కారుపైకి ఎక్కి డబ్బులు కుమ్మరించిన వ్యక్తి.. మాంచి కోటింగ్ ఇచ్చిన పోలీసులు

సోషల్‌ మీడియా(Social Media) ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమై పోయింది. కొంతమంది తమ టాలెంట్‌తో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వైరల్‌ అవుతుంటే.. మరి కొందరు వైరల్‌ అవ్వడం కోసం సామాజిక మాధ్యమాలను యూజ్‌ చేసుకుంటున్నారు. ఇటీవల ఓ వ్యక్తి పబ్లిక్ రోడ్డుపై(Money Heist) డబ్బులు కుమ్మరిస్తున్న వీడియో వైరల్‌గా మారింది.

ఔత్సాహికులు కొత్త కొత్త కంటెంట్‌లను క్రియేట్‌ చేస్తున్నారు సోషల్‌ మీడియాలో తెగ పాపులర్‌ అవుతున్నారు. అంతే కాకుండా అవార్డులు సైతం సొంతం చేసుకుంటున్నారు. కొంతమంది అదే పనిగా సరికొత్త కంటెంట్లను క్రియేట్‌ చేస్తూ(Viral Video) ఫేమ్ సంపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు జనాలకు ఫన్‌ ఇస్తుండగా.. మరికొందరు మాత్రం తమ చేష్టలతో పబ్లిక్‌కి అంతరాయం కలిగిస్తున్నారు.

Man-Showering-Cash-On-Public

పబ్లిక్‌ రోడ్లపై స్టంట్లు, కార్లపై ప్రమాదకరంగా ప్రయాణిస్తూ నెటిజన్ల విమర్శలకు గురవుతున్నారు. కాగా ఇటీవల ఓ వ్యక్తి డబ్బున్న షేక్‌లా ఓ షోరూమ్‌కి డబ్బుల బ్యాగులతో వచ్చి అక్కడ కనిపించిన లగ్జరీ, ఖరీదైన కార్లన్నిటినీ బుక్‌ చేశాడు. అక్కడి సిబ్బందికి టిప్‌గా డబ్బులు కూడా పంచాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది. అయితే ఆ డబ్బు, అతను ఫేక్‌ అని తెలిసి పోలీసులు అరెస్ట్‌ చేశారు.

తాజాగా రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన ఓ సంఘటన వైరల్ అవుతోంది. ఇక్కడ ప్రముఖ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ 'మనీ హీస్ట్' ఇన్‌స్పిరేషన్‌తో ఓ వ్యక్తి ఆ తరహా గెటప్‌ వేసుకుని నడిరోడ్డుపై హల్‌చల్‌ చేశాడు. కారుపై నిలబడి రోడ్డుపై వెళ్తున్న వారిని పిలుస్తూ తన బ్యాగులో ఉన్న డబ్బులను కుమ్మరిస్తున్నాడు. అయితే అక్కడున్న వారు నోట్లు ఏరుకోవడం వీడియోలో చూడవచ్చు.

Man-Showering-Cash-On-Public

ఈ వీడియోను X (గతంలో ట్విట్టర్)లో ఓ నెటిజన్‌ షేర్‌ చేశారు. మారుతి ఆల్టో 800 హ్యాచ్‌బ్యాక్ రూఫ్‌పై నిలబడి డబ్బులు వెదజల్లుతున్నాడు. ఈ ఘటన జైపూర్‌లో మాలవ్య నగర్‌లోని గౌరవ్ టవర్ సమీపంలో జరిగింది. ఈ వ్యక్తి Money Heist సిరీస్‌లో సాల్వడార్ డాలీ మాస్క్‌ను ధరించాడు. అంతేకాకుండా సిరీస్‌లోని క్యారెక్టర్‌ ధరించిన దుస్తులు వేసుకున్నాడు.

ఆ గెటప్‌లో కారుపైకి ఎక్కి బ్యాగులో నుంచి కరెన్సీ నోట్లను విసిరేయడంతో అటుగా వెళ్తున్న కొందరు ఆగిపోయి డబ్బులు తీసుకుంటున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ జామ్‌ నెలకొంది. ఈ సమయంలో అటుగా వెళ్తున్న వ్యక్తి ఆ సంఘటనను రికార్డు చేశాడు. X లో షేర్‌ చేసిన కొద్ది సేపటికే ఈ వీడియో వైరల్‌గా మారింది.

Man-Showering-Cash-On-Public

ఈ వీడియో పోలీసుల దృష్టికి వెల్లడంతో అతడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆ వ్యక్తి వివరాలను వెల్లడించలేదు. ఇలాంటి చర్యలు ఎందుకు పాల్పడ్డారని పోలీసులు విచారించగా సోషల్ మీడియాలో ఫేమస్‌ అయ్యేందుకు తాను పబ్లిక్‌గా ఇలా చేసినట్లు వెల్లడించాడు. కాగా ఈ నెల 3 న పోలీసులు అరెస్ట్ చేసి, కారును స్వాధీనం చేసుకున్నారు.

ఈ వీడియోపై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. సోషల్‌ మీడియోలో త్వరగా వ్యూస్‌ సంపాదించేందుకు ఇదొక మంచి ఐడియా అంటూ కామెంట్‌ చేస్తున్నారు. అతను విసిరేసిన నోట్లు ఎన్ని రూపాయల నోట్లు అనేది గెస్‌ చేయాలంటూ క్విజ్‌ కాంపిటీషన్‌ పెడుతున్నారు. మరికొందరు ఇవి ఫేక్‌ నోట్లు అంటుండగా.. పబ్లిక్ రోడ్లపై ఇలా చేయడం నేరమంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అయితే దేశంలో ఇలాంటి సంఘటనలు జరగడం ఇది మొదటిసారి కాదు. చాలా మంది వైరల్‌ అయ్యేందుకు కార్లు, బైక్‌లతో రోడ్డుపై స్టంట్లు చేస్తున్నారు. పోలీసులు ఎంతగా హెచ్చరించినా ఇలాంటి పునరావృతమవుతూనే ఉన్నాయి. సోషల్‌ మీడియా, సీసీ కెమెరాల పుణ్యమా అని ఇలా చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడిన వారిని సులభంగా గుర్తించి వారికి జరిరమానా విధిస్తున్నారు. కానీ కొంతమంది వీటిని అసలు పట్టించుకోవడం లేదనేది వాస్తవం.

More from DriveSpark

Article Published On: Thursday, October 5, 2023, 13:07 [IST]
English summary
Man in jaipur dressed money heist costume and stands on car showering cash on public
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+