రీల్స్‌ పిచ్చి.. కారు సన్‌రూఫ్‌ లోంచి గన్ కాల్చినట్టు పోజిచ్చాడు.. భారీ మొత్తంలో ఫైన్‌ కట్టాడు!

మనలో చాలా మందికి కార్లలో సన్‌రూఫ్ వల్ల ఉపయోగాలు తెలియవు. అయినా కానీ ఈ ఫీచర్‌తో వచ్చే కార్లను వాడటం మనం చూస్తూనే ఉంటాం. అయితే కొందరు ఈ సన్‌రూఫ్‌ని వివాదాస్పద రీతిలో ఉపయోగిస్తున్నారు. తాజాగా చెన్నైలో జరిగిన సంఘటనే దానికి చక్కటి ఉదాహరణ. ఓ జంట సన్‌రూఫ్‌ లోంచి బయట ఉండి మద్యం సేవిస్తూ కెమెరాకు చిక్కారు. ఈ వీడియో ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు సంజయ్ అనే 23 ఏళ్ల లా స్టూడెంట్, అతని ప్రియురాలు వీణను ‌అదుపులోకి తీసుకున్నారు. సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యేందుకు ఈ విధంగా చేసినట్లు వారు అంగీకరించారు. అయితే ఇలాంటి సంఘటలు దేశవ్యాప్తంగా పెరుగుతుండటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

రోడ్లపై సన్‌రూఫ్‌ లోంచి ప్రమాదకర రీతిలో ప్రయాణిస్తున్నారు. ఇది వారికి కాకుండా ఇతరుల ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. దీంతో క్షణాల్లో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎక్కువగా మద్యం మత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి స్టంట్స్‌ చేసే వారికి కఠినమైన శిక్షలు విధిస్తున్న జనాల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఈ కథనంలో..

Man-Stunts-On-Sunroof

తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఓ వ్యక్తి సన్‌రూఫ్ నుంచి బయటకు వచ్చి చేసిన స్టంట్స్‌ చేసిన విజువల్స్‌ అక్కడి వారిని ఆశ్చర్యానికి గురిచేశాయి. మహీంద్రా ఎక్స్‌యూవీ500 నుంచి ఓ ఓనర్‌ సన్‌రూఫ్ లోంచి బయటకు వచ్చి తుపాకీతో పోజులిచ్చాడు. అతను ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్ కోసం ఇలా చేశాడని తెలిసింది. మరో తోటి వాహనదారుడు ఈ పూర్తి చర్యను తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు.

ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వీడియో వైరల్ కావడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. పోలీసులు అతను ప్రయాణిస్తున్న కారు, తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. అలా చేయడం ట్రాఫిక్‌ రూల్స్‌కి విరుద్ధం కావడంతో అతను వ్యవహరించిన తీరుకి రూ. 30 వేల జరిమానా కూడా విధించారు. ఈ ఘటన యూపీలో చోటుచేసుకోగా ఆ కారు ఢిల్లీ రిజిస్ట్రేషన్ నెంబర్‌తో ఉంది.

కదులుతున్న కారు పైకప్పు నుంచి బయటకు రావడం, తుపాకీ చూపడం సహా పలు కారణాలతో ఆయనపై కేసులు నమోదయ్యాయి. కదులుతున్న వాహనంలో ఇలాంటి స్టంట్స్‌ చేయడం చాలా ప్రమాదకరం. అనుకోకుండా అది ఫైర్‌ అయితే తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి చర్యల్లో ఎక్కువగా అమాయకులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అందువల్ల పోలీసులు దీనిని సీరియస్‌గా తీసుకున్నారు.

అంతే కాకుండా ఆ స్టంట్స్‌ చేసే సమయంలో రోడ్డుపై ట్రాఫిక్‌ని మనం చూడవచ్చు. ఈ చర్య వల్ల కొద్దిలో ప్రమాదం తప్పినట్లు అయ్యింది. అలాంటి ప్రమాదకరమైన తుపాకీతో రీల్స్ గేమ్‌లా పోజులిచ్చాడు ఆ వ్యక్తి. అది లైసెన్స్ డ్ తుపాకీ అయినా అనవసరంగా బహిరంగంగా బయటకు తీయకూడదు. ఇది ఇతరులను భయానికి గురిచేయవచ్చు అందుకే ఈ చర్యను తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు.

ఇలాంటి నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవడం ఒక్కటే మార్గం. లేదంటే జనాలు వీటిని అనుసరించే అవకాశం ఉంటుంది. సన్‌రూఫ్ ముఖ్యంగా కారులో గాలి వచ్చేందుకు ఉద్దేశించినవి. నేడు ఎక్కువగా వాహన తయారీ సంస్థలు దీన్ని ఆఫర్ చేస్తున్నాయి. అయితే చాలా మంది వీటి ఉపయోగాన్ని అర్థం చేసుకోవడం లేదు. ఫలితంగా ఇలాంటి చర్యలు పెరిగిపోతున్నాయి.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, August 10, 2024, 12:56 [IST]
English summary
Man dangerous stunts from sunroof by showing gun police arrested
Read more on: #off beat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+