కదులుతున్న రైలు ఎక్కేందుకు వ్యక్తి సాహసం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం.. లేదంటే.!!

రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి తృటిలో(Man Attempt To Board Running Train) ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న సంఘటన ఇటీవల పూణెలో చోటుచేసుకుంది. స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌లో ఈ విజువల్స్‌ రికార్డయ్యాయి. పూర్తి సమాచారం ఈ కథనంలో..

భారత్‌లో అత్యంత ముఖ్యమైన రవాణా మార్గాల్లో రైల్వే రంగం(Train Accidents) ఒకటి. ప్రతి రోజూ లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంది. ఈ క్రమంలో రైల్వే ప్రయాణం చాలా సురక్షితమైనప్పటికీ.. కొంతమంది తమ నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్ల అపాయాన్ని కొని తెచ్చుకుంటున్నారు. తద్వారా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

Man-Attempts-To-Catch-Running-Train

సురక్షితమైన ప్రయాణం కోసం రైల్వే ప్రయాణికులు ఓ అరగంట ముందే స్టేషన్‌కు చేరుకోవడం ఉత్తమం. చివరి నిమిషంలో హడావుడి పడటం కంటే. కాస్త ముందుగానే స్టేషన్‌కు చేరుకోవడం ద్వారా సురక్షితమైన ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. ఇందుకోసం రైల్వే శాఖ కూడా పలు సూచనలు జారీ చేస్తుంది. ముఖ్యమైన కదులుతున్న రైలు ఎక్కకూడదని హెచ్చరికలు చేస్తోంది.

అయినా కూడా కొందరు ఆ నిబంధనలు తుంగలో తొక్కుతూ.. ట్రైన్‌ను క్యాచ్‌ చేయాలనే ఆతృతలో పరిగెత్తి ఎక్కాలని ప్రయత్నిస్తుంటారు. అయితే ఇది చాలా ప్రమాదకరమని ఊహించరు. అదే పొరపాటు ఇక్కడ ఓ వ్యక్తి చేశాడు. ఓ ప్రయాణికుడి అజాగ్రత్త.. కారణంగా ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడింది. అదృష్టవశాత్తు అక్కడే ఉన్న రైల్వే ఉద్యోగి కారణంగా ప్రాణాలతో బయటపడ్డాడు.

Man-Attempts-To-Catch-Running-Train

కొన్ని రోజుల క్రితం ఉదయన్ ఎక్స్‌ప్రెస్ పూణె రైల్వే స్టేషన్‌(Man Attempts to Catch Running Train)లోని ప్లాట్‌ఫారమ్‌పై నిలబడి ఉంది. ప్రయాణికులందరూ ఈ రైలు ఎక్కుతున్నారు. బయల్దేరేందుకు సిద్ధంగా ఉన్న రైలు.. కాసేపటికి ప్రయాణం ప్రారంభించింది. ఆ తర్వాత చివరి నిమిషంలో వచ్చిన ఓ ప్రయాణికుడు కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నాడు.

ఆపై రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా జారిపడి కిందపడ్డాడు. దీంతో రైలు ప్లాట్‌ఫారమ్‌పైకి ఈడ్చుకుంటూ పోయాడు. ఇది గమనించిన సమీపంలోని రైల్వే ఉద్యోగి వెంటనే ఆ వ్యక్తిని రైలు పక్క నుంచి బయటకు తీసి ప్రాణాలను కాపాడాడు. ఇందుకు సంబంధించిన విజువల్స్‌ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

Man-Attempts-To-Catch-Running-Train

ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు సెంట్రల్ రైల్వే అడ్మినిస్ట్రేషన్(Train Accidents) సబ్-డివిజన్ X సైట్ పేజీలో షేర్ చేశారు. ఈ ఘటనలో ప్రయాణికుడి ప్రాణాలను కాపాడిన రైల్వే ఉద్యోగి దిగంబర్ దేశాయ్‌ను అభినందిస్తూ పూణే రైల్వే యంత్రాంగం ఈ వీడియోను విడుదల చేసింది.

అంతేకాకుండా ఇలా కదులుతున్న రైలు ఎక్కేందుకు ఎవరూ ప్రయత్నించవద్దని కూడా అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది ఈ వీడియోను షేర్ చేస్తూ కదులుతున్న రైలులో ఎవరూ ఎక్కకూడదని కామెంట్లు చేస్తున్నారు. దీనివల్ల జరిగే ప్రమాదాలు ప్రాణనష్టానికి కూడా దారితీస్తాయని ఎవరూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా చేయవద్దని సూచించారు.

Man-Attempts-To-Catch-Running-Train

రైల్వే స్టేషన్‌లలో ప్రయాణికులు నిత్యం అనేక ప్రమాదకరమైన సాహసాలకు పాల్పడుతూనే ఉంటారు. దీనిపై రైల్వే యంత్రాంగం ప్రయాణికులకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. కాగా తెలుగు రాష్ట్రాల్లో కూడా నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉంటున్నాయి. దీనిపై సైబరాబాద్‌ పోలీసులు కూడా సోషల్‌ మీడియా ద్వారా చాలానే అవగాహన కల్పిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Sunday, March 31, 2024, 0:59 [IST]
English summary
Man attempts to catch running train results near fatal accidents railway employee saves his life
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+