Just In
Don't Miss
- News
హై అలర్ట్.. పంజాబ్, హర్యానా, కొన్ని జిల్లాల్లో మొబైల్ సేవల్ బంద్..
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Movies
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నిండు ప్రాణం తీసిన గూగుల్ మ్యాప్.. ఎలా అనుకుంటున్నారా, అయితే ఇది చూడండి
టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందటం వల్ల, ప్రజలు ఎక్కడైనా కొత్త ప్రదేశాలకు వెళ్లాలనుకున్నప్పుడు గూగుల్ మ్యాప్స్ ఉపయోగిస్తుంటారు. ఈ గూగుల్ మ్యాప్స్ కొన్ని సార్లు గమ్యస్థానానికి చేర్చినప్పటికీ, కొన్ని సార్లు మాత్రం అనుకోని ప్రమాదాలు తెచ్చిపెడుతుంది.
ఇటీవల కాలంలో ఒక కార్ డ్రైవర్ గూగుల్ మ్యాప్స్ వల్ల దారి తప్పిపోయి అడవిలోకి వెళ్లడం జరిగింది. ఈ కారణంగా అతడు ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఆశ్రయించడం వల్ల ఏకంగా ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూద్దాం.. రండి.

ఇటీవల మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ లో ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. నివేదికల ప్రకారం కారులో ఇద్దరు వ్యక్తులు పూణే నుండి అహ్మద్‌నగర్‌కు ట్రెక్కింగ్ కోసం వెళ్లారు. కల్సుబాయికి వెళ్ళవలసి వచ్చినప్పుడు, గూగుల్ మ్యాప్‌ను ఆశ్రయించారు. గూగుల్ మ్యాప్ ద్వారా, ఒక బ్రిడ్జ్ దగ్గరికి చేరుకున్నాడు. అయితే అక్కడ నీరు చూసిన తర్వాత డ్రైవర్ కారును ఆపాడు. కాని మ్యాప్‌లో, నీటి మధ్య ఒక చిన్న బ్రిడ్జ్ ఉన్నట్లు తెలిసింది.

ఆ సమయంలో చాలా రాత్రి మరియు ఎక్కువ చీకటి కావడం వల్ల డ్రైవర్ పెద్దగా ఆలోచించకుండా, గూగుల్ మ్యాప్‌లో చూపిన మార్గంలో కారును కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. డ్రైవర్ ఏమాత్రం ఆలోచించకుండా కారును ముందుకు నడిపించడంతో, కారు నీటిలో మునిగిపోవడం ప్రారంభమైంది.
MOST READ:ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్ డెలివరీ చేసుకున్న ఎలోన్ మస్క్ ; వివరాలు

కారు మునిగిపోవడం ప్రారంభించడంతో డ్రైవర్ పక్కన కూర్చున్న వ్యక్తి కారులోంచి బయటకు వచ్చి ఈత కొట్టుకుంటూ బయటపడి ప్రాణాలను కాపాడుకున్నాడు. అయితే కారు నడుపుతున్న డ్రైవర్ ఈత కొట్టలేక కారులో చిక్కుకుని మునిగి చనిపోయాడు.

ఈ విషయం గురించి సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు, కారు కదులుతున్న మార్గం, అక్కడ ఒక చిన్న వంతెన ఉంది, ఇది దాదాపు నాలుగు నెలలుగా నీటిలో మునిగిపోయింది. అయితే గూగుల్ మ్యాప్‌లో వంతెన మునిగిపోవడం గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.
MOST READ:22 ఏళ్ల పాత డేవూ మాటిజ్ కారును ఎక్స్‌కావేటర్‌గా మార్చిన ఇస్రో ఇంజనీర్

సంవత్సరానికి 3 నుంచి 4 నెలలు నీరు పెరగడం వల్ల ఆనకట్టపై వంతెన మునిగిపోతుందని స్థానిక ప్రజలు తెలిపారు. స్థానిక ప్రజలకు ఈ బ్రిడ్జ్ గురించి పూర్తిగా తెలుసు కావున ఎవరూ ఆ బ్రిడ్జ్ దారి వైపు వెళ్ళరు. కారులో వచ్చిన వ్యక్తులు ఆప్రదేశానికి కొత్త కావడం వల్ల ఇంత పెద్ద ప్రమాదం సంభవించింది.

ప్రమాదంలో నదిలో మునిగిపోయిన కారుని మరియు మృతదేహాన్ని మరుసటి రోజు ఉదయం బయటికి తీశారు. ఏది ఏమైనా వాహనదారులు కొత్త ప్రదేశాలకు వెళ్లాలనుకున్నప్పుడు, స్థానికి ప్రజల సహాయం తీసుకోవడం మంచిది. అప్పుడే ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.
MOST READ:లోయలో పడిన లారీని బయటకు లాగేందుకు ఏకమైన ఊరు వాడ..

గత సంవత్సరం కూడా గూగుల్ మ్యాప్ ఉపయోగించి, కొంతమంది రష్యన్ పౌరులు ఎడారి రహదారిపైకి వెళ్లారు, అక్కడ వారి కారు ప్రమాదానికి గురై, తీవ్రమైన చలి కారణంగా మరణించింది. కొన్నిసార్లు గూగుల్ మ్యాప్‌ను ఎటువంటి ఆలోచన లేకుండా ఉపయోగించడం హానికరం.

వాహనదారులు షార్ట్ కట్స్ దారులు వెతికే సాయంలో ఈ గూగుల్ మ్యాప్ ఉపయోగించి ప్రమాదపుటంచులకు చేరుకుని ఇబ్బందుల్లో చిక్కుకోవడమే కాకుండా ప్రాణాలను సైతం కోల్పోవాల్సి వస్తుంది. గూగుల్ మ్యాప్‌ను సరిగ్గా ఉపయోగించడం నేర్చుకుంటే, అప్పుడు కొంతవరకు ఇబ్బందులను నివారించవచ్చు.
MOST READ:రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రత్యర్థి 'హోండా హైనెస్ సిబి 350' ఫస్ట్ రైడ్ రివ్యూ ; వివరాలు

సుదీర్ఘ ప్రయాణానికి బయలుదేరే ముందు మనం మార్గాన్ని ముందుగానే తెలుసుకోవడం మంచిది. మార్గంలో కూడా హైవే లేదా ప్రధాన రహదారిని ఎల్లప్పుడూ ఎన్నుకోవాలి, ఎందుకంటే ప్రధాన రహదారుల సమాచారం ఎప్పటికప్పుడు గూగుల్ మ్యాప్‌లో అప్డేట్స్ చేయబడతాయి. కావున ప్రమాదాలు తగ్గుతాయి.

కొన్నిసార్లు ఇంటర్నెట్ సరిగ్గా పనిచేయకపోవడం మరియు సిగ్నల్ తక్కువగా ఉండటం కారణంగా, గూగుల్ మ్యాప్స్ సరిగా పనిచేయదు, అప్పుడు తప్పుడు మార్గాన్ని సూచిస్తాయి. ఈ పరిస్థితిలో రోడ్డుపై స్థానికుల సలహాలు తీసుకోవడం మంచిది. స్థానిక ప్రజలకు వారి చుట్టూ ఉన్న మార్గాల గురించి మంచి అవగాహన ఉంటుంది, కావున స్థానికుల సలహా తీసుకోవడం వల్ల తప్పుడు మార్గాల్లో వెల్లసిన అవసరం ఉండదు. ప్రమాదాలు జరిగే అవకాశాలు అసలే ఉండవు.