అపార్ట్‌మెంట్ కష్టాలు.. ఎలక్ట్రిక్ స్కూటర్‌ని చార్జ్ పెట్టుకోనివ్వలేదని ఇలా చేశారు..

పెట్రోల్ ధరలు ఆకాశన్నంటుతున్న తరుణంలో దేశంలోని ప్రజలు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ విషయంలో ఇప్పటికీ అనేక మందిలో అపోహలు ఉన్నాయి. ఒకవేళ ఈ విషయంలో కొనుగోలుదారుల్లో అవగాహన ఉన్నప్పటికీ, మన చుట్టూ ఉన్న పరిస్థితులు మాత్రం ఇందుకు అనుకూలంగా లేవు.

అపార్ట్‌మెంట్ కష్టాలు.. ఎలక్ట్రిక్ స్కూటర్‌ని చార్జ్ పెట్టుకోనివ్వలేదని ఇలా చేశారు..

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు సర్వసాధారణం అవుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు ప్రజాదరణ పొందినప్పటికీ, వాటి ఛార్జింగ్ స్టేషన్లు ఎలక్ట్రిక్ వాహన యజమానులకు ప్రధానంగా ఆందోళన కలిగించే అంశంగా ఉన్నాయి. ఇటీవల, ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ యజమాని తన అపార్ట్‌మెంట్ పార్కింగ్ ప్రాంతంలో ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించగా, సదరు అపార్ట్‌మెంట్ కమ్యూనిటీ అనుమతి నిరాకరించిన సంఘటన వెలుగులోకి వచ్చింది.

అపార్ట్‌మెంట్ కష్టాలు.. ఎలక్ట్రిక్ స్కూటర్‌ని చార్జ్ పెట్టుకోనివ్వలేదని ఇలా చేశారు..

దీనికి నిరసనగా అతను ఓ విచిత్రమైన నిర్ణయం తీసుకున్నారు. సమాచారం ప్రకారం, ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరు నగరంలో జరిగింది. నగరానికి చెందిన 'విష్ గంటి' అనే ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి ఏథర్ ఎనర్జీ అందిస్తున్న ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనుగోలు చేశారు. కాగా, ఈ స్కూటర్ ను చార్జ్ చేసుకోవటానికి అతను నివాసం ఉండే అపార్ట్‌మెంట్ పార్కింగ్ ప్లేస్ లో చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవటానికి, కమ్యూనిటినీ కోరగా, అందుకు కమ్యూనిటీ నిరాకరించింది.

అపార్ట్‌మెంట్ కష్టాలు.. ఎలక్ట్రిక్ స్కూటర్‌ని చార్జ్ పెట్టుకోనివ్వలేదని ఇలా చేశారు..

ఈ విషయాన్ని అతను స్వయంగా తన లింక్డ్ఇన్ ఖాతాలో వెల్లడించారు. గత నాలుగు నెలలుగా అపార్ట్‌మెంట్ కమ్యూనిటీతో ఈ విషయం గురించి చర్చిస్తున్నానని, అయినా వారు దీనికి సానుకూలంగా స్పందించలేదని అన్నారు. ఓవైపు యావత్ దేశమంతా గ్రీన్ మొబిలిటీ వైపు చూస్తుంటే, నగరంలోని ప్రజల్లో మాత్రం ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కనీస అవగాహన కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అపార్ట్‌మెంట్ కష్టాలు.. ఎలక్ట్రిక్ స్కూటర్‌ని చార్జ్ పెట్టుకోనివ్వలేదని ఇలా చేశారు..

ఇందుకు నిరసనగా విష్ గంటి తన ఎలక్ట్రిక్ స్కూటర్ ను అపార్ట్‌మెంట్ లిఫ్ట్ లో ఎక్కించి, తాను ఉంటున్న 5వ అంతస్తు వరకూ తీసుకువెళ్లి వంట ఇంటిలో ఉంచి చార్జ్ చేశారు. ఇలా తీసిన ఫొటోలను ఆయన తన లింక్డ్ఇన్ లో షేర్ చేశారు. అపార్ట్‌మెంట్ కమ్యూనిటీ పట్ల నిరసన వ్యక్తం చేసేందుకు మరియు ఎలక్ట్రిక్ వాహనాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇలా చేసినట్లు ఆయన తెలిపారు.

అపార్ట్‌మెంట్ కష్టాలు.. ఎలక్ట్రిక్ స్కూటర్‌ని చార్జ్ పెట్టుకోనివ్వలేదని ఇలా చేశారు..

ఇది కేవలం అవగాహన కోసం మాత్రమేనని, తనలాగా ఎవ్వరూ చేయవద్దని అన్నారు. ఎందుకంటే ఇందులో ఎలక్ట్రిక్ షాక్, షార్ట్ సర్కూట్ వంటి ప్రమాదాలు మరియు స్కూటర్ ను లిఫ్ట్ లో ట్రాన్స్ పోర్ట్ చేయటవం కలిగే డ్యామేజ్ వంటి అంశాల గురించి అతను గుర్తు చేశారు. విష్ గంటి మాదిరిగా అనేక మంది అపార్ట్‌మెంట్ లలో నివసించే వారు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు మరియు వినియోగం విషయంలో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

అపార్ట్‌మెంట్ కష్టాలు.. ఎలక్ట్రిక్ స్కూటర్‌ని చార్జ్ పెట్టుకోనివ్వలేదని ఇలా చేశారు..

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న కొన్ని హై-ఎండ్ ప్రీమియం ఎలక్ట్రిక్ టూవీలర్లలో తొలగించగల (రిమూవబల్) బ్యాటరీ ఉండదు, కాబట్టి వాటినిని ఖచ్చితంగా వాల్‌కి దగ్గరగా ప్లగ్ చేసి మాత్రమే చార్జ్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో, అపార్ట్‌మెంట్ లలో నివసించే వారు ఎలక్ట్రిక్ టూవీలర్లను కొనుగోలు చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అపార్ట్‌మెంట్ కష్టాలు.. ఎలక్ట్రిక్ స్కూటర్‌ని చార్జ్ పెట్టుకోనివ్వలేదని ఇలా చేశారు..

నిజానికి అపార్ట్‌మెంట్ లలో అన్ని ఫ్లాట్‌లకు చెందిన ఎలక్ట్రిక్ రీడింగ్ మీటర్స్ అన్ని కూడా బేస్‌మెంట్ లేదా గ్రౌండ్ ఫ్లోర్ లోనే అమర్చబడి ఉంటాయి. కాబట్టి, సదరు ఫ్లాట్ ఓనర్ తన స్వంత మీటర్ కనెక్షన్ సాయంతో తనకు కేటాయించిన పార్కింగ్ ప్రదేశానికి దగ్గరగా చార్జింగ్ పోర్టును ఏర్పాటు చేసుకోవచ్చు. కాకపోతే, ఇందులో ఎలాంటి ప్రమాదం లేదు. కానీ, మనదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో ఉన్న అపోహలే ఇందుకు ప్రధాన అడ్డంకిగా మారుతున్నాయి.

అపార్ట్‌మెంట్ కష్టాలు.. ఎలక్ట్రిక్ స్కూటర్‌ని చార్జ్ పెట్టుకోనివ్వలేదని ఇలా చేశారు..

దేశంలో ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా ప్రజాదరణ పొందుతున్నాయి మరియు వీటి అమ్మకాలు, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలపై రాయితీలు మరియు ఇతర ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. కానీ, వాటి చార్జింగ్ ఇలాంటి అపోహలు పూర్తిగా తొలగిపోనంత వరకూ మనం ఇలాంటి సంఘటనలు ఇక ముందు కూడాల్సి రావచ్చేమో.

అపార్ట్‌మెంట్ కష్టాలు.. ఎలక్ట్రిక్ స్కూటర్‌ని చార్జ్ పెట్టుకోనివ్వలేదని ఇలా చేశారు..

Ather 450X స్పెషల్ ఏంటి?

సరే అదంతా అటుంచి ఏథర్ 450ఎక్స్ (Ather 450X) విషయానికి వస్తే, బెంగుళూరు మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.59 లక్షలు (ఎక్స్ షోరూమ్) గా ఉంది. ఇందులో 6 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది, ఇది 26 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 2.9 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ ఐపి67 రేటెడ్ వాటర్‌ప్రూఫ్ వ్యవస్థను కలిగి ఉంటుంది.

అపార్ట్‌మెంట్ కష్టాలు.. ఎలక్ట్రిక్ స్కూటర్‌ని చార్జ్ పెట్టుకోనివ్వలేదని ఇలా చేశారు..

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి బ్యాటరీ ఛార్జ్‌పై గరిష్టంగా 85 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లు. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇది కేవలం 3.3 సెకన్లలోనే గంటకు 0 - 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ గ్రే, వైట్, గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కంపెనీ ఈ బ్యాటరీపై 3 ఏళ్ల సమగ్ర వారంటీని ఆఫర్ చేస్తోంది.

అపార్ట్‌మెంట్ కష్టాలు.. ఎలక్ట్రిక్ స్కూటర్‌ని చార్జ్ పెట్టుకోనివ్వలేదని ఇలా చేశారు..

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అనేక స్మార్ట్ ఫీచర్లతో కూడిన పెద్ద టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 4జి నెట్‌వర్క్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది. దీని సాయంతోనే స్కూటర్‌ను కంట్రోల్ చేయవచ్చు. ఇంకా ఇందులో పార్క్ అసిస్ట్ అనే ఫీచర్ ఉంటుంది. ఈ ఫీచర్ సాయంతో స్కూటర్‌ను రివర్స్‌లో రైడ్ చేయవచ్చు. కాకపోతే, రివర్సులో రైడ్ చేసేటప్పుడు స్కూటర్ స్పీడ్ గంటకు 5 కిమీగా మాత్రమే ఉంటుంది.

Most Read Articles

English summary
Man charges his ather electric scooter in 5th floor apartment here is why
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X