ఒక్కటి కాదు, ఏకంగా 11 ఏథర్ స్కూటర్లు కొన్నారు.. సోషల్ మీడియాలో వైరల్! అంతగా వాటిలో ఏముందో?
ఇటీవలి కాలంలో భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా టూవీలర్స్ విభాగంలో ఈ పెరుగుదల మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కసారి ఎలక్ట్రిక్ స్కూటర్ కొని, దాని పనితీరుతో సంతృప్తి చెందితే, ఆ వ్యక్తి తన కుటుంబ సభ్యుల కోసం కూడా అదే బ్రాండ్ స్కూటర్లను కొనడం ఒక సాధారణమైన ట్రెండ్‌గా మారింది. ఇలాంటి ఆసక్తికరమైన ఉదాహరణగానే దివాకర్ అనే వ్యక్తి కథ ప్రస్తావనలోకి వచ్చింది. ఏథర్ ఎనర్జీ ఇటీవల తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పంచుకున్న సమాచారం ప్రకారం, దివాకర్ ఇప్పటి వరకు మొత్తం 11 ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేశారు. ఇది సాధారణమైన విషయం కాదు. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తి ఒకే బ్రాండ్‌కి ఇంతగా ఆకర్షితుడై, వరుసగా 11 స్కూటర్లు కొనడం విశేషం.
దివాకర్ 2020లో తన మొదటి ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి క్రమంగా ఆ వాహనంపై అతని విశ్వాసం మరింత పెరిగింది. ఐదేళ్ల కాలంలో, ఆయన తన కుటుంబ అవసరాలకు అనుగుణంగా 11 స్కూటర్లను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం అతని వద్ద ఆరు ఏథర్ 450X స్కూటర్లు, మూడు ఏథర్ అపెక్స్ మోడళ్లు, ఒక రిస్టా ఉన్నాయి. ప్రతి వాహనం అతని కుటుంబంలోని విభిన్న సభ్యులు వాడుతున్నారు.

ఇది కేవలం ఒక వ్యక్తి బ్రాండ్‌పై నమ్మకం ఉంచిన ఉదాహరణ మాత్రమే కాదు, ఎలక్ట్రిక్ స్కూటర్లపై ప్రజలలో ఏర్పడుతున్న విశ్వాసానికి, డిమాండ్‌కు స్పష్టమైన సూచన కూడా. ఎలక్ట్రిక్ వాహనాలు కేవలం డబ్బు ఆదా చేసే సాధనాలుగా కాకుండా, కుటుంబ జీవనశైలిలో భాగమవుతున్నాయని దివాకర్ కథ బలంగా చెబుతోంది. ఏథర్ ఎనర్జీ తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా ఈ విషయం బాగా వైరల్ అవుతుంది.
X పోస్ట్‌లో వెల్లడి అయిన వివరాల ప్రకారం, దివాకర్, అతని కుటుంబం ఇప్పటికే 3 ఏథర్ అపెక్స్‌లు, 6 ఏథర్ 450Xలు, ఒక రిజ్టా కలిగి ఉన్నప్పటికీ, గ్యారేజ్‌లోకి మరో అపెక్స్‌ను చేర్చాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల ఏథర్ కమ్యూనిటీ డే 2025లో సీఈఓ తరుణ్ మెహతా ఇన్ఫినిట్ క్రూయిజ్ విడుదల చేయగా, దీనిని గుర్తుండిపోయేలా చేస్తూ, ఏథర్ ఎనర్జీ సహ వ్యవస్థాపకుడు స్వాప్నిల్ జైన్ స్వయంగా దివాకర్‌కు స్కూటర్‌ను అందజేశారు.

ఇక ఏథర్ వైపు వస్తే, ఈ మధ్యే కంపెనీ తన కొత్త EL (ఎన్‌లైటెన్డ్) ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించింది. ఇది బ్రాండ్ భవిష్యత్తు ఉత్పత్తులన్నింటికీ బలమైన పునాది వంటిది. ఈ ప్లాట్‌ఫామ్ డిజైన్ పరంగా ఖర్చును తగ్గించేలా, అలాగే వినియోగదారులు సులభంగా సర్వీస్ చేయించుకునేలా, నిర్వహించుకునేలా తీర్చిదిద్దబడింది. అంటే, ఎవరైనా తక్కువ ఖర్చుతో, ఎక్కువ సౌలభ్యంతో వాడుకోగలిగేలా ప్లాన్ చేశారు.
ఈ EL ప్లాట్‌ఫామ్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది కేవలం ఒక నిర్దిష్ట తరగతి వాహనాలకే పరిమితం కాదు. బేసిక్ ఫ్యామిలీ స్కూటర్ల నుంచి హై-పెర్ఫార్మెన్స్ మోడళ్ల వరకు ఏదైనా ఈ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేయవచ్చు. అందుకోసం విభిన్న రకాల బ్యాటరీ ఎంపికలు, వీల్ సైజులు, అలాగే వేరువేరైన డాష్‌బోర్డ్ డిజైన్‌లకు సపోర్ట్ చేస్తుంది. అంటే వినియోగదారుల అవసరాలకు తగినట్లు విభిన్న ఉత్పత్తులను తీసుకురావడానికి ఇది సహాయపడుతుంది.

కానీ, ఇది గతంలో రిజ్టా, 450 సిరీస్ మోడళ్లలో వాడిన ప్లాట్‌ఫామ్‌లకంటే పూర్తిగా భిన్నం అని ఏథర్ చెబుతోంది. ఈసారి వారు యూనిబాడీ స్టీల్ ఫ్రేమ్‌ను తీసుకువచ్చారు. ఇది కేవలం బలమైనదే కాకుండా, బహుముఖ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ ఫ్రేమ్ డిజైన్‌లో ఒక ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే, 2 kWh నుంచి 5 kWh వరకు ఉన్న విభిన్న పరిమాణాల బ్యాటరీ ప్యాక్‌లను ఫ్లోర్‌బోర్డ్ కింద సులభంగా అమర్చుకోవచ్చు.


Click it and Unblock the Notifications








