పెంపుడు కుక్కను ఒళ్లో కూర్చొబెట్టుకుని డ్రైవింగ్.. లైసెన్స్ రద్దు
మన దేశంలో జంతు ప్రియులు ఎక్కువే అని చెప్పాలి. ముఖ్యంగా ఇళ్లలో కుక్కలను పెంచుకునే అలవాటు ప్రతీ ఇంట్లోనూ ఉంది. వీటిని తరచూ రోడ్లపైకి వాకింగ్ కోసం, ఇతర సపర్యలకు బయటకు తీసుకువెళ్తారు. చాలా వరకు బైక్‌ని పెంపుడు కుక్కలను తీసుకువెళ్లే సందర్భాలు రోడ్లపై నిత్యం కనిపిస్తుంటాయి. ముగ్గురు ప్రయాణీకులతో బైక్‌లపై వెళ్తున్న వారు కూడా వీటిని ముందు కూర్చోబెట్టుకుని తీసుకువెళ్తారు. కొంతమంది తమ పెంపుడు జంతువులను ఎంతగా ప్రేమిస్తారు అంటే వారు డ్రైవింగ్ చేసేటప్పుడు వాటికి దూరంగా వెళ్లలేరు. కేరళకు చెందిన ఓ చర్చి ఫాదర్ వీడియో ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఫాదర్ తన పెంపుడు జంతువును ఒడిలో పెట్టుకుని కారు నడుపుతూ కనిపించాడు.
తాజాగా ఈ వీడియో వైరల్‌గా మారడంతో కేరళ మోటార్ వెహికిల్ డిపార్ట్‌మెంట్ చర్యలు తీసుకుంది. దీంతో ఆ వ్యక్తిపై చట్టరీత్యా చర్యలు తీసుకున్నారు. ఈ వీడియోను మాతృభూమి న్యూస్ ఛానల్ తమ యూట్యూబ్‌లో షేర్ చేసింది. ఈ ఘటన కేరళలోని కొల్లాం జిల్లాలో జరిగింది. కొల్లాంలోని నూరానాడ్‌కి చెందిన ఫాదర్ బిజూ విన్సెంట్ తన పెంపుడు కుక్కను ఒడిలో పెట్టుకుని కారు నడుపుతూ కనిపించారు.

ఈ వీడియోను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయగా అలప్పుజ ఆర్టీవో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ ఘటనకు సంబంధించి బిజూకు షోకాజ్ నోటీసులు పంపారు. జూన్ 5న ఫాదర్ చారుమూడు నుంచి పడనిలం వరకు రిజిస్ట్రేషన్ నంబర్ KL02AS3460 మారుతి ఎర్టిగా కారులో కుక్కను ఒడిలో కూర్చొబెట్టి నడుపుతూ కనిపించాడు. డ్రైవర్ ఒడిలో కుక్క కూర్చోవడం మనం వీడియోలో చూడవచ్చు.
ఈ వీడియోను ఆయనే స్వయంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేశాడు. ఆ కుక్క డ్రైవర్‌కి ఇబ్బంది కలిగిస్తున్న దృశ్యాలు చూడవచ్చు. కుక్క తరచూ తలను సైతం విండో నుంచి బయటకు తీసింది. ఇది ప్రమాదకరం ఎందుకంటే ఈ జంతువులు ఎలా స్పందిస్తాయో మనకు తెలియదు. తన కుక్క కాలి గాయానికి చికిత్స చేసి పశువైద్యశాల నుంచి తిరిగి వస్తున్నానని ఆయన వివరణ ఇచ్చారు.

కుక్కకు గాయం కావడంతోనే ఒడిలో కూర్చోబెట్టుకున్నట్లు వివరించాడు. అయితే ఈ విధంగా కారు నడపడం చట్టవిరుద్ధమని.. బిజూ విన్సెంట్ డ్రైవింగ్ లైసెన్స్‌ని మోటారు వాహన డిపార్ట్‌మెంట్ రద్దు చేయనుంది. దీనికి సరైన వివరణ ఇచ్చినా అధికారులు ఏమాత్రం వినిపించుకోవడం లేదని ఆయన వాపోయాడు. గాయంతో కుక్క బలహీనంగా మారడంతో అలా ముందు కూర్చొబెట్టుకున్నాని.. సోషల్ మీడియాలోనూ ఈ విషయాన్నే వెల్లడించినట్లు ఆయన తెలిపారు.
పెంపుడు జంతువును ఒడిలో కూర్చోబెట్టుకుని కారు నడపడం చాలా ప్రమాదకరం, ముఖ్యంగా మీరు విండో గ్లాస్ కిందకు తిప్పి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇతరులకు హాని చేయవచ్చు. కుక్కలు వంటి జంతువులు ఇతర వ్యక్తుల పట్ల కొన్ని సందర్భాల్లో జూలు విదిల్చే అవకాశం ఉంటుంది. అందువల్ల కారు కదులుతున్నప్పుడు మరేదైనా జంతువు కనిపిస్తే కారు నుంచి దూకి తాము గాయపరచవచ్చు. అంతే కాకుండా జంతువు కూడా డ్రైవర్ ఏకాగ్రతను దెబ్బతీస్తుంది.
కుక్క లేదా పెంపుడు జంతువులు విండోస్ నుంచి బయటకు చూడటం వల్ల వెనుక నుంచి వస్తున్న వాహనాన్ని డ్రైవర్ చూడలేడు. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. మీరు పెంపుడు జంతువుతో ప్రయాణిస్తుంటే, వాటిని వెనుక సీటులో కూర్చోబెట్టడం ఉత్తమం. అంతే కాకుండా కారులో వెళ్లేటప్పుడు సైతం మీ పెంపుడు కుక్కపు పట్టీ (చైన్) వేయగలిగితే అవి పరిగెత్తకుండా ఉంటాయి.
ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి కాదు. కొన్నేళ్ల క్రితం ఓ వ్యక్తి బైక్‌పై కుక్కను కూర్చోబెట్టుకుని బైక్ నడుపుతున్న వీడియో చూశాం. బైక్ కదలికలో ఉన్నప్పుడు కుక్క వెనుక సీటులో బ్యాలెన్స్ చేస్తోంది. ఇలాంటి కఠిన చర్యలు తీసుకోవడం వల్ల ఎవ్వరూ ఇలాంటి ప్రాక్టీస్‌ని అనుకరించరని కేరళ మోటర్ వెహికిల్ డిపార్ట్‌మెంట్ భావిస్తోంది.


Click it and Unblock the Notifications








