భార్య ఎదుట బిల్డప్‌ల కోసం కారుపై పటాకులు పేల్చిన భర్త.. చివరికి.!!
వేడుకల పేరుతో ఇటీవల కొందరు పబ్లిక్ రోడ్లపై ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇతరులకు ఇబ్బందిని కలిగిస్తున్నారు. అంతే కాకుండా వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి తన భార్యను ఇంప్రెస్ చేసేందుకు కదులుతున్న కారులో పటాకులు పేల్చాడు.
పండుగలు, పుట్టినరోజులు ఇంకా వివాహ వార్షికోత్సవాల లాంటి సందర్భాలను ప్రత్యేకంగా జరుపుకోవాలని చాలా మంది అనుకుంటారు. అయితే దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఇళ్లు, హోటల్స్, లేదంటే కొన్ని నిర్దేశించిన ప్రదేశాలు.. ఇంతవరకూ ఓకే.. కానీ వీటిని అతిక్రమిస్తేనే చర్యలు తప్పవు.

ఈ క్రమంలో చాలా మంది తమ వద్ద ఉన్న లగ్జరీని నలుగురికీ చూపించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకోసం సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దీపావళి, ఇతర సందర్భాల్లో కొందరు ఆకతాయిలు రోడ్డుపై కారులో వెళ్తూ టపాసులు కాల్చిన సందర్భాలు చూశాం. తాజాగా ఇలాంటి సంఘటనే మరొకటి చోటుచేసుకుంది.
గత నెల చివర్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. కాగా ఇటీవలే ఈ వీడియో పోలీసుల దృష్టికి చేరింది. ఫోర్డ్ ముస్టాంగ్ స్పోర్ట్స్ కారు యజమాని.. కారు వెనుక డెక్‌లిడ్‌కు బాణసంచా అంటించాడు. కాగా అతను డ్రైవింగ్ చేస్తుండగా అది పగిలిపోయింది. వీడియోను పరిశీలిస్తే ఇంది పంజాబ్‌లోని సోహానాలో జరిగినట్లుగా తెలుస్తోంది.

ఈ వీడియోను ఓ యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేశారు. కాగా ఈ వీడియో గత నెల 25 న జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ వీడియో ఈ నెల 2 న పోలీసులకు అందింది. దీంతో పోలీసులు కారు యజమానిని అరెస్ట్ చేశారు. కారు రిజిస్ట్రేషన్ నంబర్ సహాయంతో యజమానిని గుర్తించామని పోలీసులు చెప్పారు.
కాగా ఫోర్డ్ ముస్టాంగ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రిజిస్టర్ చేయబడినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఈ కేసు ఇన్‌ఛార్జ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సమాధానమిచ్చారు. ఈ వీడియో తమ దృష్టికి వచ్చిన వెంటనే దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. అయితే ఆ మరుసటి రోజే ఓ వ్యక్తి.. ఫోర్ట్ ముస్టాంగ్ కారు యజమానిపై ఫిర్యాదు చేయడానికి వచ్చినట్లు పేర్కొన్నారు.

ఆ వ్యక్తి వివరాలు వెల్లడించలేమని పోలీసు ఇన్‌స్పెక్టర్ తెలిపారు. కారు మీద బాణసంచా పేలడం ద్వారా వచ్చిన నిప్పురవ్వలు అతని స్కూటర్‌పై, అతనిపై పడటంతో ఆ వ్యక్తి ఫిర్యాదు చేయడానికి వచ్చినట్లు వివరించారు. అదృష్టవశాత్తు స్కూటర్ రైడర్‌కు గాయాలు తప్పాయని చెప్పారు. కాగా ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు ఆ వ్యక్తి వచ్చినట్లు పేర్కొన్నారు.
కాగా వెనుక బాణసంచాతో వీడియోలో నడపబడిన ఫోర్డ్ ముస్టాంగ్ స్పోర్ట్స్ కారు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నట్లు తెలిసిందని పోలీసు ఇన్‌స్పెక్టర్ అన్నారు. కారును గుర్తించేందుకు ప్రత్యేకంగా ఓ బృందాన్ని కూడా పంపినట్లు చెప్పారు. రిజిస్ట్రేషన్ నంబర్ సహాయంతో కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
కాగా ఇలా ఎందుకు చేశారని యజమానిని అడగగా.. వార్షికోత్సవం సందర్భంగా ఈ వీడియో తీసినట్లు కారు యజమాని తెలిపాడు. తన వాహనాన్ని ప్రదర్శించడంతో పాటు తన గురించి అందరికీ తెలియజేయడానికి ఈ వీడయో రూపొందించినట్లు చెప్పాడు. కాగా విచారణలో, ఈ ప్రత్యేకమైన ఫోర్డ్ ముస్టాంగ్‌పై ఇప్పటికే 14 చలాన్‌లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిసి పోలీసులు షాక్ అయ్యారు.


Click it and Unblock the Notifications








