నట్టింట్లో వైరల్; తిరుమలలో కనిపించిన ఆవు పేడ పూసిన కార్

మనం నిరంతరం సోషల్ మీడియాలో కొన్ని చిత్ర విచిత్రమైన సంఘటనలు చూస్తూ ఉంటాము. కొంతమంది ప్రజలు కొంత విచిత్రంగా అలోచించి వాటిని అమలుచేస్తూ అందిరిదృష్టిని ఆకర్షిస్తారు. కొంతమంది చేసే పనులు వారికి ప్రశంసలు తెచ్చిపెడితే, మరి కొంతమంది చేసేపనులు వారిని నవ్వుల పాలుచేస్తాయి. ఇదివరకే మనం కొన్ని అద్భుతమైన సంఘటనలు, విచిత్రమైన విశేషాలను గురించి తెలుసుకుని ఉంటాము. అయితే ఇప్పుడు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి వచ్చిన ఆలోచన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

నట్టింట్లో వైరల్; తిరుమలలో కనిపించిన ఆవు పేడ పూసిన కార్

నివేదికల ప్రకారం కర్ణాటకకు చెందిన ఒక వ్యక్తి తన కారుకి ఆవు పేడ మరియు బంకమట్టి కలిపిన మిశ్రమాన్ని మిర్రర్స్ మరియు లైట్స్ కి తప్పా మొత్తానికి కవర్ చేసాడు. ఈ కారుతోనే తిరుమల వెంకన్న సన్నిధికి చేరుకున్నాడు. ఈ కారు తిరుమలలోని నందకం సమీపంలో పార్క్ చేసాడు.

నట్టింట్లో వైరల్; తిరుమలలో కనిపించిన ఆవు పేడ పూసిన కార్

తిరుమల కొండపై కనిపించిన ఈ కారు చాలామంది ప్రజల దృష్టిని ఆకర్షించింది. దీనిని చూసిన చాలామంది ప్రజలు ఆ కారు పోటీలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ కారణంగా ఈ కారు ఫోటోలు అమాంతం వైరల్ అవుతోంది.

MOST READ:సైకిల్‌ ప్రయాణంలో గిన్నిస్ బుక్ రికార్డ్; కేవలం 8 రోజుల్లో కాశ్మీర్ To కన్యాకుమారి చేరిన యువకుడు

నట్టింట్లో వైరల్; తిరుమలలో కనిపించిన ఆవు పేడ పూసిన కార్

ఆ కారు యజమానిని ఎందుకు ఈవిధంగా చేసావని అడిగినప్పుడు, ప్రస్తుతం అధికంగా ఉన్న ఎండా తీవ్రతను తట్టుకోవడానికి మరియు కారులో చల్లదనం కోసం ఈ విధంగా చేసినట్లు చెప్పాడు. దీనిపై చాలామంది తీవ్రంగా విమర్శించారు. కొంతమంది సెటైర్లు కూడా వేస్తున్నారు.

నట్టింట్లో వైరల్; తిరుమలలో కనిపించిన ఆవు పేడ పూసిన కార్

అయితే కొంతమంది మాత్రమే యితడు చేసిన పనిని సమర్థిస్తున్నారు. ఎందుకంటే ఆవు హిందువులకు పూజ్యనీయం, కావున ఆవు పేడలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. కావున ఈవిధంగా చేయడం తప్పుకాదని, అతనిని ప్రశంసించారు.

MOST READ:గుండె తరుక్కుపోయే వీడియో.. ముందు బాక్స్‌లో పాప, వెనుక డెలివరీ మెటీరియల్

నట్టింట్లో వైరల్; తిరుమలలో కనిపించిన ఆవు పేడ పూసిన కార్

ఆవుపేడ ఎంత శాస్త్రీయమయినప్పటికి అది కారుకి తుప్పుపట్టేలా చేస్తుందని, కావున ఈ విధంగా చేస్తే కారు తొందరగా దెబ్బతినే అవకాశం ఉంటుందని కొంతమంది చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికి ఈ కారుకి ఆవు పేడ బంకమట్టి మిశ్రమం పూయడం వల్ల చాలా బిన్నంగా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది.

నట్టింట్లో వైరల్; తిరుమలలో కనిపించిన ఆవు పేడ పూసిన కార్

దీనిని బట్టి చూస్తే నింజంగా మనుసులనుకున్న కళాపోషణ అంతా, ఇంతా కాదండోయ్ బాబు, అని తప్పకుండా అనిపిస్తుంది. కానీ ఆ వ్యక్తి చేసిన చేసిన ఈ పనికి తన కారు సోషల్ మీడియాలో బాగా ఫెమస్ అయిపోయింది. ఈ కారుపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

కార్లకు ఆవుపేడ కోటింగ్ ఇవ్వడం ఇదే సారికాదు, ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు కూడా వెలుగులోకి వచ్చాయి, సంభందించిన ఫోటోలు పైన చూడవచ్చు.

MOST READ:గిఫ్ట్‌గా పొందిన కారుని గురువుకి గిఫ్ట్‌గా ఇచ్చిన ఇండియన్ క్రికెటర్, ఎవరో తెలుసా?

Source: Samayam

Most Read Articles

English summary
Man Covers Car In Cow Dung To Avoid Heat. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X