బర్త్ డే గిఫ్ట్ గా రూ.56 లక్షల కారు.. తీరా అది దొంగతనం చేసిన కారు అని తెలిసి అవ్వాక్..
ఓ వ్యక్తి తన భార్య పుట్టిన రోజు కోసం భారీ మొత్తంలో చెల్లించి ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చాడు. అంతా సవ్యంగానే సాగిపోతుంది. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ జంటకు ఊహించిన షాక్ తగిలింది. వారు కొనుగోలు చేసిన కారు దొంగ (ఎవరో కొట్టేసిన) కారు అని తెలిసి అవ్వాక్ అయ్యారు. అసలు ఏం జరిగింది ఆ కారు ఖరీదు ఎంత వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..
USకు చెందిన జాసన్ స్కాట్ అనే ఆర్మీమెన్ తన భార్య బర్త్ డే కోసం ఖరీదైన అత్యాధునిక 2021 మసెరటి SUVని బహుమతిగా ఇచ్చాడు. ఈ కారు కోసం ఏకంగా US వ్యక్తికి 68,000డాలర్లు (సుమారు రూ. 56 లక్షలు) చెల్లించాడు. తీరా తను కొనుగోలు చేసిన వాహనం వాస్తవానికి దొంగిలించబడిన 2017 మోడల్ గా గుర్తించి ఆశ్చర్యపోతారు.

2021 మోడల్ కి బదులు.. 2017 డెలివరీ..
ఫిబ్రవరిలో సాధారణ తనిఖీ కోసం సమీపంలోని మసెరటి డీలర్‌షిప్‌లో కారును తీసుకెళ్తాడు. దానిని పరిశీలించిన అనంతరం అది తాను కొనుగోలు చేసిన ఖరీదైన మసెరటి తాజా మోడల్ కాదని వారు వివరిస్తారు. అలానే ఆ కారు దొంగిలించబడిందని తెలుసుకున్న జాసన్ స్కాట్ నోరుపై టక్కున వేలు వేసుకుంటాడు.
వెంటనే తేరుకుని తన కారు దొంగిలించబడిన యూనిట్ అని అతని భార్యకు సమాచారం అందిస్తాడు.ఈ కారును కొనుగోలు చేసిన వెబ్‌సైట్‌లో సదరు వాహనాన్ని తప్పుగా చూపించినట్లు వాపోతాడు. దీనిపై మరింత లోతుగా తెలుసుకోవడాని సాంకేతిక నిపుణుల సహాయాన్ని కోరాడు. వారు వాహనం గుర్తింపు సంఖ్యను తనిఖీ చేసి అది ఉపయోగించిన కారు వెబ్‌సైట్‌లో ప్రచారం చేయబడినట్లుగా గుర్తించారు. అందులోనూ ఇది 2021 మోడల్ కాదని, వాస్తవానికి 2017 యూనిట్ అని తెలియజేస్తారు.

పోలీసులకు కంప్లైంట్..
ఇంకా కొంతమంది ఉద్యోగులు కారు సంబంధించిన కొన్ని భాగాలు టాలీ కాకపోవడంతో వారి సందేహానికి మరింత బలం చేకూర్చినట్లైంది. ఛాసిస్‌పై VIN నంబర్ ఆధారంగా అది దొంగిలించబడిన వాహనమని తెలిసి డీలర్ షిప్ యాజమాన్యం నివ్వెరపోయింది. దీంతో చేసేదేమి లేక వారు పోలీసులకు కంప్లైంట్ చేయాల్సిందిగా కారు యజమానికి సూచించారు.
తమ వంతు సహాయంగా సర్వీస్ సెంటర్‌లోని టెక్నీషియన్లు కారు చోరీకి గురైనట్లు పోలీసులకు సమాచారం అందించి కారును సీజ్ చేశారు. ఇంతలో, స్కాట్ తన ఆర్థికంగా నష్టం కలిగించినందుకు $1 మిలియన్ నష్టపరిహారంతో పాటు ఇతర ఖర్చుల కోసం సదరు వెబ్‌సైట్‌పై దావా వేశాడు. అయితే, కారు దొంగతనం గురించి తమకు తెలియదని సదరు వ్యాపార వర్గాలు ఖండించాయి.

ఈ వాహనం నార్త్ కరోలినాలోని కార్వాన్ అనే వ్యాపార సంస్థ నుంచి కొనుగోలు చేయబడింది. నివేదిక ప్రకారం, కారు దొంగిలించబడిన విషయం కూడా తమకు తెలియదని ఆ కంపెనీ జాసన్ లాయర్‌కు రాసిన లేఖలో పేర్కొంది. ప్రస్తుతం జాసన్ కారును కొనుగోలు చేయడానికి ఉపయోగించిన నగదును వాపసు చేయడానికి ప్రయత్నిస్తున్నామని సదరు కంపెనీ వివరించింది. ABC న్యూస్ ప్రకారం, నార్త్ కరోలినాలోని అటార్నీ జనరల్ కార్యాలయం ఇదే 130 ఫిర్యాదులకు సంబంధించి పరిశీలిస్తోంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








