కోవిడ్-19 రిలీఫ్ ఫండ్‌తో ఖరీదైన కార్లు, వాచ్‌లు కొన్నాడు.. చివరికి పోలీసులకు చిక్కడంతో..

గత రెండేళ్ల క్రితం ప్రారంభమైన కోవిడ్-19 మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఎందరో అమాయకుల ప్రాణాలను బలితీసుకుంది. ఇప్పటికీ కొన్ని దేశాలు ఇంకా ఈ మహమ్మారితో పోరాడుతూనే ఉన్నాయి, మరికొన్ని దేశాలు ఈ మహమ్మారి సృష్టించిన సంక్షోభం నుండి బయటపడేందుకు సతమతమవుతున్నాయి. గతంలో ఈ వైరస్ తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు దేశాలను మరియు దేశ ప్రజలను కాపాడుకునేందుకు చాలా మంది స్వచ్ఛందంగా విరాళాలు అందజేశారు. ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించాల్సిన అలాంటి నిధులను కాజేశాడు ఓ ప్రబుద్ధుడు.

కోవిడ్-19 రిలీఫ్ ఫండ్‌తో ఖరీదైన కార్లు, వాచ్‌లు కొన్నాడు.. చివరికి పోలీసులకు చిక్కడంతో..

వివరాల్లోకి వవెళితే.. అమెరికాలోని టెక్సాస్‌లో ఒక వ్యక్తికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాహనాలలో ఒకటైన లాంబోర్ఘిని ఉరస్ కారును మరియు ప్రపంచంలో అత్యంత ఖరీదైన చేతి గడియారాలలో ఒకటైన రోలెక్స్ వాచ్‌ని కొనుగోలు చేయడానికి కరోనా వైరస్ రిలీఫ్ ఫండ్‌ను ఉపయోగించాడు. ఈ నేరం రుజువైనందుకు గానూ అమెరికా కోర్టు ఇప్పుడు అతనికి తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధించబడింది.

కోవిడ్-19 రిలీఫ్ ఫండ్‌తో ఖరీదైన కార్లు, వాచ్‌లు కొన్నాడు.. చివరికి పోలీసులకు చిక్కడంతో..

యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ప్రకారం, లీ ప్రైస్ III అనే వ్యక్తి నకిలీ పేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ (పిపిపి) కింద 1.6 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 12 కోట్లు) రుణం తీసుకుని, దానితో జల్సాలు చేయడం ప్రారంభించాడు. తన ఉద్యోగుల భద్రత కోసం ఉపయోగించాల్సిన ఈ డబ్బుతో అతను విలాసవంతమైన జీవితం సాగించాడు. ఖరీదైన ఇటాలియన్ లాంబోర్ఘిని కారును కూడా కొనుగోలు చేశాడు.

కోవిడ్-19 రిలీఫ్ ఫండ్‌తో ఖరీదైన కార్లు, వాచ్‌లు కొన్నాడు.. చివరికి పోలీసులకు చిక్కడంతో..

లీ ప్రైస్ తన అక్రమ కార్యకలాపాలను దాచడానికి, మోసపూరితంగా మూడు షెల్ కంపెనీలను తెరిచి వాటిలో డబ్బును డిపాజిట్ చేశాడు. తన రుణ అభ్యర్థనను ధృవీకరించడానికి ప్రైస్ నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ మరియు పన్ను రికార్డులను కూడా సమర్పించినట్లు న్యాయ శాఖ పేర్కొంది. టెక్సాస్ కోర్టు ప్రకారం, 30 ఏళ్ల లీ ప్రైస్ కొనుగోలు చేసిన లాంబోర్ఘిని కారు మినహా ఉద్యోగులు లేదా పేరోల్‌కు సంబంధించిన ఎలాంటి రికార్డులు అతని వద్ద లేవు.

కోవిడ్-19 రిలీఫ్ ఫండ్‌తో ఖరీదైన కార్లు, వాచ్‌లు కొన్నాడు.. చివరికి పోలీసులకు చిక్కడంతో..

దొరికితే దొంగ దొరక్కపోతే దొర అన్న చందంగా లీ ప్రైస్ పోలీసులకు దొరకనంత వరకూ కోవిడ్ రిలీఫ్ ఫండ్ క్రింద తీసుకున్న రుణంతో జల్సా రాయుడిలా బ్రతికాడు. ఇలా అప్పు చేసిన డబ్బుతో అతను లాంబోర్గినీ ఉరస్, ఫోర్డ్ ఎఫ్-350 పికప్ ట్రక్, రోలెక్స్ వాచ్‌ వంటి విలాసవంతమైన అత్యంత ఖరీదైన వస్తువులను కొనుగోలు చేశాడు. కాగా, అధికారులు ఇప్పటి వరకూ అతడి నుండి సుమారు 7,00,000 డాలర్లకు (దాదాపు 525 కోట్లకు) పైగా రికవరీ చేశారు.

