మెట్రోలో మంచూరియా తింటూ వీడియో షేర్‌ చేసిన ప్రయాణికుడు.. ఝలక్‌ ఇచ్చిన అధికారులు

మెట్రోపాలిటన్‌ నగరాల్లో మెట్రో రైళ్లు ప్రధాన రవాణా వ్యవస్థగా మారాయి. యువతీయువకులు, ఉద్యోగస్థులు ఎక్కువగా మెట్రో రవాణా సేవలను వినియోగించుకుంటున్నారు. మెట్రోలో ప్రయాణించేటప్పుడు కొన్ని నిబంధనలకు లోబడాల్సి ఉంటుంది. చాలా మంది వాటిని అతిక్రమిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి మెట్రో(Having Food In Metro)లో భోజనం చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది.

ఈ మధ్య కాలంలో మెట్రో రైళ్లకు సంబంధించి వార్తలు తెగ వైరల్‌ అవుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ మెట్రో(Delhi Metro Viral Videos)లో ఇటీవల జరిగిన సంఘటనలపై నెటిజన్లు విరుచుకుపడిపోయారు. తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించేలా అసభ్యకరమైన పనులకు పాల్పడుతున్నారు. ఇటీవల ఓ యువజంట అందరూ చూస్తుండగానే ఒకరికొకరు ముద్దులు పెట్టుకుంటున్న వీడియో ఒకటి ఫుల్‌ వైరల్‌ అయిపోయింది.

Eating-Gobi-Manchurian-In-Metro

అంతే కాకుండా మెట్రో రైళ్లలో సీటు కోసం మహిళలు గొడవ పడటం, ఆటో మేటిక్‌ డోర్లు మూసుకుపోకుండా వాటికి మధ్యలో కాలు(Metro Viral Videos)పెట్టడం, మరోసారి ఓ యువతి ఇంట్లో సమయం లేక మెట్రోలోనే తన జుట్టును స్ట్రెయిట్‌నింగ్‌ చోటుచేసుకోవడం.. ఇలా ఒకటేమిటి నెలకోసారైనా దేశంలోని మెట్రో రైళ్లు వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో బెంగళూరు మెట్రోలో జరిగిన సంఘటన ఒకటి అధికారుల దృష్టికి వెళ్లింది.

ఎప్పుడూ రద్దీగా ఉండే నగరాల్లో బెంగళూరు ఒకటి. బెంగళూరు మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(BMRCL) ద్వారా నగరవాసులకు మెట్రో సేవలందిస్తోంది. అయితే BMRCL నిబంధనలను అతిక్రమించి ఓ వ్యక్తి గోబీ మంచూరియా తింటున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో అతనే స్వయంగా తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేశారు.

Eating-Gobi-Manchurian-In-Metro

ఈ వీడియో BMRCL అధికారుల దృష్టికి వెళ్లడంతో స్పందించిన అధికారులు ఆ వ్యక్తికి రూ. 500 జరిమానా విధించారు. మెట్రోలో గోబీ మంచూరియా తింటున్న వ్యక్తిని సునీల్ కుమార్‌గా గుర్తించారు. అతను జయనగర్‌లోని ఓ పేరుగాంచిన నగల దుకాణంలో పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అతను రోజూ సంపిగె రోడ్డు- జయనగర్ మధ్య మెట్రోలో ప్రయాణిస్తున్నట్లు వివరాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ సంఘటనను మెట్రోలో సునీల్‌తో పాటు ప్రయాణిస్తున్న అతని స్నేహితుడు వీడియో తీశాడు. వీడియోలో రికార్డయిన వాయిస్ అతని స్నేహితుడిదే అయి ఉండొచ్చు. మెట్రోలో ప్రయాణించేటప్పుడు ఎలాంటి చర్యలకు పాల్పడకూడదో ముందుగానే మెట్రో రైల్‌ సిబ్బంది హెచ్చరికలు జారీ చేస్తారు. కానీ ఇలాంటి చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. ఈ వ్యక్తి చదువుకోని మూర్ఖుడు అంటూ అతని స్నేహితుడు అనడాన్ని వీడియోలో వినవచ్చు.

Eating-Gobi-Manchurian-In-Metro

అనంతరం సునీల్‌ ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో BMRCL సిబ్బంది.. జయనగర్ పోలీస్ స్టేషన్‌లో ఆ వ్యక్తిపై ఫిర్యాదు చేశారు. అనంతరం అతనికి రూ. 500 జరిమానా వసూలు చేశారు. దీనికి సంబంధించి మెట్రో అధికారి ఒకరు స్పందిస్తూ.. BMRCL ఇటువంటి చర్య తీసుకోవడం ఇదే మొదటిసారి అన్నారు.

నిబంధనల ప్రకారం మెట్రోలో ఆహారం తీసుకోరాదని పేర్కొన్నారు. ఇకపై అలాంటి తప్పు చేయనని ఆ వ్యక్తి హామీ ఇచ్చినట్లు తెలిపారు. మెట్రోలో పాటించాల్సిన నిబంధనలపై పలు వీడియోల్లో అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ప్రయాణికులు వాటిని అనుసరించాలని.. కోరి సమస్యలను తెచ్చుకోవద్దని హితవు పలికారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, October 7, 2023, 12:34 [IST]
English summary
Man eating gobi manchurian in bengaluru metro train and he was fined video gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+