భార్య కోసం భర్త సాహసం.. తప్పో, ఒప్పో మీరే చెప్పాలి (వీడియో)

ఎడతెరిపిలేని వర్షాల కారణంగా ఉత్తర భ్రాతదేశంలో ఢిల్లీ, ముంబై ప్రాంతాలు.. దక్షిణ భారతదేశంలో కేరళ, గోవా మొదలైన ప్రాంతాలలోని జనం చాలా ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. దీనికి సంబంధించిన చాలా విషయాలు పలు మీడియా సంస్థలు చూపిస్తూనే ఉన్నాయి. అధిక వర్షాల వల్ల నదులు కూడా పొంగి పొర్లుతున్నాయి. ఈ తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ కేరళలో ఓ వ్యక్తి మాత్రం పొంగి ప్రవహించే నదిని కారుతో దాటేసారు. ఇంతకీ ఇంతటి సాహసానికి కారణం ఏమిటి? దీనికి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

ఒక యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అయిన వీడియోలో గమనిస్తే.. మారుతి ఆల్టో కారు ప్రవహిస్తున్న నదికి అడ్డంగా నిమించిన బ్రిడ్జి మీద దాటడం చూడవచ్చు. ఇది చూడటానికి కొంత భయానకంగా అనిపిస్తుంది, కానీ గర్భవతి అయిన తన భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లడంలో భాగంగా ఓ వ్యక్తి ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. నిజానికి ఇది చాలా ప్రమాదం. అయితే పరిస్థితుల దృష్ట్యా ఆ వ్యక్తి చేసిన పనిని తప్పుగా భావించలేము.

Man Crosses Flooded Kerala Bridge

ఉదృతంగా ప్రవహిస్తున్న నదికి అడ్డంగా నిర్మించిన వంతెన మీద కారు ముందుకు సాగిపోతుంది. ఆ బ్రిడ్జికి రెయిలింగ్ వంటివి కూడా లేకపోవడం గమనార్హం. అలంటి బ్రిడ్జి మీద కారు దాటడం చట్టరీత్యా నేరమే అయినప్పటికీ.. మానవతా దృక్పథంతో ఆలోచిస్తే మాత్రం భార్య కోసం భర్త చేసిన సాహసం అని స్పష్టమవుతోంది. అయితే ఈ ఘటనలో ఎవరికీ హాని జరగలేదు.

నిజానికి మారుతి ఆల్టో అనేది ఇతర వాహనాలతో పోలిస్తే తేలికైన వాహనం, కాబట్టి నదీ ప్రవాహంలో కొట్టుకుపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రవాహ వేగంగా భారీ వాహనలే కొట్టుకుపోయిన సందర్భాలు చాలానే వెలుగులోకి వచ్చాయి. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే ఇలాంటి సాహసాలు చేయకుండా ఉండటమే ఉత్తమం. ఎందుకంటే అనుకోని ప్రమాదం ఎదురైతే.. కారుతోపాటు మనుషులు కూడా కొట్టుకుపోతారు.

Man Crosses Flooded Kerala Bridge

గతంలో కొన్ని సందర్భాల్లో వెలుగులోకి వచ్చిన కొన్ని వీడియోలలో ఆకతాయిలు కొన్ని స్టంట్స్ చేస్తూ ప్రమాదంలో చిక్కుకున్న ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. కొన్ని సార్లు ఇలాంటి ప్రమాదాల్లో ప్రాణాలై కోల్పోయిన సందర్భాలు లేకుండా పోలేదు. కాబట్టి నీటి ఎద్దడి లేదా ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు సాహసం చేయకపోవడమే అత్యుత్తమం. ఇది ప్రాణాలను రక్షిస్తుంది. ఈ విషయాన్ని వాహనదారులు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిందే.

ఇక మారుతి ఆల్టో విషయానికి వస్తే.. భారతదేశంలో ఒకప్పటి నుంచి ఎంతోమంది వాహన ప్రియులను ఆకట్టుకున్న ఈ కారు మంచి అమ్మకాలను సాధించింది. తక్కువ ధర వద్ద లభించే ఈ కారు ఆకర్షణీయమైన, సింపుల్ డిజైన్.. వాహన వినియోగదారులకు కావాల్సిన ఫీచర్స్ పొందుతుంది. అంతే కాకుండా పర్ఫామెన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి రోజువారీ వినియోగానికి ఇది అత్యుత్తమ ఎంపికగా చాలామంది దీన్ని కొనుగోలు చేస్తుంటారు.

నదీ ప్రవాహాలను ఎట్టి పరిస్థితులు దాటకూడదు. ఎందుకంటే ప్రమాదం ఏ రూపంలో వస్తుందో తెలియదు. కాబట్టి కొందరు నిపుణులు ఆఫ్ రోడింగ్ వాహనాలను లేదా 4x4 వాహనాలను సైతం వరదల సమయంలో, ప్రవహించే నదులను దాటవద్దని సలహా ఇస్తారు. అలాంటిది తేలికగా ఉన్న మారుతి ఆల్టో ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్ళకూడదు. ప్రవాహాల్లో ప్రయాణిస్తే కారు ఇంజిన్‌కు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కారు పనికిరాకుండాపోవచ్చు కూడా.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Friday, August 2, 2024, 12:00 [IST]
English summary
Man crosses flooded kerala bridge in maruti alto car
Read more on: #off beat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+