కోవిడ్-19 రిలీఫ్ ఫండ్‌తో ఖరీదైన కార్లు, వాచ్‌లు కొన్నాడు.. చివరికి పోలీసులకు చిక్కడంతో..

పేచెక్ ప్రోగ్రామ్‌లో అనేది కరోనా మహమ్మారితో బాధపడుతున్న ప్రజలకు, ఉద్యోగులకు ఆర్థిక సహాయం అందించడానికి టెక్సాస్‌లో ప్రారంభించబడిన రిలీఫ్ ప్రోగ్రామ్. ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వాన్ని మోసం లీ ప్రైస్ ఒక్కడే కాదు, ఇలాంటి వాళ్లు సుమారు 474 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరందరిలోకి లీ ప్రైస్ ఘరానా మోసగాడు అని తెలుస్తోంది. ఇటువంటి మోసాల కారణంగా టెక్సాస్ ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు అర కోటి డాలర్లకు పైగా నష్టపోయినట్లు అంచనా.

కోవిడ్-19 రిలీఫ్ ఫండ్‌తో ఖరీదైన కార్లు, వాచ్‌లు కొన్నాడు.. చివరికి పోలీసులకు చిక్కడంతో..

ఇక మన జల్సా రాయుడు లీప్రైస్ కొనుగోలు చేసిన లాంబోర్ఘిని ఉరస్ కారు విషయానికి వస్తే, ఈ కారు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే, సాధారణంగా ఎల్లప్పుడూ స్పోర్ట్స్ కార్లు మరియు సూపర్ కార్లు మాత్రమే తయారు చేసే లాంబోర్ఘినీ సంస్థ మొట్టమొదటి సారిగా తయారు చేసిన ఎస్‌యూవీ ఇది. ఇటాలియన్ సూపర్ కార్ బ్రాండ్ లాంబోర్ఘిని తమ ఉరస్ కారును తొలిసారిగా 2019 లో అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేసింది. మనదేశంలో కూడా ఇది లభిస్తుంది.

కోవిడ్-19 రిలీఫ్ ఫండ్‌తో ఖరీదైన కార్లు, వాచ్‌లు కొన్నాడు.. చివరికి పోలీసులకు చిక్కడంతో..

ఈ కారును సాధారణంగా ధనికులు, సెలబ్రిటీలు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఇటీవలే ఇలాంటి ఓ కారును కొనుగోలు చేసినట్లు సమాచారం. లాంబోర్ఘిని ఉరస్ ఎస్‌యూవీలో శక్తివంతమైన 4.0 లీటర్ 8 సిలిండర్ ట్విన్ టర్బో వి8 పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 641 బిహెచ్‌పిల శక్తిని మరియు 850 న్యూటన్ మీటర్ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

కోవిడ్-19 రిలీఫ్ ఫండ్‌తో ఖరీదైన కార్లు, వాచ్‌లు కొన్నాడు.. చివరికి పోలీసులకు చిక్కడంతో..

లాంబోర్ఘిని అందిస్తున్న అత్యంత శక్తివంతమైన కార్లలో ఇది కూడా ఒకటి. ఈ సూపర్ ఎస్‌యూవీ కేవలం 3.6 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు మరియు గరిష్టంగా గంటకు 305 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయగలదు. ఈ కారును కేవలం వీకెండ్ డ్రైవ్ కోసమే కాకుండా ఆఫ్-రోడింగ్ కోసం కూడా ఉపయోగించేలా కంపెనీ దీనిని రూపొందించింది. ఉరస్ లో వివిధ డ్రైవింగ్ మోడ్‌లు కూడా ఉంటాయి.

కోవిడ్-19 రిలీఫ్ ఫండ్‌తో ఖరీదైన కార్లు, వాచ్‌లు కొన్నాడు.. చివరికి పోలీసులకు చిక్కడంతో..

లాంబోర్ఘిని ఉరస్ ఎస్‌యూవీని ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ యొక్క ఎమ్ఎల్‌బి ఇవో ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడింది నిర్మించారు. ఇదే ప్లాట్‌ఫారమ్ పై ఫోక్స్‌వ్యాగన్ గ్రూపు నుండి ఆడి క్యూ7 మరియు పోర్ష్ కయూన్ లగ్జరీ ఎస్‌యూవీలను కూడా తయారు చేస్తున్నారు. కంపెనీ ఈ ఎస్‌యూవీని తమ సూపర్ కార్ హురాకాన్ నుండి ప్రేరణ పొంది డిజైన్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకూ సుమారు 15,000 యూనిట్లకు పైగా లాంబోర్ఘిని ఉరస్ కార్లు అమ్ముడయ్యాయి. మార్కెట్లో ఈ కారు ధర సుమారు రూ. 1.44 కోట్లకు పైమాటే.

Most Read Articles

English summary
Man buys lamborghini urus from covid 19 relief fund in texas sent to jail
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X