విజయ మాల్యా బెంజ్ కారుకు గీతలు పెట్టిన దుండగుడు

అసంలేం జరిగిందంటే....
బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఏప్రిల్ 29న జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు - పూణే వారియర్స్ ఐపిల్ మ్యాచ్‌కు మాల్యా తన ముద్దుల కారులో వెళ్లారు. ఆటగాళ్ల ఎంట్రన్స్‌కు సమీపంలో ఉన్న అత్యంత సురక్షితమైన పార్కింగ్ స్థలంలో తన కారును పార్క్ చేశారు. తన కారు పక్కనే ఒకప్పటి స్టార్ క్రికెటర్ అనీల్ కుంబ్లే మెర్సిడెస్ కారు కూడా పార్క్ చేయబడి ఉంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ దుండగుడు మాల్యా కారును ముందు బంపర్ నుంచి వెనుక వరకూ పదునైన చాకు లాంటి పరికరంతో గీతలు పెట్టాడు. కాగా.. ఆ సమయంలో సెక్యూరిటీ వారు కూడా ఆ ప్రాంతంలో లేకపోవడం గమనార్హం.
అత్యంత ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో పూణే వారియర్స్‌పై 26 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ విజయం సాధించింది. విజయోత్సాహంతో బయటకు వచ్చిన మాల్యాకు పెద్ద నిరుత్సాహమే ఎదురైంది. తన అందమైన కారు (KA 01 MB 11)కు గీతలు పడటం చూసి మాల్యా విజయోత్సాహం చల్లబడిపోయింది. దాదాపు రెండేళ్ల క్రితం మాల్యా ఈ కారును రూ. 2.2 కోట్లు వెచ్చించి సుందరం మోటార్స్ నుంచి కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఆ కారు పూర్వవైభవం కోసం అదే షోరూమ్‌కు వెళ్లింది. ఇప్పటికే ఈ కారు పాలిష్ చేసినట్లు సమాచారం, అయినప్పటికీ గీతలు ఇంకా కనబడుతూనే ఉన్నట్లు షాపు వర్గాలు వెల్లడించాయి.
అవి కూడా పోవాలంటే కారుకు పెయింట్ మళ్లీ వేయించాలి, అందుకు లక్షల రూపాయల వరకూ ఖర్చు అవుతుందని షాపు వర్గాలు తెలిపాయి. అయితే అన్ని కోట్ల యజమానికి లక్షల రూపాయలు వెచ్చించడం పెద్ద సమస్య కాకపోయినప్పటికీ.. సదరు కారుకు స్ప్రే పెంయిట్ వేస్తే ప్రస్తుతం ఉన్న షేడ్ రాదు. ఎందుకంటే ఈ కారు ఒరిజినల్ కోటింగ్‌ను వాటర్-బేస్ పెయింట్‌తో వేశారు. దీనిపై మళ్లీ కోటింగ్ వేస్తే ఉన్న షేడ్ పోవడమే కాకుండా.. ఇప్పుడున్న కలర్‌తో మ్యాచ్ కావడం కష్టమని చెబుతున్నారు. మరి మాల్యాకు అంత గిట్టని వాళ్లు ఎవరు ఉన్నారో..!!


Click it and Unblock the Notifications








