సైకిల్‌పై సవారీ.. చేతిలో ఫోన్, తలపై బ్రెడ్ ర్యాక్‌తో డేంజరస్ రైడింగ్.. నెటిజన్ల కామెంట్లతో వీడియో వైరల్
బతుకుదెరువు కోసం ప్రతి ఒక్కరూ ఏదో పనిచేయాల్సిందే. కుటుంబానికి కడుపు నిండా భోజనం, ఏ లోటు రాకుండా చూడాలనే ఆశతో బతుకు బండి లాగుతుంటారు. అది రిక్షా తొక్కి అయినా సరే.. అందుకే ఇక్కడ ఓ యువకుడు సైకిల్‌పై పెద్ద బ్రెడ్‌ను తీసుకెళ్తున్న వీడియో ఇంటర్నెట్(Viral Video)లో వైరల్ అయింది.
సాధారణంగా మీరు బయట చూసే ఉంటారు. ఊళ్లలో, చిన్న చిన్న పట్టణాల్లో షాపుల్లో చిరుతిండ్లకు సంబంధించి చిప్స్, లేస్, బిస్కట్ ప్యాకెట్స్ ఇంకా చాలా ఐటమ్స్.. వీటన్నిటినీ చిన్న వర్తకులు తమ మోపెడ్ బండిపై ఇరికించి పెట్టి ఎంతో చక్కగా బ్యాలెన్స్ చేసి తీసుకువెళ్తారు. అలా వారిని చూసినప్పుడు పొరపాటున కిందపడుతుందేమోనని చూసే వారికే భయమేస్తుంది. కానీ అది ఓ టెక్నిక్‌తో అలా తీసుకువెళ్తారు.

ఏదేమైనా బతుకు బండిని నడిపేందుకు ఇవన్నీ తప్పవు. అందుకే కుటుంబాన్ని పోషించడం కోసం తనకున్న మార్గంలోనే ఓ యువకుడు బతుకుబండిని లాగుతున్న తీరు, అతని టాలెంట్‌ను చూసి నెటిజన్లు ఔరా అంటున్నారు. అతడి సామర్థ్యానికి సలాం కొట్టకుండా ఉండలేకపోతున్నారు. రెండు చేతులతో పట్టుకోవడానికే వీలుకాని పెద్ద బ్రెడ్ ర్యాక్‌ను సైకిల్‌పై సింగిల్ హ్యాండ్‌తో రద్దీగా ఉన్న రోడ్డుపై తీసుకెళ్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.
ఈజిప్టులోని కైరోలో ఈ సంఘటన చోటుచేసుకుంది. కైరలో బిజీగా ఉన్న రోడ్డుపై ఓ యువకుడు సైకిల్ తొక్కుతూ తన తలపై రెండు ర్యాక్‌లతో ఉన్న పెద్ద బ్రెడ్ ప్యాక్‌ను ఒంటి చేత్తో పట్టుకుని చాలా టెక్నిక్‌గా సైకిల్ నడుపుతున్నాడు. అతను తన బ్యాలెన్స్‌ని మెయింటైన్ చేయడం, సాఫీగా రైడ్ చేయడం, ర్యాక్ పడిపోకుండా చేతులను మార్చి పట్టుకోవడం, రద్దీ రోడ్డుపై పెడల్‌ను నావిగేట్ చేయడం ఇవన్నీ అతని టాలెంట్లే..

ఇంకా వీడియోను సరిగ్గా గమనిస్తే ఆ యువకుడు ఓ చేత్తే బ్రెడ్ ర్యాక్‌ను పట్టుకోవడమే కాకుండా మరో చేత్తో సైకిల్ హ్యాండిల్‌ను పట్టుకోకుండా ఫోన్ మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది. కేవలం కాళ్లతోనే అతను సైకిల్‌ను తను వెళ్లాల్సిన రూట్లో సునాయాసంగా నడుపుతూ వెళ్తున్నాడు.
ఈ వీడియోలో నెట్టింట్లో వైరల్ కావడంతో నెటిజన్లు అతని టాలెంట్ చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఇప్పటివరకు ఈ వీడియో 5 లక్షల వ్యూస్‌ను సంపాదించుకుంది. కాంప్లిమెంట్స్‌తో కామెంట్ బాక్స్ నిండిపోయిందనే చెప్పాలి. ట్రాఫిక్‌లో మల్టీ టాలెంటెడ్ పర్సన్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. సైకిల్‌ను బ్యాలెన్సింగ్‌గా నడపడంలో అతనికి చాలా టాలెంట్ ఉందని వ్యాఖ్యానించారు.

ఏదేమైనా ఎంత టాలెంట్ ఉన్నా ఇలా రద్దీగా ఉండే రోడ్లపై ఇలా వెళ్లడం ప్రమాదకరం. ఇలా డ్రైవింగ్ చేయడంలో ఎన్ని స్కిల్స్ ఉన్నా వెనుక నుంచి వచ్చే ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి రోడ్డుపై ఇలా ఇతరులకు భయం కలిగించేలా డ్రైవింగ్ చేయకుండా జాగ్రత్తగా వాహనం నడపాలని వాహనదారులు గుర్తుంచుకోవాలి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








