తొలి బైక్ కొన్న తక్షణమే ప్రాణాలు వదిలిన వ్యక్తి

By Ravi

ఇదొక విచిత్ర విషాద గాధ. తన చిన్ననాటి కలను తీర్చుకునేందుకు 44 ఏళ్లు ఎదురు చూసి, అది నిజమైన కొద్ది క్షణాలకే ప్రాణాలు కోల్పోయాడు ఓ వ్యక్తి. అమెరికాలోని వైయోమింగ్‌కు చెందిన 59 ఏళ్ల బ్యారీ స్ట్ర్యాంగ్ తాను 15వ ఏటనే ఓ బైక్‌ను సొంతం చేసుకోవాలని కలగన్నాడు. ఆ తర్వాత కాలంతో పాటు అతనూ, అతని కల రెండూ అలానే పెరుగుతూ వచ్చాయి.

పెళ్లి చేసుకున్న తర్వాత బైక్ కొనాలన్న తన కోరికకు భార్య పామ్ అడ్డుపడింది. బైక్ నడపటంలో ఉండే ప్రమాదాన్ని తెలుసుకొని ఆమె బైక్ వద్దని బ్యారీ స్ట్ర్యాంగ్‌కు సలహా ఇచ్చింది. దీంతో అతను తన బైక్ కలని మరో 38 ఏళ్ల పాటు కలగానే ఉంచేసుకున్నాడు. బ్యారీ 59లోకి చేరుకోగానే తన భార్య అంగీకారంతో బైక్ కొనేందుకు, చిన్ననాటి కలను నెరవేర్చుకునేందుకు సిద్ధమయ్యాడు.

Man Dies Soon After Buying His First Bike

దీంతో వెంటనే హ్యార్లీ డేవిడ్‌సన్ షోరూమ్‌కు వెళ్లి 2013 హ్యార్లీ డేవిడ్‌సన్ డైనా మోడల్‌ను కొనుగోలు చేశాడు. డీలర్‌షిప్‌కు వెలుపల కొత్త బైక్‌తో తీసుకున్న ఫొటోను తన ఫేస్‌బుక్ పేజ్‌లో కూడా పోస్ట్ చేశాడు. ఈ ఫొటోకు "చివరకు 44 ఏళ్ల తర్వాత ఒకటి పొందాను" అనే క్యాప్షన్‌ను కూడా బ్యారీ పోస్ట్ చేశాడు. అయితే, అదృష్టం పక్కనే దురదృష్టం ఉన్నట్లు.. బ్యారీ తన కొత్త బైక్‌పై డీలర్‌షిప్ నుంచి కొన్ని మైళ్ల దూరం వెళ్లాడో లేదో పెద్ద యాక్సిడెంట్ జరిగింది.

అటుగా వెళ్తున్న ఓ ట్రాక్టర్‌ను బ్యారీ ఢీకొట్టాడు. దీంతో బ్యారీ జీవితం, చిన్న నాటి కల రెండూ ట్రాక్టర్ టైర్ల క్రింద నలిగిపోయాయి. బ్యారీ తీవ్ర గాయాలతో స్పాట్‌లోనే చనిపోయాడు. బైక్ నడపటంలో బ్యారీకి పెద్దగా అవగాహన లేకపోవటం వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటనపై ఆయన భార్య పామ్ స్పందిస్తూ.. తన జీవితాంతం చేయాలనుకుంటున్న దాన్ని ఇప్పుడు చేశాడని బాధపడింది. నాన్న తన ముఖంపై పెద్ద నవ్వుతో వెళ్లిపోయాడని బ్యారీ కుమారుడు విచారం వ్యక్తం చేశాడు.

More from DriveSpark

Article Published On: Friday, July 19, 2013, 17:39 [IST]
English summary
Wyoming resident Barry Strang waited 44 years to buy a bike. Barry Strang bough a Harley Davidson Dyna but died only after riding it for 3 miles. Barry Strang, a 59 year old resident of Wyoming, USA harboured a desire to own a bike since he was 15 years old. Later, when he got married his wife Pam objected to his idea of owning one because of the dangers involved. He complied and thus held onto his dreams for another 38 years.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+