360 సీట్ల విమానంలో ఒక్కడే ప్రయాణికుడు.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం

ఒక భారీ విమానంలో మనం ఒక్కరే ప్రయాణం చేస్తే అది ఏ విధంగా ఉంటుందో ఊహించుకుంటేనే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి సంఘటనలు దాదాపు జరిగే అవకాశం లేదు. కానీ ఇలాంటి సంఘటన ఒకటి ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

360 సీట్ల విమానంలో ఒక్కడే ప్రయాణికుడు.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం

360 సీట్లు కలిగిన విమానంలో 18,000 రూపాయలు ఖర్చు చేసి ఒంటరిగా ప్రయాణించాడు. ఇది వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజంగా జరిగింది. నివేదికల ప్రకారం దుబాయ్ నివాసి అయిన భవేష్ జావేరి దుబాయ్ ప్రయాణ నిషేధం కావడంతో ముంబై నుండి దుబాయ్ కి బోయింగ్ 777 విమానంలో ఒంటరిగా ప్రయాణించారు.

360 సీట్ల విమానంలో ఒక్కడే ప్రయాణికుడు.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం

జవేరీ విమానంలోకి అడుగుపెట్టగానే విమానంలో నన్ను ఆహ్వానించడానికి ఎయిర్ హోస్టెస్ అందరూ చప్పట్లు కొట్టారని తన దుబాయ్ కార్యాలయం నుండి టైమ్స్ ఆఫ్ ఇండియాతో అన్నారు. ముంబై మరియు దుబాయ్ మధ్య ఇప్పటివరకు 240 కి పైగా విమానాలలో ప్రయాణించినట్లు తెలిపాడు. ఈ ప్రయాణాలు మొత్తంలో ఇది చాలా ఉత్తమ ప్రయాణం అని చెప్పాడు.

MOST READ:మీకు తెలుసా.. భారతదేశపు మొట్టమొదటి కమర్షియల్ పైలట్ ఈ యువతి

360 సీట్ల విమానంలో ఒక్కడే ప్రయాణికుడు.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం

భవేష్ జవేరి తమ ప్రయాణ సమయంలో సిబ్బందితో పాటు కమాండర్‌తో సంభాషిస్తూ చాలా సమయం గడిపాడు. అంతే కాకుండా ఈ సమయంలో అతనికి విమానం మొత్తం తిరగటానికి కూడా అనుమతించారు. విమానంలో కూడా బవేరీ యొక్క లక్కీ నెంబర్ అయిన 18 సీటులో కూర్చుని ప్రయాణించాడు.

360 సీట్ల విమానంలో ఒక్కడే ప్రయాణికుడు.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం

విమానంలో ఏదైనా ప్రకటన చేయాలంటే కూడా అతని పేరు పెట్టి ప్రకటన చేయడం కూడా జరిగింది. ఈ ఫ్లైట్ లో చాలా హ్యాప్పీగా ప్రయాణం సాగించాడు. భవేష్ గత 20 సంవత్సరాలుగా దుబాయ్‌లో నివసిస్తున్నట్లు తెలిసింది.

MOST READ:విధుల్లో ఉన్న అంబులెన్స్ డ్రైవర్ తన తల్లి మరణ వార్త విన్నాడు.. తరువాత ఏం జరిగిందంటే?

360 సీట్ల విమానంలో ఒక్కడే ప్రయాణికుడు.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి చాలా ఎక్కువగా వ్యాపిస్తోంది. ఈ కారణంగా అంతర్జాతీయ రవాణా సేవలన్నీ నిలిపివేశారు. అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విధించిన ప్రయాణ ఆంక్షల ప్రకారం, యుఎఇ పౌరులు, యుఎఇ గోల్డెన్ వీసా ఉన్నవారు మరియు డిప్లొమాటిక్ మిషన్ సభ్యులు మాత్రమే భారతదేశం నుండి యుఎఇకి వెళ్లగలరు.

360 సీట్ల విమానంలో ఒక్కడే ప్రయాణికుడు.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం

ముంబై-దుబాయ్ మార్గం చేయడానికి ఒక విమానయాన సంస్థ నుండి బోయింగ్ 777 ను చార్టర్ చేయడానికి సుమారు 70 లక్షల రూపాయలు ఖర్చవుతుందని భారతీయ విమాన చార్టర్ పరిశ్రమకు చెందిన ఒక ఆపరేటర్ టైమ్స్ అఫ్ ఇండియాకి తెలిపారు.

MOST READ:ప్రజల కోసం తన కారును అంబులెన్సుగా మార్చిన కాంగ్రెస్ నాయకుడు, ఎవరో తెలుసా?

360 సీట్ల విమానంలో ఒక్కడే ప్రయాణికుడు.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం

భవేష్ జవేరి గోల్డెన్ వీసా కలిగి ఉన్నాడు, కావున అతను బయలుదేరే షెడ్యూల్ తేదీకి ఒక వారం ముందు ఎయిర్ లైన్స్ కి కాల్ చేసి రూ. 18,000 ఎకానమీ క్లాస్ టికెట్ కొనుగోలు చేశాడు. తాను సాధారణంగా బిజినెస్ క్లాస్ టిక్కెట్లను బుక్ చేసుకుంటానని, అయితే విమానంలో కొద్ది మంది ప్రయాణికులు మాత్రమే ఉంటారని, అందువల్ల ఎకానమీ క్లాస్ టిక్కెట్లను బుక్ చేసుకున్నట్లు తెలిపాడు.

360 సీట్ల విమానంలో ఒక్కడే ప్రయాణికుడు.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం

భవేష్ జవేరి విమానాశ్రయానికి చేరుకున్న తరువాత, తన టికెట్ లో తేదీ లేనందున సిఐఎస్ఎఫ్ సిబ్బంది టెర్మినల్ భవనంలోకి ప్రవేశించకూడదని తెలిపారు. ఆ సమయంలో వెంటనే, భవేష్ ఎమిరేట్స్ కి డయల్ చేసాడు మరియు బోర్డు ఫ్లైట్ ఈకె501 లో అతను మాత్రమే ప్రయాణీకుడు కావడంతో సిబ్బంది అతని కోసం ఎదురు చూస్తున్నారని తెలిసింది.

MOST READ:బంపర్ ఆఫర్ ప్రకటించిన కియా మోటార్స్; కారు నచ్చకపోతే 30 రోజుల్లో రిటర్న్ చేయవచ్చు

360 సీట్ల విమానంలో ఒక్కడే ప్రయాణికుడు.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం

గత జూన్ నెలలో అతడు 14 సీట్ల విమానంలో తొమ్మిది మంది ప్రయాణికులతో దుబాయ్ నుండి ముంబైకి చార్టర్ ఫ్లైట్ ప్రయాణించినట్లు కూడా తెలిపాడు. అయితే ఇప్పుడు అంతపెద్ద విమానంలో ఒక్కడినే ప్రయాణించానని తెలిపాడు.

Most Read Articles

English summary
Man Flies Solo From Mumbai To Dubai For Just Rs. 18k. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X