మనవడి కోసం ఎలక్ట్రిక్ లాంబోర్గినీ కారును తయారు చేసిన తాత

By Ravi

సాధారణంగా తాతలకి తమ మనవళ్లు/మనవరాళ్లంటే ఎంతో ప్రీతి ఉంటుంది. వృద్ధాప్యంలో వారికి మనవళ్లు/మనవరాళ్లే మంచి కాలక్షేపంగా ఉంటారు. అంతేకాదు.. తాతలు తమ మనవళ్లు/మనవరాళ్ల కోసం తమకు తోచిన రీతిలో కానుకలు కూడా సమర్పించుకుంటుంటారు. కొందరు ఈ కానుకలను కొనుగోలు చేస్తే, మరికొందరు మాత్రం తమ నైపుణ్యానికి పదును పెట్టి కానుకలు తయారు చేస్తుంటారు. ఈ కథనంలో మనం అలాంటి ఓ క్రియేటివ్ తాత గురించి తెలుసుకుందాం రండి..!

చైనాలో వ్యవసాయం చేసుకునే ఓ తాత తన మనవడిని రోజుకు స్కూలుకు తన ఎలక్ట్రిక్ మెపెడ్‌పై తీసుకువెళ్లేవాడు. అయితే, ఇది అంత సురక్షితం కాదని భావించిన అతను, తన మనవడి కోసం ఓకంగా ఏకంగా ఎలక్ట్రిక్ కారునే తయారు చేశాడు. అదికూడా అలాంటి ఇలాంటి కారును కాదు, లాంబోర్గినీని పోలి ఉండే ఎలక్ట్రిక్ కారు. ఆ తాత పేరు ఓల్డ్ గువో. సెంట్రల్ చైనాలోని జెంఘ్జౌ రీజియన్‌కి చెందినవాడు. మరి ఆ తాత మనవడి విశేషాలను, లాంబోర్గినీని పోలిన ఎలక్ట్రిక్ వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి..!

మనవడికి తాత ఇచ్చిన కానుక!

ఓల్డ్ గువో ఈ లాంబోర్గినీ స్టయిల్ ఎలక్ట్రిక్ కారును స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేశాడు. ఈ కారు విడిభాగాలన్నింటినీ యంత్రాల సాయం లేకుండానే కట్ చేసి, తన స్వంత వర్క్‌షాపులోనే స్వయంగా మోల్డ్ చేశాడు.

మనవడికి తాత ఇచ్చిన కానుక!

ఈ కారును తయారు చేయటానికి ఓల్డ్ గువో తాతకు దాదాపు ఆరు నెలల సమయం పట్టింది. ఈ చిన్న ఎలక్ట్రిక్ లాంబోర్గినీ రెప్లికా కోసం ఆయన సుమారు 5000 యువాన్‌లు (815 డాలర్లు) వెచ్చించాడట.

మనవడికి తాత ఇచ్చిన కానుక!

ఈ ఎలక్ట్రిక్ కారు 2 మీటర్ల పొడవును, 1 మీటర్ వెడల్పును కలిగి ఉంటుంది. ఇందులో 5 బ్యాటరీలు ఉంటాయి. వీటిని పూర్తి చార్జ్ చేసుకుంటే 60 కీలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు.

మనవడికి తాత ఇచ్చిన కానుక!

ఎలాంటి లాంబోర్గినీ రెప్లికా అయిన సిజర్ డోర్స్ లేకపోతే ఆ కారుకు అందమే ఉండదు. అందుకే, ఓల్డ్ గువో తయారు చేసిన ఈ లాంబోర్గినీ రెప్లికా ఎలక్ట్రిక్ కారులో కూడా సిజర్ డోర్స్‌ను డిజైన్ చేశారు.

మనవడికి తాత ఇచ్చిన కానుక!

ఈ ఎలక్ట్రిక్ కారు స్టీరింగ్ వీల్‌పై 3 బటన్లు ఉంటాయి. అందులో ఒకటి హారన్ కోసం, మరొకటి కారును ముందుకు నడపటానికి మరియు ఇంకొకటి కారును వెనక్కి నడపటానికి ఉపయోగపడుతుంది. ఇంటర్నెట్ నుంచి లాంబోర్గినీ లోగోను కొనుగోలు చేసి ఈ కారుపై అతికించారు. ఈ కారులో స్టీరియో సిస్టమ్ కూడా ఉంటుంది.

మనవడికి తాత ఇచ్చిన కానుక!

ఈ కారులో ఎలక్ట్రిక్ పవర్ విండోస్, ఆటోమేటిక్ రెయిన్ కానోపీ (రూఫ్) కూడా ఉన్నాయి. అంటే ఇదొక కన్వర్టిబల్ కారు అన్నమాట. చూడటానికి చిన్న కారులా ఉన్న, ఇది అన్ని సదుపాయాలు ఉన్న కారు.

మనవడికి తాత ఇచ్చిన కానుక!

ఓల్డ్ గువో దురదృష్టం ఏంటంటే, ఈ ఎలక్ట్రిక్ కారును మెయిన్ రోడ్లపై డ్రైవ్ చేసేందుకు అనుమతి లేదు. రోడ్డుకు పక్కన ఉండే వీధుల్లో మాత్రం దీనిని నడుపుకోవచ్చు. బహుశా.. ఓల్డ్ గువో తన మనవడిని ఈ కారులో రోజూ స్కూలుకు తీసుకువెళ్తుండొచ్చమో!

Most Read Articles

English summary
This is the story of a Chinese farmer who felt it was not safe to take his grandson to school in his electric moped. So, he did the next best thing he could come up with. He took to a car; not one that he bought, but one that he built himself.
Story first published: Monday, March 17, 2014, 5:59 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X