పాము ఉన్న హెల్మెట్ తో 11 కిలోమీటర్లు ప్రయాణించిన కేరళ వ్యక్తి

సాధారణంగా అప్పుడప్పుడు మనిషికి అనుకోని ప్రమాదాలు ఊహకందని విధంగా జరుగుతూ ఉంటాయి. ఇదే రీతిలో కేరళకు చెందిన ఒక వ్యక్తి బైక్ హెల్మెట్ లో అత్యంత విషపూరితమైన పాము ఉండటాన్ని గుర్తించ కుండా ఏకంగా దానితో 11 కిలోమీటర్లు దానితోనే ప్రయాణం చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం!

పాము ఉన్న హెల్మెట్ తో 11 కిలోమీటర్లు ప్రయాణించిన కేరళ వ్యక్తి

కేరళకు చెందిన "రంజిత్" కందనాడ్ సెయింట్ మేరీ హైస్కూల్‌ లో టీచర్ గా పని చేస్తున్నారు. రంజిత్ ఫిబ్రవరి 5 న ఉదయం 8:30 గంటల సమయంలో ఇంటి నుంచి పాఠశాలకు బయలుదేరాడు. తన ఇంటి నుంచి 5 కిలోమీటర్లు కందనాడ్ పాఠశాలకు చేరుకొని తరగతి ముగించుకుని అక్కడ నుంచి త్రిపునితురా ఆర్‌ఎల్‌వి పాఠశాలకు బయలుదేరాడు. కందనాడ్ పాఠశాలనుంచి త్రిపునితురా ఆర్‌ఎల్‌వి పాఠశాలకు 6 కిలోమీటర్లు.

పాము ఉన్న హెల్మెట్ తో 11 కిలోమీటర్లు ప్రయాణించిన కేరళ వ్యక్తి

త్రిపునితురా ఆర్‌ఎల్‌వి పాఠశాల చేరుకున్న తరువాత రంజిత్ తన హెల్మెట్ లో పాము ఉండటం గమనించారు. ఆ పాము అత్యంత విషపూరితమైన "కామం క్రైట్", అది అప్పటికే చనిపోయి ఉంది. తరువాత రంజిత పామును గుర్తించిన వెంటనే చనిపోయిన పాముని తగులబెట్టాడు. పాము హెల్మెట్ లో ఉన్నప్పటికీ తనకి ఎలాంటి ప్రమాదం జరగలేదు.

పాము ఉన్న హెల్మెట్ తో 11 కిలోమీటర్లు ప్రయాణించిన కేరళ వ్యక్తి

రంజిత్ తన ఇంటికి సమీపంలో ఉన్న చెరువు నుంచి వచ్చి ఉండవచ్చని చెప్పారు. పాము చాల సేపటి నుంచి హెల్మెట్ లో ఉంది కానీ తాను దానిని ధరించేటప్పుడు అనుమానం ఏ మాత్రం రాలేదని అసాధారణంగా కూడా ఏమి అనిపించలేదని చెప్పారు.

పాము ఉన్న హెల్మెట్ తో 11 కిలోమీటర్లు ప్రయాణించిన కేరళ వ్యక్తి

భారతదేశంలో పాములు ఎక్కువగానే ఉంటాయి. పాములు తడిగా ఉండే ప్రదేశాలలో మరియు పచ్చని ప్రదేశాలలో ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా పాములకు అనుకూలంగా ఉండే ప్రాంతాలలో కేరళ రాష్ట్రము కూడా ఒకటి. సాధారణంగా నైరుతి భారతదేశంలో పాములతో చాల మంది సామరస్యంగా మెలుగుతారు. చాల మంది వీటి బారినుంచి తమను తాము కాపాడుకుంటూ ఉంటారు.

పాము ఉన్న హెల్మెట్ తో 11 కిలోమీటర్లు ప్రయాణించిన కేరళ వ్యక్తి

ఇటీవల కాలంలో కేరళలోనే మలప్పురం జిల్లాలో ఒక అమ్మాయి తన పాఠశాల బ్యాగ్ లో పాము ఉండటాన్ని గుర్తించింది. అదృష్టవశాత్తు ఆ అమ్మాయికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.

పాము ఉన్న హెల్మెట్ తో 11 కిలోమీటర్లు ప్రయాణించిన కేరళ వ్యక్తి

సాధారణంగా పాములు రెస్ట్ తీసుకోవడానికి వెచ్చగా ఉండే ప్రదేశాలను ఎంచుకుంటాయి. చాల సందర్భాల్లో పాములు కార్లలో మరియు మోటార్ సైకిల్స్ లో ఉండటాన్ని మనం గమనిస్తూనే ఉంటాము. ఇలాంటి పరిస్థితుల్లో వీలైనంత ప్రశాంతగా బయట పడటం మంచిది.

పాము ఉన్న హెల్మెట్ తో 11 కిలోమీటర్లు ప్రయాణించిన కేరళ వ్యక్తి

భూమిపైనా చాల రకాల పాములు విషపూరితాలు కావు. చాల మందికి విషం లేని పాములను గుర్తించడం చాలా కస్టమైన పని. పాములు కనిపించిన వెంటనే సొంతంగా పట్టుకోవడం కానీ చంపడం కానీ తెలివైన పని కాదు. జీవ వైవిధ్యానికి పాములు కూడా ముఖ్యమైనవి, కాబట్టి వీటిని చంపకూడదు. వీటిని అడవిలో ఏదో ఒక ప్రదేశంలో వదిలిపెట్టాలి.

పాము ఉన్న హెల్మెట్ తో 11 కిలోమీటర్లు ప్రయాణించిన కేరళ వ్యక్తి

పాములు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో నివసిస్తున్న వారు ప్రొపెషనల్ స్నేక్ క్యాచర్ల యొక్క నంబర్లను అందుబాటులో ఉంచాలి. వీరి సేవలను వీలైనంత ఉపయోగించుకోవాలి. స్వయంగా విషపూరితమైన వాటితో చెలగాటం ఆడితే ప్రాణాలకే ప్రమాదం. ఈ విషయాన్నీ గుర్తించుకుని జాగ్రత్తలు తీసుకోవాలి.

Most Read Articles

English summary
Man rides with venomous snake in helmet for 11 Kms. Read in Telugu.
Story first published: Tuesday, February 11, 2020, 15:59 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X