లాక్‌డౌన్ లో 1800 కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణించి ఇంటికి చేరుకున్న యువకుడు

కరోనా వైరస్ సంక్రమణ ఎక్కువగా వ్యాప్తి చెందకుండా ఉండటానికి భారతదేశం మొత్తం మార్చి 25 నుండి 21 రోజుల వరకు లాక్‌డౌన్ అమలు చేయబడింది. ఈ లాక్ డౌన్ దేశ ప్రజల ప్రయోజనాల కోసం మరియు వారి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అమలు చేయబడింది.

లాక్‌డౌన్ లో 1800 కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణించి ఇంటికి చేరుకున్న యువకుడు

భారతదేశంలో లాక్‌డౌన్ ప్రకటించడం వల్ల జీవనోపాధి కోసం ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి వలస వచ్చిన వారు చాలా మంది ఎక్కడికక్కడ నిర్బంధంలో ఉండిపోయారు. అకస్మాత్తుగా లాక్‌డౌన్ ప్రకటించడం వల్ల వారు తమ ఇంటికి కూడా తిరిగి రాలేని పరిస్థితి ఏర్పడింది.

లాక్‌డౌన్ లో 1800 కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణించి ఇంటికి చేరుకున్న యువకుడు

ఈ లాక్‌డౌన్ సమయంలో వేరే ప్రాంతంలో చిక్కుకున్న తన కొడుకును తీసుకెళ్లడానికి హైదరాబాదీ మహిళ 1,400 కిలోమీటర్ల దూరం స్కూటర్‌లో ప్రయాణించినట్లు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి.

MOST READ: సుజుకి బర్గ్‌మన్ 200 స్కూటర్ : ధర & ఇతర వివరాలు

లాక్‌డౌన్ లో 1800 కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణించి ఇంటికి చేరుకున్న యువకుడు

ఇలాంటి మరో కేసు ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత 24 ఏళ్ల వ్యక్తి సైకిల్‌పై తన స్వగ్రామానికి చేరుకున్నాడు.

లాక్‌డౌన్ లో 1800 కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణించి ఇంటికి చేరుకున్న యువకుడు

ఈ యువకుడు ముంబైకి 1,800 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడిశాలోని జాజాపూర్ జిల్లాకు ప్రయాణించాడు. నివేదికల ప్రకారం మహేష్ జేనా అనే ఓ యువకుడు జాజాపూర్ జిల్లాలోని బాదసూర్ గ్రామానికి చెందినవాడు.

MOST READ: హ్యాండ్ శానిటైసర్ల ఉత్పత్తిని ప్రారంభించిన మహీంద్రా

లాక్‌డౌన్ లో 1800 కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణించి ఇంటికి చేరుకున్న యువకుడు

సాధారణంగా ఆ యువకుడు పని కోసం తన గ్రామం నుండి ముంబైకి వచ్చాడు. ముంబైలో ఇల్లు కట్టే పని చేసేవాడు. భారత్ మొత్తం లాక్‌డౌన్ ప్రకటించడం వల్ల ముంబైలో కూడా లాక్‌డౌన్ అమలు చేయబడింది.

లాక్‌డౌన్ లో 1800 కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణించి ఇంటికి చేరుకున్న యువకుడు

ఈ 24 ఏళ్ల యువకుడికి పెద్దగా డబ్బు లేదు. ఈ కారణంగా అతను ముంబైలో నివసించిన ఇంటి అద్దె చెల్లించలేకపోయాడు. ఆర్థిక సమస్యల కారణంగా, మహేష్ ఏప్రిల్ 2 న తిరిగి తన గ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. రైలు, బస్సులు లేనందున మహేష్ తన సైకిల్‌తో ప్రయాణం ప్రారంభించాడు.

MOST READ: తన మొదటి కారు జ్ఞాపకాలు గురించి చెప్పిన సినీ డైరెక్టర్, ఎవరో తెలుసా..?

లాక్‌డౌన్ లో 1800 కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణించి ఇంటికి చేరుకున్న యువకుడు

తన ప్రయాణాల్లో మహేష్ ప్రతిరోజూ సుమారు 10 నుంచి 12 గంటలు సైక్లింగ్ చేశాడు మరియు రోజుకు 230 కిలోమీటర్లు ప్రయాణించాడు. పోలీసులు, స్థానికులు తనకు సహాయం చేశారని మహేష్ చెప్పారు. మహేష్ ఏప్రిల్ 9 న తన ఇంటికి చేరుకున్నారు.

Source: IndiaTimes

Most Read Articles

English summary
Man cycles 1800km from Mumbai to Odisha during lockdown. Read in Telugu.
Story first published: Tuesday, April 14, 2020, 10:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X