కారులో ఏసీ ఆన్‌ చేసి పడుకున్నాడు.. తెల్లారేసరికి శవమయ్యాడు

ఓ వ్యక్తి మద్యం మత్తులో కారులో ఏసీ పెట్టుకుని నిద్రపోయాడు. అయితే దురదృష్టశావత్తూ ఆ వ్యక్తి నిద్రపోయాడు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. కారులో ఏసీ పెట్టి నిద్రలోకి జారుకున్న డ్రైవర్ ఎలా చనిపోయాడనే దానిపై పలు ప్రశ్నలకు తావిస్తోంది. అతడు చనిపోవడానికి ఓ కారణం ఉంది. అందేంటి.. కారు ఏసీ ఆన్‌ చేసి నిద్రపోతే చనిపోతారా అనే డౌట్‌ మీలో కూడా రావచ్చు. అసలు అది ఎలా జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో వివరించబోతున్నాం..

ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్‌కి చెందిన కల్లు దూబే అనే 36 ఏళ్ల వ్యక్తి ఓ ప్రైవేట్ ట్రావెల్ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రాత్రి చివరి ట్రిప్ పూర్తి చేసుకున్న తర్వాత డ్రైవర్ తన కారులో ఇంటికి వెళ్లి మరుసటి రోజు ఉదయం కారు తీసుకుని డ్యూటీకి వెళ్లాలి. ఇలానే మూడేళ్లుగా ఇదే డ్యూటీ చేస్తున్నాడు. కారు యజమాని ఓ యాప్ ద్వారా కారుకి సంబంధించి పూర్తి సమాచారం అందుతుంది.

Man-Died-In-Car-Uttarpradesh

అయితే ఆదివారం 16-06-2024న దూబే తన పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా సమీపంలోని మద్యం దుకాణానికి వెళ్లి మద్యం సేవించాడు. మద్యం మత్తులో ఉన్న దూబే మద్యం దుకాణం సమీపంలో కారు ఆపి కారు అద్దాలన్నీ మూసివేసి ఏసీ ఆన్ చేసి నిద్రలోకి జారుకున్నాడు. మరుసటి రోజు ఉదయం ట్రావెల్స్ యజమాని తన మొబైల్ యాప్‌లో కారు మూవ్‌మెంట్స్‌ చెక్‌ చేయగా అతను ఆశ్చర్యపోయాడు.

అప్పటి వరకు దూబే డ్యూటీకి వెళ్లలేదు. ట్రావెల్ కంపెనీ యజమాని వెంటనే దూబేకు ఫోన్ చేయగా అతను ఫోన్ ఎత్తకపోవడంతో కారు జీపీఎస్ ఉపయోగించి అక్కడికి వెళ్లాడు. కారును మద్యం దుకాణం దగ్గర పార్క్ చేసి లోపల దూబే నిద్రపోతున్నట్లు కనిపించాడు. కారు యజమాని అతన్ని బయటకు రప్పించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా బయటకు తీయలేక పోయాడు.

Man-Died-In-Car-Uttarpradesh

కారు యజమానికి అనుమానం వచ్చి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కి సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే కారు అద్దాలు పగులగొట్టారు. తీవ్ర ఇబ్బందిలో ఉన్నాడని గ్రహించి దూబేని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే దూబే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో వారు ఒక్కసారిగా అవాక్కయ్యారు. పూర్తి వివరాలు రాబట్టేందుకు దూబే మృతదేహాన్ని పోస్టుమార్టం రిపోర్టులో కీలక విషయాలు వెల్లడయ్యాయి.

ఇది కల్పితమా లేగా యాధృచ్చికమా అనే దానిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. అయితే మద్యం సేవించి కారులో పడుకున్న దూబే ఏసీ ఆన్ చేసి నిద్రపోయినట్లు విచారణలో తేలింది. మారుతి వ్యాగన్ఆర్ సీఎన్‌జీ ఆప్షన్‌తో ఉన్న కారుని దూబే నడుపుతున్నాడు. ఇది పెట్రోల్‌ ఆప్షన్‌తో కూడా ఉంది. అయితే దూబే ఏసీ ఆన్ చేసి నిద్ర‌లోకి జారుకున్నాడు. దీంతో పెట్రోల్ అయిపోవడంతో ఏసీ పేలిపోయింది.

Car-Ac-Issues

దూబే కారు కిటికీ అద్దాలు పూర్తిగా పెట్టుకున్నాడు. గాఢ నిద్రలోకి జారుకోవడంతో ఆక్సిజన్ స్థాయి తగ్గి కార్బన్ మోనాక్సైడ్ స్థాయి పెరిగి దూబే చనిపోయినట్లు తేలింది. ఎక్కువ సేపు వెంటిలేషన్ లేకపోతే ఆ ప్రాంతం పూర్తిగా CO2తో నిండిపోతుంది. ఈ కార్బన్ మోనాక్సైడ్‌ని మానవులు ఎక్కువగా పీల్చినప్పుడు గుండెకు రక్త సరఫరా ఆగిపోతుంది. ఈ కేసులోనే అదే జరిగిందని వైద్యులు తెలిపారు.

ఏసీ ఆన్ చేసి విండోస్‌ పూర్తిగా పెట్టుకుని వాహనాల్లో పడుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇది పూర్తిగా తప్పు. కారు కిటికీలు పూర్తిగా పెట్టుకుంటే వెంటిలేషన్ లేకపోవడం వల్ల కారులో ఊపిరాడదు. దీంతో CO2 స్థాయిలు పెరుగుతాయి. ఇంకా ముఖ్యంగా మీ కారులోని ఏసీలో లోపం ఉంటే ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉంది. చాలా మంది వీటిని పట్టించుకోరు. క్రమం తప్పకుండా చెక్‌ చేస్తూ ఉండాలి.

More from DriveSpark

Article Published On: Wednesday, June 19, 2024, 15:52 [IST]
English summary
Man died in car uttar pradesh due to ac on he lost life incident detalis in telugu
Read more on: #off beat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+