పార్కింగ్ కష్టాలు: కిరాణా స్టోర్‌లోకి కారుతో వెళ్లిన కస్టమర్!

Written By:

పార్కింగ్ స్పేస్ ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమ ఎదుర్కుంటున్న సమస్యలలో ఇదీ ఒకటి. కారు కొనాలనే మనసున్నా, పార్కింగ్ స్పేస్ లేదని ఆగిపోతున్న కస్టమర్లు చాలానే ఉన్నారు. పార్క్ స్పేస్ లభించకపోతే మనం పడే తంటాలు అన్నీ ఇన్నీ కావు. మచ్చుకు ఒకదానిని ఉదాహరణగా చూద్దాం రండి...

కిరాణా స్టోర్‌లోకి కారుతో వెళ్లిన కస్టమర్

పార్కింగ్ స్పేస్ లేకపోవడం మరియు పార్కింగ్ సమయాన్ని ఆదా చేయడానికి చైనాలో ఓ వ్యక్తి ఏకంగా డిపార్ట్‌మెంటల్‌ స్టోరులోకి కారుతో సహా వెళ్లిపోయాడు. సోషల్ మీడియాలోకి చేరిన ఆ వీడియో ఇప్పుడు మంచి పాపులారిటీ సొంతం చేసుకుంటోంది.

కస్టమర్ కారుతో సహా లోపలికెళ్లాడు, దీన్ని గమనించిన బిల్ కౌంటర్‌లోని వ్యక్తి కమస్టమర్‌ను వెనక్కి వెళ్లాలను కోరాడు. అయితే తనకు కావాల్సిన సరుకులు ఇస్తే వెళ్లిపోతానన్నాడు. వెంటనే ఆ వ్యక్తి కస్టమర్‌కు కావాల్సిన వస్తువులను తీసుకుని, వాటికి బిల్ వేసి మరీ కస్టమర్‌కు అందించాడు.

బిల్‌లో ఉన్న మొత్తాన్ని చెల్లించిన కస్టమర్ కారుతో సహా వెనక్కి వెళ్లిపోయాడు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. అదే కస్టమర్ కారును పార్క్ చేసి, స్టోర్‌కు వచ్చి కొనుగోలు చేసుంటే చాలా సమయమే పట్టేది. దీనికి తోడు పార్కింగ్ స్పేస్ వెతుక్కోవడం మరో పెద్ద తలనొప్పి.

చైనాలోని ఓ కస్టమర్ కిరాణా దుకాణంలోకి కారును నడపడాన్ని ఇక్కడున్న వీడియో ద్వారా వీక్షించగలరు. అయితే మీరు మాత్రం ఇలా ఏకంగా కిరాణా షాపుల్లోకి నడపకండి. పార్కింగ్ స్పేస్ లేదని ఒక్కసారి తెలిస్తే, మరో సారి కారు తీసుకెళ్లకండి.

English summary
Read In Telugu Parking Worries — Man Drives Into Department Store To Save Time
Story first published: Saturday, June 17, 2017, 10:56 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark