ఈ బైక్‌కు బీర్ పోస్తే చాలు.. 240 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది..!
పెరుగుతున్న టెక్నాలజీ ఆధారంగా రోజురోజుకు కొత్త ఆవిష్కరణలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఏదో రూపంలో యువత తమ టాలెంట్‌ను బయటపెడుతున్నారు. వీరికి సోషల్ మీడియా సైతం జై కొడుతోంది. తాజాగా ఓ వ్యక్తి సరికొత్త ఆవిష్కరణకు పునాది వేశాడు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్‌తో నడిచే బైక్‌లను చూసి ఉంటాం. కానీ అమెరికాకు చెందిన వ్యక్తి క్రియేటివ్‌గా ఆలోచించాడు. బీర్‌తో నడిచే బైక్‌ను తయారుచేశాడు.
ఇప్పటికే అనేక షోలలో బహుమతులు గెలుచుకున్న అమెరికాకు చెందిన మైఖేల్‌సన్.. పెట్రోల్, డీజిల్‌కు బదులుగా బీర్‌తో నడిచే బైక్‌కు రూపొందించాడు. ఈ బైక్ కచ్చితంగా వినూత్నంగా ఉంటుందని.. తనకు క్రియేటివ్‌గా ఉండడం ఇష్టమని చెప్పాడు. తాను నివాసం ఉంటున్న బ్లూమింగ్టన్‌లో రోజురోజుకు గ్యాస్ ధరలు పెరుగుతున్నాయని. అందువల్ల బైక్‌లకు సాధారణ ఇంధనాలను ఇంకా వినియోగించడం మంచిది కాదని చెప్పాడు. ఇప్పటికే అంతరిక్షంలోకి రాకెట్‌ను ప్రయోగించిన తొలి పౌరుడిగా మైఖెల్‌సన్ 'రాకెట్‌మ్యాన్‌గా' గుర్తింపు పొందాడు.

బీర్‌తో నడిచే బైక్‌ను తన గ్యారేజ్‌లోనే మైఖేల్‌సన్ రూపొందించాడు. గ్యాస్ ఆధారిత ఇంజిన్ స్థానంలో 14 గ్యాలన్ కిట్‌ను అమర్చాడు. ఇది హీటింగ్ కాయిల్‌గా పనిచేస్తుంది. బీర్ వేడెక్కేందుకు ఉపయోగపడుతుంది. ఫలితంగా శక్తి ఉత్పత్తి జరిగి.. బైక్ నడుస్తుంది. ఈ బైక్ గంటలకు 150 m\h వేగం అంటే 240 km\h వేగంతో నడుస్తుందని మైఖేల్‌సన్ వెల్లడించారు. భవిష్యత్‌లో ఈ సామర్థ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు చెప్పారు.
ఈ బైక్ ఎలా పనిచేస్తుందో మైఖేల్‌సన్ తెలిపారు. కిట్‌లో బీర్ పోసినప్పుడు. హీటింగ్ కాయిల్ సాయంతో 300 డిగ్రీల వరకు వేడెక్కుతుంది. ఫలితంగా బీర్ కాస్త్ సూపర్‌హీటెడ్ స్ట్రీమ్‌గా మారుతుంది. అది వెనుక నున్న నాజిల్ గుండా బయటకు వస్తుంది. ఆ శక్తి బైక్ ముందుకు వెళ్లేందుకు థ్రస్ట్‌గా ఉపయోగపడుతుంది. ఈ లిక్విడ్ రెడ్ బుల్ గానీ కారీబ్ కాఫీ సహా ఏదైనా కావచ్చని తెలిపారు.
ఈ బీర్‌తో నడిచే బైక్ స్థానిక కార్ షోల్లో తొలి బహుమతి గెలుచుకుంది. కానీ ఇప్పటివరకు రోడ్డు మీదకు రాలేదు. ఈ వాహనానికి సంబంధించిన ఇతర వివరాలను మైఖేల్‌సన్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పంచుకున్నాడు. తనకు బీర్ తాగే అలవాటు లేదని.. కానీ దీనినే ఇంధనంగా మార్చి.. బైక్‌కు వినియోగించాలని ఆలోచన వచ్చినట్లు చెప్పాడు.
మూవీ స్టంట్ మరియు అంతరిక్ష జౌత్సాహికుడైన మైఖేల్‌సన్ గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి అనేక ఆవిష్కరణలు చేశారు. మరియు తన ఇంటినే మ్యూజియంగా మార్చుకున్నారు. ప్రదర్శనల తర్వాత ఈ బైక్‌ను తన ఇంట్లోని మ్యూజియంలో ఉంచుతానని మైఖెల్‌సన్ తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటివి మరిన్ని ఆవిష్కరణలు చేస్తాననని మైఖేల్‌సన్ వెల్లడించారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








