రన్నింగ్‌ కారు డోర్‌ తీసి పైకి ఎక్కిన వ్యక్తి.. వీడియో చూస్తే షాక్‌ అవ్వకుండా ఉండలేరు

దేశంలో రోడ్లపై విన్యాసాలు చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. దీనివల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలగడమే కాకుండా భారీ ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు పోలీసులు తగు చర్యలు చేపడుతున్న కొంతమంది ఆకతాయిలు వాటిని పాటించడం చేయడం లేదు. కొంతమంది ఆకతాయిలు రోడ్లపై బైక్‌లతో స్టంట్స్ చేయడం అలాగే కార్ల సన్‌రూఫ్‌పై నిల్చుని హల్‌చల్‌ చేసిన వీడియోలు ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీతో పాటు సీసీటీవీలు, సెల్‌ఫోన్‌ల చిత్రీకరణ ఆధారంగా ఆ వీడియోలన్నీ ప్రస్తుతం మనకు దర్శనమిస్తున్నాయి.

మద్యం మత్తులో ఇంకా కొందరు మితిమీరి పోతున్నారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో కొన్ని ప్రమాదాలు మత్తు ప్రభావంతోనే జరుగుతున్నాయి. మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల అమాయకపు ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ టేకింగ్, ప్రధాన రహదారులపై రేసింగ్ వంటి వాటి వల్ల ఇతరులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Stunts-On-Running-Car

మరికొందరు యాక్సిడెంట్స్ జరిగినా స్పందించకుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఇప్పటికి అంతుచిక్కని సమస్యగానే ఉంది. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు ప్రధాన కూడళ్లు, హైవేలల్లో సీసీటీవీలు ఏర్పాటు చేసిన ఈ పద్ధతిని జనాలు మార్చుకోవడం లేదు. ఈ విధానాలకు స్వస్తి చెప్పేందుకు పోలీసులు రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సులు సైతం నిర్వహిస్తున్నారు. అయినా కానీ పరిస్థితి అదుపులోకి రావడం లేదు.

ఇంకొంత మంది యాక్సిడెంట్‌కి కారణం అవ్వడమే కాకుండా పలుకుబడితో కేసులను తారుమారు చేస్తున్నారు. ప్రమాద కారకులపై కఠిన శిక్షలు వేసినా వారు తప్పించుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఏది చేసినా క్షణాల్లో వైరల్‌ అవుతుంది. దీని వల్ల ఫేమస్‌ అవ్వాలని కొంతమంది వినూత్న పద్ధతిని అనుసరిస్తున్నారు. అందులో కొందరు రోడ్లపై స్టంట్స్‌ చేస్తూ ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేస్తున్నారు.

Man-Stunts-On-Running-Car

పాపులారిటీ కోసం రోడ్లపై విన్యాసాలు చేస్తూ రోడ్డు భద్రత నియమాలను తుంగలో తొక్కుతున్నారు. ప్రస్తుతం దేశంలో ఇలాంటి వీడియోలు లక్షల సంఖ్యలో బయటికి వస్తున్నాయి. రోజు రోజుకు ఈ సంఖ్య పెరుగుతుంది. తాజాగా ఓ వ్యక్తి రన్నింగ్ కారులో నుంచి బయటకు రావడమే కాకుండా కారుపైకి ఎక్కి విన్యాసాలు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది.

ప్రధాన రహదారిపై కారు కదులుతూ ఉండగా డోర్ తీసుకొని బయటికి వచ్చి పైకి ఎక్కి అభివాదం చేసిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. భయానక విన్యాసాలు చేస్తూ ఇతర ప్రయాణికులు బెంబేలెత్తిపోయేలా చేశాడు. వెనకాలే కారుని ఫాలో అవుతున్న కొందరు వ్యక్తులు వాటిని తమ కెమెరాల్లో ఈ స్టంట్స్‌ని చిత్రీకరించారు. వీడియో ప్రకారం రాజస్థాన్‌లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అతడు కావాలనే స్టంట్స్‌ వేస్తూ ఇతర వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. వీడియోలో అది రద్దీగా ఉండే రహదారిగా కనపించింది. కారు నంబర్‌ ఆధారంగా అతడిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు. ఇలాంటి స్టంట్స్‌ని ఎవరైన రిపీట్‌ చేస్తే కఠిన చర్యలు ఉండేలా శిక్ష విధించాలని మండిపడ్డారు. రెప్పపాటులో ఏదైనా జరిగే ప్రమాదం ఉంటుందని ఇలా చేయడం సమంజసం కాదని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, May 29, 2024, 16:21 [IST]
English summary
Man did stunts on running car visuals gone viral
Read more on: #off beat #road safety #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+