ఆయన చూపు సముద్రం వైపు.. కానీ ప్రపంచం అంతా కారు వైపు! కోట్ల కారుతో ఉన్నదెవరో తెలుసా?

మమ్ముట్టి (Mammootty) అంటే సినీప్రపంచానికి గర్వకారణం. ఆయన నటనలో ఒక ప్రత్యేకమైన శక్తి, సహజత్వం ఉంటుంది. ఎలాంటి పాత్ర ఇచ్చినా దానిలో పూర్తిగా మమేకమైపోయే అరుదైన ప్రతిభ ఆయనది. నాలుగు దశాబ్దాలకుపైగా సాగుతున్న తన సినీప్రస్థానంలో వందలాది చిత్రాల్లో నటించి, దేశవ్యాప్తంగా ఎంతో అభిమానులను సంపాదించుకున్నారు. ముఖ్యంగా మలయాళ సినీ లోకానికి గర్వకారణమైన మమ్ముట్టి, తెలుగు సినిమాలతో కూడా ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన చేసిన కొన్ని తెలుగు సినిమాలు ఇక్కడి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశాయి. ఆయన సినిమాలు చాలా వరకు తెలుగులో కూడా డబ్ అయి సక్సెస్ అవుతుంటాయి. ఆయన గురించి వచ్చిన ప్రతి చిన్న అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో ఒక వైరల్‌గా మారిపోతుంది. తాజాగా కూడా అలాంటి ఘటనే జరిగింది.

మమ్ముట్టి తన సోషల్ మీడియాలో ఒక ఫోటోను పోస్ట్ చేయగానే అది క్షణాల్లో వైరల్ అయింది. ఆ ఫోటో కింద ఆయన రాసిన శీర్షికలో, సర్వశక్తిమంతుడికి నా ప్రేమ, కృతజ్ఞతలు అందరికీ తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు. అయితే ఆ ఫోటోలో మరో ప్రత్యేకత కూడా ఉంది. మమ్ముట్టి వెనుక కనిపిస్తున్న వాహనం, అభిమానుల దృష్టిని బలంగా ఆకర్షించింది. అది సాధారణ కారు కాదు, ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలాసవంతమైన SUVలలో ఒకటి.

Mammootty Spotted With Luxuru Car Toyota Land Cruiser 300 Gr Sports

ఇది టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 GR స్పోర్ట్(Toyota Land Cruiser 300 Gr Sports) వేరియంట్. ఈ మోడల్ బలమైన పనితీరుతో పాటు విలాసవంతమైన డిజైన్, అత్యాధునిక టెక్నాలజీ, భద్రతా ఫీచర్లతో ప్రసిద్ధి చెందింది. మమ్ముట్టి లాంటి మహానటుడి వ్యక్తిత్వానికి తగ్గట్టుగా, ఈ ల్యాండ్ క్రూయిజర్ కూడా శక్తివంతమైనదే కాక, స్టైలిష్‌గా కనిపించడం అభిమానులను మరింత ఆకట్టుకుంది. మమ్ముట్టి ఎప్పుడూ తన జీవనశైలిలో ఒక ప్రత్యేకమైన స్టైల్‌ను చూపిస్తారు.

సాధారణ దుస్తుల్లోనైనా, విలాసవంతమైన వాహనాలతోనైనా ఆయన చూపించే ఆ ఎలిగెన్స్ మిగతావారిని ఆకట్టుకునే విధంగానే ఉంటుంది. ఇప్పుడు ల్యాండ్ క్రూయిజర్ 300 GR స్పోర్ట్ వాహనంతో ఆయన కనిపించడంతో, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లన్నీ ఆ ఫోటోను పంచుకుంటూ ఆయన స్టైల్ గురించి పొగడ్తలతో ముంచెత్తుతున్నాయి. ఆటోమొబైల్ ప్రేమికులు ఇప్పుడు ఈ కారు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ఆ కారు విశేషాలను ఒకసారి చూద్దాం.

Mammootty Spotted With Luxuru Car Toyota Land Cruiser 300 Gr Sports

ఈ మోడల్ ధర రూ. 2.41 కోట్లు(ఎక్స్-షోరూమ్). ఇది పూర్తిగా విదేశాల్లో తయారు చేయబడి, భారత మార్కెట్లోకి నేరుగా దిగుమతి చేయబడుతుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ ల్యాండ్ క్రూయిజర్ 300 GR స్పోర్ట్ మోడల్ ఒక రాక్షసంలా ఉంటుంది. ఇందులో ఉన్న ట్విన్-టర్బోచార్జ్డ్ V6 డీజిల్ ఇంజిన్ 4,000 rpm వద్ద గరిష్టంగా 304 bhp శక్తిని, 1,600-2,600 rpm మధ్యలో 700 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

దీనికి తోడు 10-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, ప్రామాణికంగా వచ్చే ఫుల్-టైమ్ 4WD సిస్టమ్ వాహనాన్ని ఎలాంటి రోడ్డు పరిస్థితులలోనైనా అసాధారణంగా నడిపించే శక్తినిస్తుంది. డిజైన్ విషయానికి వస్తే, ఇది రెండు రంగులలో ప్రీషియస్ వైట్ పెర్ల్, ఆటిట్యూడ్ బ్లాక్ ప్రీమియం (మల్టీ-లేయర్డ్ ఫినిషింగ్‌తో)లో లభిస్తోంది. మమ్ముట్టి తనకిష్టమైన ఆటిట్యూడ్ బ్లాక్ ప్రీమియం రంగును ఎంచుకున్నారు. ఆ నలుపు మెరుపుతో కనిపించే ఈ SUV, ఆయన స్టైల్‌కి మరింత గంభీరతను జోడించింది.

Mammootty Spotted With Luxuru Car Toyota Land Cruiser 300 Gr Sports

ఈ కారులో ఫీచర్స్ డజన్ల కొద్ది ఉన్నాయ్. ఇందులో ఫోర్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ఉండగా, ముందరి సీట్లు మెమరీ ఫంక్షన్‌తో 8-వే పవర్-అడ్జస్టబుల్గా లభిస్తాయి. యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, నావిగేషన్ సూట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అనుసంధానించే 31.24 సెం.మీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. భద్రత పరంగా, సేఫ్టీ సెన్స్ 3.0 ADAS టెక్నాలజీతో వస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, September 8, 2025, 14:57 [IST]
English summary
Mammootty spotted with luxury car toyota land cruiser 300 gr sports
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+