హార్లే డేవిడ్సన్‌ బైక్‌పై కనిపించిన మమతా మోహన్‌దాస్[వీడియో]

మమతా మోహన్‌దాస్, ఈ పేరు గురించి పెద్దగా అవసరం లేదు. మమతా మోహన్‌దాస్ మలయాళీ భామ అయినప్పటికీ తెలుగు సినీ పరిశ్రమలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. యమదొంగ, చింతకాయల రవి సినిమాల్లో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ అమ్మడు తమిళ సినిమాలో కూడా నటించింది.

హార్లే డేవిడ్సన్‌ బైక్‌పై కనిపించిన మమతా మోహన్‌దాస్ [వీడియో]

మమతా మోహన్‌దాస్ కేవలం నటి మాత్రమే కాదు, సింగర్ కూడా.. చిరంజీవి నటించిన శంకర్‌ దాదా జిందాబాద్‌ లో ఆకలేస్తే అన్నంపెడతా, ఎన్టీఆర్‌ నటించిన రాఖీ సినిమాలో రాఖీ రాఖీ అనే సూపర్‌ హిట్‌పాటలు ఈ బ్యూటీ పాడినవే. మలయాళంలో సినిమాలు చేస్తున్న మమతా టాలీవుడ్‌కి మాత్రం దాదాపు 11 ఏళ్లుగా దూరంగా ఉంది.

హార్లే డేవిడ్సన్‌ బైక్‌పై కనిపించిన మమతా మోహన్‌దాస్ [వీడియో]

మమతా మోహన్‌దాస్ ప్రస్తుతం తమిళ చిత్రం 'ఎనిమీ' కోసం సిద్దమవుతుంది. అయితే మమతా ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇటీవల ఈ నటి బైక్ పై రైడ్ చేస్తున్న ఒక వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసింది.

MOST READ:కరోనా రోగులకోసం ఏకంగా 85 లక్షలు ఖర్చు చేసిన వ్యక్తి; వివరాలు

హార్లే డేవిడ్సన్‌ బైక్‌పై కనిపించిన మమతా మోహన్‌దాస్ [వీడియో]

ఈ వీడియో మమతా దుబాయ్‌లోని బహ్రెయిన్ ఖాళీ రహదారులపై హెల్మెట్ ధరించి బైక్ నడుపుతున్నట్లు చూపిస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఇక్కడ చూడవచ్చు. ఈ నటి గతంలో కూడా బెంగుళూరు వీధుల్లో స్వేచ్ఛగా బైక్ నడుపుతున్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది.

హార్లే డేవిడ్సన్‌ బైక్‌పై కనిపించిన మమతా మోహన్‌దాస్ [వీడియో]

మమతా మోహన్‌దాస్ బైక్ నడిపి దాదాపు 15 సంవత్సరాలు అయ్యిందని కూడా చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో అప్లోడ్ చేసి దాని కింద ఈ విధంగా రాసింది. "ఎవరో రైడ్‌కి తీసుకెళ్తారని వెయిట్ చెయ్యడం ఎందుకు? 15 సంవత్సరాల తర్వాత బైక్ డ్రైవ్ చేయడం అమేజింగ్".

MOST READ:మీరు మీ వాహనంతో తరచూ రాష్ట్రాలు మారుతుంటారా? అయితే, మీ కోసమే ఈ గుడ్ న్యూస్..

హార్లే డేవిడ్సన్‌ బైక్‌పై కనిపించిన మమతా మోహన్‌దాస్ [వీడియో]

బైక్ రైడ్ చేసి చాలా రోజులయ్యింది, అయినప్పటికీ బైక్ రైడింగ్ పై పట్టు కోల్పోలేదు అని తెలిపింది. ఇంతకు ముందు సినిమా షూటింగ్ అప్పుడు బైక్ రైడింగ్ చేసేదాన్ని అని చెప్పుకొచ్చింది. ఈ వీడియోలో మమతా మోహన్‌దాస్ హార్లే డేవిడ్సన్‌ బైక్ నడుపుతున్నట్లు తెలుస్తుంది.

ఈ వీడియో చూసిన చాలామంది మమతా అభిమానులు కామెంట్స్ కూడా చేశారు. అందులో ఒకరు మీరు అద్భుతమైన రైడర్, మీ బైక్ రైడింగ్ చాలా అద్భుతంగా ఉంది అని కామెంట్ చేశారు. మమతా క్యాన్సర్‌తో గెలిచి బయటపడిన సంగతి అందరికి తెలిసిందే. ఈమే ఎల్లప్పుడూ చాలా యాక్టివ్ గా ఉంటుంది కూడా.

MOST READ:స్నేహం ముందు తలవంచిన కరోనా.. అసలు విషయం ఏంటంటే?

హార్లే డేవిడ్సన్‌ బైక్‌పై కనిపించిన మమతా మోహన్‌దాస్ [వీడియో]

హార్లే డేవిడ్సన్‌ బైకులు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇవి చాలావరకు అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉండి వాహనదారులకు చాలా అనుకూలమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తాయి. కానీ ఈ బైకులు అత్యధిక ధర కలిగి ఉంటాయి.

Most Read Articles

English summary
Mamta Mohandas Rides A Harley Davidson. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X