Viral Video ఇదేం డ్రైవింగ్ సామీ... ప్యాసింజర్‌ సీటుపై కూర్చొని కాళ్లతో స్టీరింగ్‌ను నియంత్రిస్తూ..!

ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా జరుగుతున్న దేశాల్లో భారత్‌ మొదటి వరుసలో ఉంది. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అతి వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ సహా అనేక కారణాలు ఉంటున్నాయి. అయితే తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోపై నెటిజన్లు మిశ్రమ స్పందన వస్తోంది.

ఓ వాహనదారుడు మారుతి సుజుకి ఆల్టో కారును (Maruti Suzuki Alto) కాళ్లతో డ్రైవింగ్‌ చేస్తున్నాడు. అది కూడా డ్రైవింగ్‌ సీటు నుంచి కాకుండా ప్యాసింజర్‌ సీటు నుంచి డ్రైవింగ్‌ చేస్తున్నాడు. ఈ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోపై కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయగా.. మరికొందరు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

Man drives Maruti Suzuki Alto car with feet

పూర్తి నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ : ఈ వీడియో ఆధారంగా ఎడమ కాలితో స్టీరింగ్‌ను నియంత్రిస్తున్నాడు. కుడి కాలితో యాక్సిలరేటర్‌, బ్రేక్‌ పెడల్‌ను కంట్రోల్‌ చేస్తున్నారు. అయితే పూర్తి నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేస్తున్నప్పటికి.. చాలా సులభంగా వాహనాన్ని నడపడాన్ని గమనించవచ్చు. అయితే ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందనే వివరాలు తెలియలేదు.

డ్రైవింగ్‌ స్కూల్‌కు చెందిన వాహనమా..? : అయితే ఈ కారు డ్రైవింగ్‌ స్కూల్‌కు చెందిన వాహనం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కారు డ్రైవింగ్‌పైన శిక్షణ ఇస్తున్న వ్యక్తి కూర్చున్న ప్యాసింజర్‌ సీట్‌ వద్ద కూడా క్లచ్‌, యాక్సిలరేటర్‌, బ్రేక్‌ పెడల్స్‌ ఉంటాయి. అయితే కారు డ్రైవింగ్‌ చేస్తున్న వ్యక్తి చాలా నైపుణ్యత ప్రదర్శించడం వీడియోలో గమనించవచ్చు.

Maruti Suzuki Alto latest news

నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన : అయితే ఈ వీడియోపై కొందరు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రవర్తన రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతుందని ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ ఘటన పోలీసులు దృష్టికి వెళ్లిందా.. పోలీసులు చర్యలు తీసుకున్నారా అనేది తెలియరాలేదు.

భారత్‌లో ప్రమాదాలకు ఇలాంటి నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ కూడా కారణం. ఇలాంటి విన్యాసాలు చేయాలని ఎవరైన భావిస్తే ఉపయోగంలో లేని రోడ్లు, లేదా ఖాళీ మైదానాల్లో ప్రయత్నం చేయాలి. పబ్లిక్‌ రోడ్లపై ఇలాంటి నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ ప్రమాదాలకు కారణం అవుతుంది. కారులో ఉన్న వ్యక్తులకే కాకుండా రోడ్లపై ఇతర వాహన, పాదచారులు కూడా ప్రమాదంలో చిక్కుకొనే అవకాశం ఉంది.

Man drives car with feet

తమకు నేరుగా అందిన సమాచారంతోనే కాకుండా రోడ్లపైన ఏర్పాటుచేసిన సీసీ కెమెరా వీడియోలు లేదా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలు ఆధారంగా పోలీసులు ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకుంటున్నారు. భారీగా జరిమానాలు విధిస్తున్నారు. కొన్ని పరిస్థితుల్లో వాహనాలను సీజ్‌ చేస్తున్నారు. అయితే కొందరిలో ఎటువంటి మార్పు రావడం లేదు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Monday, December 18, 2023, 19:50 [IST]
English summary
Man drives maruti suzuki alto from passenger seat and controlling steering using feet
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+