'విల్లాగా మారిన విమానం.. ఫిదా అవుతున్న జనం' - ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్..

దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల ఓ ఇంట్రస్టింగ్ వీడియో షేర్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో మీరు గమనించినట్లయితే.. ఓ భారీ విమానం అద్భుతమైన విల్లాగా మారింది. విమానం ఏంటి? విల్లాగా మారటం ఏంటని కొందరికి తప్పకుండా అనుమానం రావొచ్చు. ఈ వీడియో చూస్తే మీ అనుమానాలన్నీ నిమిషంలో పటాపంచెలయిపోతాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. లెక్కకు మించిన వ్యూవ్స్ పొందిన ఈ వీడియోను లక్షల సంఖ్యలో లైక్స్ చేశారు.

Man Turns Plane Into a Luxurious Villa

నిజానికి ఓ పాడుబడిన బోయింగ్ 737 విమానాన్ని రష్యాకు చెందిన ఫెలిక్స్ డెమిన్ అనే వ్యక్తి తనకు నచ్చినట్లుగా.. తన క్రియేటివిటీ మొత్తం యూస్ చేసి విల్లాగా మార్చేశాడు. ఇందులో రెండు బెడ్ రూమ్స్.. వాష్ రూమ్, డైనింగ్ రూమ్ వంటి వాటితో స్విమ్మింగ్ పూల్ వంటివి కూడా నిర్మించుకున్నాడు. ఇందులో కారిడార్ వంటి ప్రదేశం కూడా ఉండటం చూడవచ్చు.

విమానం విల్లా లోపలి వెళ్ళడానికి మెట్లు కూడా ఉన్నాయి. వీడియో ప్రారంభం నుంచి మీరు గమనించినట్లయితే.. డెమిన్ ఆ విమానం విల్లాలో మొత్తం తిరుగుతూ వాటిని గురించి వివరించడం మరియు చూపించడం వంటివి చూడవచ్చు. ఈ ఫ్లైట్ విల్లా బాలిలోని న్యాంగ్ న్యాంగ్ బీచ్ సమీపంలో ఉన్నట్లు సమాచారం. నిజంగా ఈ విల్లా డెమిన్ యొక్క అద్భుతమైన సృష్టి అనే చెప్పాలి.

Man Turns Plane Into a Luxurious Villa

ఆనంద్ మహీంద్రా ట్వీట్..

డెమిన్ సృష్టించిన ఈ అద్భుతమైన విమానం విల్లాను 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) షేర్ చేస్తూ.. కొంత మందికి మాత్రమే తమ కలలను నిజం చేసుకునే అవకాశం, అదృష్టం ఉంటుంది. అయితే ఈ విమానం విల్లా రూపొందించుకున్న వ్యక్తి మాత్రం తన కలలకు పరిమితులను విధించుకున్నట్లు అనిపించడంతో లేదు. నాకు ఇక్కడ బస చేయడానికి ఆసక్తి కలుగుతుందో లేదా వేచి చూడాలి అంటూ ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు.

నిజానికి బోయింగ్ విమానాలు పరిమాణంలో చాలా పెద్దవిగా ఉంటాయి, కాబట్టి ఇలాంటి అద్భుతాలు క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గతంలో విమానం హోటల్స్ వంటి వాటిని గురించి తెలుసుకున్నాం.. అయితే ఇది బహుశా మొదటి విమానం విల్లా అయి ఉంటుందని భావిస్తున్నాము. ఇలాంటి అద్భుతాలను మనిషి క్రియేట్ చేస్తున్నప్పుడే.. క్రియేటివిటీ మనిషిలో ఉందని మళ్ళీ మళ్ళీ రుజువవుతూ ఉంటుంది.

ఆనంద్ మహీంద్రా ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు షేర్ చేయడం ఇదే మొదటిసారి కాదు. దాదాపు ప్రతి రోజూ ఏదో ఒక ఆసక్తికరమైన విషాన్ని ఎక్స్ ఖాతా నుంచి షేర్ చేస్తూ.. ఒక్కోసారి నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఓ పిల్లవాడు 700 రూపాయలకు థార్ వస్తుందన్న వీడియోకు రిప్లై ఇచ్చారు. ఆ పిల్లాడికి కంపెనీని సందర్శించే అవకాశం కూడా కల్పించారు.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Monday, February 19, 2024, 16:16 [IST]
English summary
Man converts boeing 737 plane into luxury villa video viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+