బైకుపై కుక్కతో ప్రయాణించిన వ్యక్తికి జరిమానా
మనదేశంలో పెంపుడు జంతువులను పెంచుకోవడం సర్వసాధారణం. కొంతమంది ఈ పెంపుడు జంతువులపై చాలా ప్రేమను చూపిస్తారు. ప్రయాణాలలో వారితోపాటు తీసుకెళ్లడం వంటివి కూడా చేస్తుంటారు. కానీ కేరళకి చెందిన ఒక వ్యక్తి ఏకంగా తన బైకులో వెనుక కూర్చోబెట్టుకుని డ్రైవింగ్ చేసిన ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం!

కేరళకి చెందిన ఒక వ్యక్తి తన మోటార్ సైకిల్ వెనుక తన కుక్కతో రోడ్డుపై రైడింగ్ చేశారు. ఆ కుక్క వెనుక సీటుపై కూర్చుని బ్యాలెన్స్ చేయడం మనం వీడియోలో చూడవచ్చు. ఈ విధంగా కుక్కను మోటార్ సైకిల్పై కూర్చోబెట్టుకుని డ్రైవింగ్ చేసినందుకు కేరళ మోటార్ శాఖ తనకి జరిమానా విధించింది.

సాధారణంగా భారతదేశంలో రోడ్డు నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. వీటిని పాటించకుండా వీటికి వ్యతిరేకంగా నడుచుకున్నవారికి ప్రభుత్వం జరిమానా విదిస్తుంది. తనతోపాటు కుక్కని తీసుకెళ్లిన వ్యక్తి కుక్కను తీసుకెళ్లడమే కాకుండా రోడ్డుపై డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ కూడా ధరించకపోవడం మనం వీడియోలో చూడవచ్చు.

ఇండియాలో పెంపుడు జంతువులతో కలిసి బైకుపై ప్రయాణించడం ఇది మొదటిదేమీ కాదు. గతంలో కూడా ఇలాంటి సన్నివేశాలు చాలానే జరిగాయి. కానీ ఈ విధంగా ప్రయాణించడం చాలా ప్రమాదకరం. ఇది రోడ్డు ప్రమాదానికి కూడా దారి తీస్తుంది. ఢిల్లీలో లో కూడా ఒక వ్యక్తి తన కుక్కకి తనకి హెల్మెట్లు ధరించి ప్రయాణించిన విషయం మనందిరికి తెలిసినదే.

జంతువులు చాలా అనూహ్యంగా ఉంటాయి. రోడ్డుపై ప్రాయాణించేటప్పుడు ఆకస్మిక కదలికలను జరుపుతుంది. ఈ విధంగా కదిలినప్పుడు రైడర్ వాహనాన్ని సరిగ్గా నడపలేడు. కాబట్టి ప్రమాదం జరగవచ్చు. చాలామంది వాహనదారులు రవాణా నియమాలను పాటించరు. ఏదేమైనా ఇటువంటి చర్యలవల్ల ప్రయాణికులందరికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది.

ఇటువంటి విన్యాసాలు చేయడానికి ప్రైవేట్ రోడ్లు మరియు ప్రైవేట్ ప్రదేశాలు ఉన్నాయి. కానీ బహిరంగ ప్రదేశాలలో లేదా రహదారులలో ఇటువంటి చర్యలు మంచిది కాదు.

భారతదేశంలో ప్రతి సంవత్సరం కొన్ని వేల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతుంటాయి. రోడ్డు నిబంధనలను పాటించకపోవడం వల్ల, మద్యం తాగి రోడ్డుపై ప్రయాణించడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
వాహనాలపై వెళ్ళేటప్పుడు పెంపుడు జంతువులతో ప్రయాణించడం మంచిది కాదు. జంతవులు అనుకోకుండా చేసే కదిలికల వల్ల రైడర్ కి అనుకూలంగా ఉండదు. కాబట్టి రోడ్డు ప్రమాదాలు జరగవచ్చు. కాబట్టి ఇటువంటి చర్యలు జరపకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
Image Courtesy: TOI/YouTube


Click it and Unblock the Notifications








