫోర్స్ ఇండియాకు భారీ జరిమానా
ప్రముఖ రేస్ కార్ల తయారీ సంస్థ క్యాటర్‌హ్యామ్ రేస్ కార్ డిజైన్‌ను ఆధారంగా చేసుకునే ఫోర్స్ ఇండియా రేస్ కార్‌ను అభివృద్ధి చేసిందని క్యాటర్‌హ్యామ్ కోర్టులో దావా వేసింది. అయితే, ఇది అసత్యమని ఫోర్స్ ఇండియా నిరూపించుకోలేకపోయింది. దీంతో సహారా ఫోర్స్ ఇండియా మొత్తం 22 లక్షల డాలర్ల సొమ్మును వదిలించుకోవాల్సి వచ్చింది.
ఫోర్స్ ఇండియా టీమ్‌ను 2007లో సహారా ఇండియా పరివార్, విజయ్ మాల్యాలు కలిసి స్థాపించారు. ఇందులో సహారా ఇండియాకు 42.5 శాతం వాటా ఉంది. టీమ్ లోటస్ టి127 అనే కారును డిజైన్ చేసేటప్పుడు అందులో ఉపయోంగించిన కొన్ని విడిభాగాలు క్యాటర్‌హ్యామ్ హక్కులు సొంతం చేసుకున్న డిజైన్‌లని సదరు కంపెనీ కోర్టుకెక్కింది. గతంలో కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్‌లోని పెట్టుబడులను సహారా ఫోర్స్ ఇండియాలోకి తరలించినట్లు కూడా విజయ్ మాల్యాపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, అవేవీ వాస్తవం కాదని కింగ్‌ఫిషర్ కొట్టిపారేసింది.


Click it and Unblock the Notifications









